మంచి మాట

ప్రేమ - వ్యామోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు ప్రేమికులమధ్య అనుబంధాన్ని ప్రేమ అని పిలుస్తాము. ప్రేమ వివాహంతో ముగుస్తుంది. వ్యామోహం అన్నది కోరిక తీర్చుకొనేవరకే. ఒకవేళ వ్యామోహం ప్రేమగా మారి వివాహం అనే పరిణామం చెందవచ్చు. ప్రేమ విషయంలో పుత్రప్రేమకు ప్రాధాన్యత ఉన్నది. దీనికి ప్రబల తార్కాణం దశరథ మహారాజు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనడం ఎవరికైనా అవసరమే! అది ధర్మం కూడాను. దశరథుని విషయంలో అది పుత్ర ప్రేమకు అవరోధం అయింది. ఈ రెండు పరిస్థితులమధ్య మానసిక సంక్షోభం దశరథుని ఎంతగానో కలచివేసింది. పుత్రుడు కూడా తండ్రికి తగు విధంగా సహకరించినపుడే ఈ సంక్షోభ పరిస్థితినుండి తండ్రి బయటపడగలుగుతాడు. శ్రీరామచంద్రుడు చేసిన పని అదే! అడవులకు తానే ఇష్టపూర్వకంగా వెడతానని, మీరు ఇచ్చిన మాటనుండి వెనకకు వెళ్ళే అవసరం లేదన్నట్లు తండ్రికి సహకరించిన ఆదర్శ పుత్రుడు శ్రీరామచంద్రుడు.
దేవవ్రతుడు కూడా ఇలాంటి త్యాగ పురుషుడే, మహనీయుడే! తండ్రి దాశరాజు పెట్టిన షరతులు కుమారుడికి చెప్పడానికి సందేహిస్తున్న తరుణంలో తానే చొరవ తీసుకొని మీ అమ్మాయికి కలిగిన సంతానానికే రాజ్యం లభిస్తుందని చెప్పడమే గాక తాను వివాహం చేసుకోనని కూడా చెప్పి సత్యవతి తండ్రి సందేహాలను తొలగించాడు. పుత్రునికి తండ్రిపైగల ఆదర్శ ప్రేమకు భీష్ముడే చక్కని ఉదాహరణ!
దశరథుని వృత్తాంతానికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తించిన వ్యక్తి ధృతరాష్ట్రుడు. తన కుమారుడు దుర్యోధనునిపై ఆయన ప్రేమ అవధులు దాటి అది వ్యామోహంగా మారింది. దృతరాష్ట్రుని ముఖ్య సలహాదారులు ఇద్దరు. ఒకరు విదురుడు. రెండవవాడు సంజయుడు. ఒక్కొక్కసారి వాళ్లను సలహా అడిగేవాడు దృతరాష్ట్రుడు. ఒకవేళ వారి సలహా తన ముద్దుబిడ్డ అయిన దుర్యోధనునికి నచ్చదని భావిస్తే నిర్ద్వంద్వంగా ఆ సలహా తిరస్కరించేవాడు. సంజయుని పాండవుల వద్దకు రాయబారానికి పంపినపుడు ధర్మరాజుతో ‘‘ఒకవేళ కౌరవులు శాంతికి అంగీకరించకపోయినా మీరు శాంతి మార్గం నుండి ప్రక్కకు వెళ్ళారు’’ అంటూ అజాత శత్రువు అయిన ధర్మజుని ముందు వాళ్ళకు బంధాలు వేశాడు. ఇంకా తన పుత్రులు తన మాట వినకపోయినా ఆదర్శవంతమైన నిర్ణయమే మీరు తీసుకోగలరు’’ అని కూడా చెప్పడంలో ఆయనకు గల పుత్రవ్యామోహం ఏపాటిదో తెలుస్తుంది. ఇందులో తన అశక్తత కూడా వ్యక్తమవుతుంది.
తన కుమారులు అధర్మపక్షంలో ఉన్నా వాళ్ళే గెలవాలని ఆ పెద్దరాజు మనోభీష్టం. అందుకే ఒక రోజున సంజయునితో ‘‘నీవు రోజూ కౌరవ పక్షాన నష్టాలనే చెబుతున్నావు. ఇదేమిటని’’ అని అడిగాడు. ధర్మం పాండవుల పక్షాన ఉన్నందున వాళ్ళు విజయాలు పొందుతున్నారని తెలిసి కూడా ఇలా అడుగుతున్నాడంటే దానికి కూడా మితిమీరిన పుత్ర వ్యామోహమే కారణము. జూదంలో ఓడిపోయిన పాండవులు నగరం నుండి వెడలిపోయిన విషయం విదురుడు చెప్పినప్పుడు కూడా ధృతరాష్ట్రుడు ‘‘ఈ శత్రుత్వము సర్వనాశనానికి దారితీస్తుందని నాకు తెలుసు. అయినా నేను నిస్సహాయుడను’’ ఈ విధంగా అదుపులో పెట్టలేకపోయిన వ్యామోహం చివరకు కొడుకు మరణానికి, కౌరవ వినాశనానికి దారితీసింది.
వ్యామోహం అంటే ధన వ్యామోహం, స్ర్తి వ్యామోహం కూడా కావచ్చు.ఇది ఒక బలహీనత. ఎన్నో మంచి లక్షణాలున్నా, ఎన్నో శక్తులు ఉన్నా ఈ ఒక్క అవగుణం వుంటే అంతే సంగతులు.పర స్ర్తి వ్యామోహంవలన ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో ప్రథమ స్థానం బహుశా కీచుకుడిది అయి ఉంటుంది. ఇక అన్నిటికంటే పెద్ద ఉదాహరణ రావణుడే. సాక్షాత్తు పరమశివుని భక్తుడిగా పేరొందిన రావణబ్రహ్మ సీతామాతను కోరుకొని ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. ఇలా వ్యామోహం వల్ల అనర్థాలు జరుగుతాయని మనకు చరిత్ర చెప్తోంది.
వ్యామోహం ఏ రకానికి చెందినది అయినా అభిలషణీయం కాదు. పైగా ప్రమాదకరం కూడాను!

-కాకుటూరి సుబ్రహ్మణ్యం