భక్తి కథలు

హరివంశం - 166

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదర్శన చక్రం ఆయనకు కావలసిన పూలు సమకూరుస్తూ ఉండేది. నందకం ఆయనకు కావలసిన కుశలు సంగ్రహించుకొని తెస్తుండేది. శార్గం ఆయనకు ఎటువంటి దైత్య దానవ విఘ్నాలు కలగకుండా కావలిగా ఉండేది. దిశావలయాలను పాంచజన్యం పర్యవేక్షిస్తూ ఉండేది. కౌమోదకి ఆయనకు కావలసిన వస్తువులు తెచ్చిపెట్టేది. ఇట్లా ఆయన దివ్యాయుధాలు ఆయనకు సమస్త పరిచర్యలు చేసేవి. ఒక నెల అంతా ఒక పదార్థం ఆయన ఆహారంగా తీసుకునేవాడు. మరొక నెల మరొకటి, ఆ తరువాత ఇంకొకటి అయిన అశన నియమం ఆయన పాటించాడు. ఇట్లా ప్రతి సంవత్సరం పర్యాయక్రమంగా ఆహార విధులు నిర్వర్తిస్తూ శ్రీకృష్ణుడు ద్వాదశ వర్షాలు తప నియమాలు నిష్ఠగా నెరవేర్చాడు. పనె్నండో సంవత్సరం మాఘమాసంలో అచంచల నిష్ఠతో ప్రణవం, రుద్రాధ్యాయం పర్యాయక్రమంగా జపించాడు. ప్రణిధానతత్పరుడైనాడు.
ఈ విధంగా పనె్నండు సంతవ్సరాలు అతి కఠిన నియమ వ్రతోపాసన తత్పరుడై తపస్సు చేయటంవల్ల ఆయన శరీరం చిక్కిపోయింది. ఆయన ధరించిన జటలు కపిన వర్ణకాంతి కలితమై ప్రకాశించాయి. పురాణ పురుషుడు, దేవార్చితుడు దేవకీనందనుడు, ప్రభువు, యదుకులాంభోరాశి పూర్ణశశి ఈ విధంగా తపస్సు చేశాడని, ఆయన శరీరం తపో నిరతి క్లేశంతో పరిశుష్కమైందనీ దేవతలంతా దేవేంద్ర సహితంగా ఆయనను దర్శించాలని కైలాసానికి తరలి వచ్చారు. యమ కుబేర వరుణులు తమ తమ పరివారాలతో ఇంద్రుణ్ణి పరివేష్టించి అక్కడకు వచ్చారు. వీరితో అశ్వినులు, వసువులు, సిద్ధచారణులు, ఇంకా గణదేవతలు అక్కడకు చేరుకున్నారు. పర్వత నారదాది మునివరులు వచ్చారు. గంధర్వుల గానాలు, కిన్నరుల వీణావాదనలు, అప్సరసల నాట్యాలు, చారణ సంకీర్తనములు అక్కడ వెల్లివిరిసాయి.
ఈ పురాణ పురుషుడు, యోగి హృధ్యానగమ్యుడు, ఇక్కడ ఎందుకు తపస్సు చేస్తున్నాడో, దేవతా కామితార్థ వరప్రదుడైన ఈ సకల లోకాధినాథుడి కామితం ఏమిటో, ఈయన కోర్కె తీర్చగలవారెవరో అని దేవతలంతా ఆశ్చర్యపడుతూ తమలో వితర్కించుకోసాగారు. ఆ రోజుతో కృష్ణుడి తపస్సు పూర్తి అయింది.
ఆ మరుసటి రోజు అనంత దయావిధేయుడు, అష్టమూర్తి, అప్రమేయ ప్రభావుడు, ఆదిదేవుడు, అజుడు, సాంఖ్యయోగ జ్ఞాన సరణి పరమ గమ్యుడు, ఆద్యంత రహితుడు, మహాదేవుడు అంబికతో కూడి వృషభ వాహనుడై అచ్యుతుణ్ణి ప్రీతి పూర్వకంగా సమాదరించటానికి శ్రీకృష్ణుడి మ్రోల ప్రత్యక్షమైనాడు. ఆయన పార్శ్వంలో యక్ష రాక్షస గణ పరివారుడై, పుష్పక విమానం ఎక్కి వైశ్రవణుడు (కుబేరుడు) కూడా వచ్చాడు. ఒక పక్కన మహామూషిక, మయూర వాహనులైన కరివదనుడు, కార్తికేయుడు వచ్చారు. నందివాహనుడి ముందు భృంగి, మహాకాళులు వేత్రహస్తులై వచ్చారు. ఇరుప్రక్కలా, చుట్టూనూ పరివేష్టించి ఘంటాకర్ణ, శంఖకర్ణ, విరూపాక్ష, దీర్ఘరోమ, దీర్ఘనాస, దీర్ఘలోచన, దీర్ఘబాహు, దీర్ఘముఖులైన ప్రమథ గణం బరాబరులు చేస్తూ గడిచింది. కుండోదరుడు మొదలైన ముఖ్య కింకరులు వేత్రహస్తులైనారు. ఈ ప్రమథ గణం పరమ శివుడు పరమ భక్తులు. లయకాలంలో వీళ్ళు విజృంభిస్తారు. చంద్రశేఖరుడి వంటి చిహ్నాలే వీరు ధరిస్తారు. సృష్టి స్థితి లయవేళలో ఈ రుద్ర గణాలు స్వామి ఆజ్ఞానువర్తులుల. దేవతలందరికీ వీరు నమస్కారార్హులు. శివుడిట్లా కృష్ణుడికి సాక్షాత్కారమిస్తున్నాడని తెలియగానే సకలము, వరులు వారిని ఒక చోట దర్శించుకోవచ్చుననే పరమోత్సాహంతో అక్కడకు వచ్చారు. మహేశ్వర భక్తులు వేద సూక్తాలతో శివుణ్ణి స్తుతిస్తున్నారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు