భక్తి కథలు

హరివంశం 187

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరి హర పద్మగర్భులను, రవీందు తారకలను, నదులను, కొండలను, అగ్ని, వాయువులను ఎవరిని స్తుతించినా, ఆ స్తుతులన్నీ నీ పరమైనవిగానే ఫలిస్తాయి అంజబు వదనా!
అష్టాదశ బహుస్వరూపిణివిగా, పరమోజ్జ్వల మణిగణనికరకిరీట శోభితురాలిగా త్రిదశేశ్వరీ, నీకు నమస్కరించే వారి సుకృతమెంతని వర్ణించగలను? వారు ధన్యులు. వరదాయిని, మహిషాసురమర్దిని, వైదిక సంప్రదాయ ఆదిమ బ్రహ్మరూపిణి, శివసుందరి, నారాయణి, అచలకన్య అని నిన్ను అర్చిస్తారు కదా తల్లీ! నన్ను ఇప్పుడు అనుగ్రహించు. నా దుస్థితిని బాపు. నా కష్టాలు గట్టెక్కించవమ్మా, నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదలన్నీ తొలగిపోతాయని నిన్ను ఆర్యులు కీర్తిస్తారు కదా ఆర్యా! నన్ను కరుణించు. ఇవే నా వతులు, మొక్కులు. ఇవే నా కీర్తనలు. నీవు సర్వభద్రవు. నన్ను కాపాడలెమ్ము. రమ్ము అని భక్తి వివశాత్మకుడై అనిరుద్ధుడు ఆత్మార్పణం చేసుకున్నాడు ఆశ్రీత ఆర్తి విమోచనకు.
ఈ భక్త్యాత్ముడి స్తోత్రానికి తనిసి జగన్మాత అనిరుద్ధుడికి కాళికారూపంలో ప్రత్యక్షమై, తన కర స్పర్శతో సర్వ బంధన విముక్తుణ్ణి చేసింది. చక్రధారుడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. సర్వశుభాలు నిన్ను చేకూరనున్నాయి అని కటాక్షించింది. నీవు సర్వమంగళప్రదమైన స్తోత్రంతో నన్ను స్రవించావు. ఈ స్తోత్రం సకల శక్తిప్రదాయిని. సకలాపన్నివారిణి. సమస్త సంపత్ప్రదాయిని. నీ బంధం నీకు మేలు చేకూర్చటమే కాక సమస్త లోకానికి క్షేమంకరంగా పరిణమించటానికే కారణమైంది. శ్రీకృష్ణుడికి నీ బంధం గురించి తెలియగానే వచ్చి బాణుడి పటాటోపం అణచివేస్తాడు. సర్వదేవతలు భయకంపితులయ్యే యుద్ధం జరగబోతున్నది. బాణుణ్ణి ఎవరూ రక్షించలేరు. నీవు ఉషతో చిరకాలం సుఖించగలవు అని అనిరుద్ధుణ్ణి ఆశ్వాసించి అంతర్థానమైపోయింది కాళి. అనిరుద్ధుడు కలకదేరి శ్రీకృష్ణాగమనం కోసం నిరీక్షిస్తున్నాడు. బాణపురంలో కథ ఇట్లా జరుగుతుండగా ద్వారకానగరంలో అనిరుద్ధుడి అంతఃపురంలో గొప్ప సంక్షోభం చెలరేగింది. అనిరుద్ధుడేమైనాడు, ఎక్కడకు పోయినాడు, ఇప్పుడెక్కడున్నాడు, ఎవరు తీసుకునిపోయినారు, ఎందుకు తీసుకొనిపోయినారని అనిరుద్ధుడి రాణివాసమంతా గగ్గోలు పడసాగారు. ఏడ్పులు సాగించారు. పెద్ద కలకలం రేకెత్తించారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి శ్రీకృష్ణుడి అంతఃపురంలో కూడా కలకలం బయలుదేరింది. ఏడ్పులూ, వెక్కులు, రోదనలూ బయలుదేరాయి. రకరకాలుగా అక్కడి అంగనాజనం ఒకరికొకరు ఈ వైపరీత్యం గూర్చి చెప్పుకోసాగారు. ఇంతలో ఈ వార్త శ్రీకృష్ణుడికి, బలరాముడికీ కూడా తెలిసింది. వాళ్ళకు కూడా విస్మయమూ, విచారమూ, వింత అనిపించింది ఈ సంఘటన. వాళ్ళు కూడా విచేష్టితులైనారు. వారి వదనాలలో కూడా దైన్యభావం పొడకట్టింది. అప్పుడు యాదవ వృద్ధుడైన వికద్రుడు ‘మీరే ఇట్లా బాధపడితే ఏం ప్రయోజనం? ఇంద్రుడు కూడా తనకు విపర్దశ దాపురించినప్పుడు నీ శరణు వేడుతాడు. దేవతలను ఎన్నిసారులో కాపాడి, రక్షించినవాడివి నీవు. నీవే ఇట్లా చింతిస్తే మేమేమి చెప్పగలం. ఇప్పుడు చేయవలసిందల్లా అభిమన్యుడెక్కడ ఉన్నాడు అని ఆరా తీయాలి కాని, ఇట్లా దిగులు పడడం తగని పని అని చెప్పాడు.
‘నాకింత అవమానం జరిగిందని బాధపడుతున్నాను కాని, నాకెవరో ఏదో హాని తలపెట్టగలరని కాదు’ అని అక్కడవారిని ఊరడిల్లజేశాడు. ‘ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి?’ అని యాదవ వీరులను కోరాడు కృష్ణుడు. అప్పుడు సాత్యకి ద్వారకానగరంలోపలా, బయటా, అతడు తరచు విహరించే ప్రదేశాలలోనూ, దగ్గర దూరపు రాజ్యాలలోనూ అనిరుద్ధుడి పొలకువ తెలుసుకోవటానికి చారులను పంపుదాము’ అని చెప్పాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు