భక్తి కథలు

హరివంశం 151

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు అష్టమహిహులతో, పదారువేల దివ్య కాంతలతో ద్వారకా నగరాన్ని ఇలలో దివ్యాతి దివ్య థామంగా శోభింపజేస్తుండగా ఇంద్రుడు స్వర్గలోకంలో అదితి కొండలాలు శ్రీకృష్ణుడు తెచ్చి ఇచ్చినందుకు మోదమూ, పారిజాతాన్ని పెకలించుకొనిపోయినందువల్ల శచీదేవి విచారము భావించి ఖేదమూ రెండున్ను అనుభవిస్తూ కాలం గడపసాగాడు.
ఇట్లా సకల ధన ధాన్య సంపదలతో, సమస్త విస్తార ఐశ్వర్య యశో విభవంతో ద్వారకా నగరం విరాజిల్లుతుండగా భూవలయంలోని రాజులందరూ ఆ మహానగరాన్ని ఒకసారి దర్శించాలని ఎంతో కుతూహలపడసాగారు. ఇంతలో హస్తినాపురంలో గొప్ప యజ్ఞం తలపెట్టి అందరు రాజులకూ దుర్యోధనుడు ఆహ్వానాలు పంపాడు. వారంతా హస్తినాపురానికి వచ్చి ఆ యజ్ఞం చూసి ఆనందించారు. యజ్ఞం పరిసమాప్తి అయిన తరువాత అందరూ కూడబలుకుకొని ఒక దూతను ద్వారకా నగరానికి పంపారు, మేమంతా ద్వారకానగరాన్ని, తదాశ్రయుడవైన నిన్ను చూడాలని ఉత్సాహభరిత మనస్కులవుతున్నాము అని శ్రీకృష్ణుడికి. ఆ దూత ద్వారకా నగరం చేరి సకల రాజన్యుల మనోరథం తెలియజేయగా యదు కులపతి అందుకు ఎంతో సంతోషంగా సమ్మతి తెలిపాడు. వెంటనే రావలసిందిగా శ్యామ సుందరుడు మారు దూతను పంపి తన ఆహ్వానం ఆ రాజలోకానికి అందజేశాడు. ఆ రాజులంతా తమ చతురంగ బలాలతో తమ తమ విభవాన్ని చూపుకుంటూ ద్వారకా నగరం చేరుకున్నది. అట్లా సకల ధరాధిపతులు కదలి వస్తున్నపుడు వారి వారి రధ తురగ గజ పదాతి సమూహాలవల్ల రేగిన పెంధూళి సూర్యకాంతినే మసకపరచే విధంగా చేసింది.
ఇట్లా నూరుగురు కౌరవులు, దుర్యోధనుడి సామంతరాజులైన పెక్కు భూపతులు, పాండవులు ఐదుగురు వారి బంధు బలగంలో చేరిన దృష్టద్యుమ్నుడు మొదలైన రాజులు పాండ్య చోళకాళింగులు మొదలైన ధరాధిపతులు అందరూ కలిసి రావటంతో వారి సేనావాహిని పద్ధెనిమిది అక్షౌహిణులుగా కూడుకొన్నది. ఈ రాజులంతా తమ సేనలతో వచ్చి రైవతకాద్రి ప్రాంతంలో విడియటంవల్ల అనేక యోజనాల పొడవు ఆ ప్రాంతమంతా వేరు వేరు చిన్న చిన్న పట్టణాలలాగా భాసించింది వారి వారి గుడారాలు, వస్తు వాహన సామగ్రి ధ్వజ పతాకలతో.
చుతరంగ బల సమేతుడై దివ్యోజ్జ్వల రథం ఎక్కి బలదేవుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు తన వెంటరాగా, దివ్యాయుధాలు ధరించి శ్రీకృష్ణుడు ఈ రాజులను గౌరవించటానికి, స్వాగతం చెప్పటానికి వెళ్లాడు. వారంతా ఆయనను దర్శించటానికి రాగా వారందరికీ మర్యాదలు చేశాడు. మన్ననలు పలికాడు. తన కొలువుకు ఆహ్వానించి ఉచితాసనాసీనులను చేసి విలువల కానుకలు, అనర్ఘ వస్త్రాలు బహూకరించాడు.
‘నేనూ, నా సకల బంధువులూ, సంపదలు మీ అధీనం. మేమంతా మీవారం. మీరు నా నుంచి ఏది కోరినా నేను ఇస్తాను. ఒకవేళ నా దగ్గర లేకపోయినా మీరు ప్రియపడినది ఏదైనా మీకు తెచ్చి ఇవ్వటానికి నేను సర్వసిద్ధంగా ఉన్నాను’ అని వారికి ఎంతో ప్రియం కలిగేట్లు వారికి సస్నేహ వచనాలు పలికాడు. మన్నన మాటలు చెప్పాడు. ఆ రాజులు కూడా ఆయన పట్ల ఎంతో స్నిగ్థులైనారు, ఎంతో ఆనందించారు ఆయన మాటలు విని. ఇంతలో ఆకాశంలో వారికో కుతూహలకరమైన దృశ్యం కన్పట్టింది. మెరుపుతో కూడిన శ్రావణమేఘంలాగా ధవళ శరీరుడు, తలపై సంజ కెంజాయ జటాజూటుడు అయిన నారదుడు గగనతలం నుంచి నెమ్మదిగా ఆ సభలోకి వచ్చాడు. ఆయన చేతిలోని వీణతంత్రులను మీటుతూ నీల నీరద శుభాంగుణ్ణి గూర్చి పాడుతున్నాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు