భక్తి కథలు

హరివంశం 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుకైటభులు తమ బ్రహ్మాండమైన దేహాలతో అనేక యుగ కాలాలు ఏకార్ణవంలో సుప్తి చెందారు. తరువాత వాళ్ళకు మెలకువ వచ్చింది. తమ మహాకాయాలను చూసుకొని విర్రవీగిపోయారు. మదగర్వంతో ఉద్రేకించారు. చేతులతీట తీర్చుకోవాలని తెగ ఉబలాటపడ్డారు. కన్నూ మిన్నూ కానని అతిశయంతో ఎవరితో యుద్ధం చేయాలా? అని ఆ ఏకార్ణవంలో వెతుకులాట సాగించారు.
చతుర్ముఖుడు కూడా అమిత ఛాయభీతుడై శ్రీమహావిష్ణువు నాభీ పద్మంలో దాక్కున్నాడు వాళ్ళ ఆటోపం చూసి. అపుడు విష్ణుమూర్తి వాళ్ళకు ఎదురైనాడు. మధుకైటభులు ఆ దేవదేవుణ్ణి చూసి భుజాల తీటతో ఉప్పొంగిపోయి ఆయనతో యుద్ధం చేశారు. అనేక దివ్య సహస్రాబ్దాలు గడచిపోయినా తాము ఎంత పరాక్రమం చూపిస్తున్నా ఏ మాత్రం అలసట లేకుండా తమను, నిర్వీర్యులను చేస్తున్న ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో తమకు చావు ఎట్లాగూ తప్పదని ‘నీ పరాక్రమం అత్యంత ప్రశంసాపాత్రం. నీవు కొంచెం కూడా డస్సిపోలేదు.
మాకు ఎట్లాగూ ఇక చావు తప్పదు. నీతో యుద్ధం చేసి ఓటమి పాలుకావడం మాకు కీర్తికరమే! అయితే మాదొక చిన్న కోరిక. దానిని మన్నించి, నీరు మాపై చిందకుండా, మమ్ముల్ని అంటకుండా సంహరించవలసిందని వాళ్ళు కోరారు. అపుడు జలజాక్షుడు ఓరీ! మీ కోరిక ఇదా! అని వాళ్ళిద్దరినీ తన బాహుమూలలలో ఇరికించి గజిబిజి చేసి ఊపిరిసలపకుండా అదిమివేసి వాళ్ళ పీచమణచి చంపివేశాడు.
వాళ్ళ సర్వాంగాలూ శిథిల బంధమై పోయినాయి. వాళ్ళు నుజ్జునుజ్జయిపోయినారు. ప్రాణ రహితులైనారు. అంతటితో వాళ్ళ మృతకళేబరాలను జలరాసిలో విసిరివేశాడు శ్రీమహావిష్ణువు. ఉత్తుంగ తరంగాల తాకిడికి వాళ్ల శరీరాలనుంచి మేధస్సు, కొవ్వు ఒక చోట చేరి బహు విశాలమైన తెట్టు కట్టింది. ఈ విధంగా జలరాసి నుంచి భూమి ఉద్భవించింది. మేధస్సు తెట్టుగట్టి భూమండలం ఏర్పడటంవల్ల మేదిని అనే పేరు వచ్చింది భూమండలానికి అటు తర్వాత. ఇట్లా ఉద్భవించిన ఇలాతలాన్ని మేదిని అని ప్రథ వహించేట్లు సంకల్పించినవాడు అచ్యుతుడే.
ఇక నా పాట్లు అప్పటినుంచి మొదలైనాయి. ఆ తర్వాత కొంతకాలానికి జలధి విలోల మగ్ననై మునిగిపోయిన నన్ను ఆదివరాహరూపుడై ఆ మహానుభావుడు ఉద్ధరించాడు. నన్ను అనేక విధాల ఆ ప్రభువు సంరక్షించాడు. త్రివిక్రమావతారంలో ఒక అడుగు మేర నన్ను ఆక్రమించి రక్షించాడు. నాకు ఎటువంటి కలత సంభవించినా తీర్చవలసినవాడు ఆ జగద్రక్షకుడే. సర్వకాల సర్వావస్థలలో నేను ముకుంద పాదారవింద వందనాభిలాషిని. ఆయననే నమ్ముకొని ఉన్నాను. సకల లోకాలకు ప్రభువు ఆయనే.
శంఖ కౌమోదకీ చక్ర చారుహస్తుడు ఆ ప్రభువు. మొక్కుకున్నవారిని ఆదుకుంటాడు ఆ ప్రభువు. అనాథనాథుడు. అస్మన్నాథుడు. జగదేకవిభుడు. విష్ణువు. ప్రభవిష్ణువు. ఇపుడు ఆయనే నాకు దిక్కు. ఆయన సన్నిధికి ఆశ్రయించటానికి వచ్చాను. నాకు వేరే దిక్కు ఇంకెవరూ లేరు. సువర్ణానికి అధిష్ఠానదైవం అగ్ని. తేజస్సులన్నిటికీ అధిష్ఠానం సూర్యుడు. తారకలకు ఏడుగడ శశి.
వీళ్ళు ఆయా దైవాల పాలనలో ఉంటారు. ఆలన పొందుతారు. అట్లానే ముకుందుడే నాకు ఆలనా పాలనా ఆశ్రయమూ, సంరక్షణా చేకూరుస్తాడు. సమస్త చరాచర సృష్టికి నేను స్థానీయురాలిని, ఆధారం అనే కీర్తి నాకు దక్కటానికి మూలాధారమైన వాడు వాసుదేవుడే కదా! అందరికీ నేను ఆధారమైతే ఆయన నాకు ఆధారం. పరశురాముడు భూలోకంలో ఉన్న రాజులనందరినీ సంహరించాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు