భక్తి కథలు

హరివంశం 188

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది అవశ్యం చేయవలసిన పని అని ఉగ్రసేన మహారాజు సాత్యకి మాటలను బలపరచాడు. ఆలస్యం చేయవద్దని హెచ్చరించాడు. అప్పుడు ద్వారకానగరంలో భేరులు మ్రోగించారు. హెచ్చరికలు పచారించారు. శ్రీకృష్ణుడు రథచారులను, అశ్వచారులను, పాదచారులను రైవతం, లతావేష్టం, ఋక్షవంతం మొదలైన విహార క్రీడాపర్వతాలు వెదకటానికి పంపించాడు. వివిధ ఉద్యానవనాలో అనే్వషించవలసిందిగా చెప్పాడు. నదీ తీరాలలో, సరోవర తీరాలలో కొండ సెలయేళ్ళ ప్రదేశాలలో వెదకి చూడవలసిందిగా వారికి చెప్పాడు. ఆ తరువాత అనాదృష్టి అనే యాదవ సేనాపతి శ్రీకృష్ణుడికిట్లా విన్నవించాడు. ‘ప్రభూ! ఇది ఇంద్రుడి పని కాదు కదా! నాకు సందేహంగా ఉంది. పారిజాతం నందనవనం నుంచి అతడికిష్టం లేకుండా తెచ్చావు. ఎన్ని సందర్భాలలోనో తనను కాపాడావనీ, రక్షించావనీ విశ్వాసం లేకుండా అప్పుడు నీపై యుద్ధానికి కూడా వచ్చాడు. అతడేమైనా నీపై మనసులో విరోధం పెట్టుకొని ఈ పాడు పనిచేశాడేమోనని నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. సరే ఇది ఇట్లా ఉంచి రాక్షసులు ఎన్నిసార్లో నీవల్ల భంగపడ్డారు. వినాశనం చెందారు. వారిలో, వారి పుత్ర పౌత్రులలో ఎవరైనా పగ పూని ఈ పని చేసి ఉండవచ్చు. నాకు ఇంద్రుడిపట్లనే అనుమానం మొగ్గుగా ఉంది’ అని అన్నాడు.
అప్పుడు కృష్ణుడు స్మేరాననుడైనాడు. ‘ఇది రాక్షసుల పనే అయి ఉంటుంది కాని దేవతలు ఇటువంటి పని చెయ్యరు. వాళ్ళు కృతఘు్నలు కారు. నాపట్ల ఎప్పుడూ కృతార్థులయ్యే ఉంటారు’ అన్నాడు శ్రీకృష్ణుడు. అక్రూరుడు కూడా శ్రీకృష్ణుణ్ణే సమర్థించాడు. ఇది పురుషులెవరూ చేసిన పనికాదు. ఎవరో వలపుకత్తె మాయ పన్ని ఎత్తుకొని పోయినట్లున్నది అన్నాడు కృష్ణుడు. ఇంతలో అనిరుద్ధుణ్ణి పంపటానికి కృష్ణుడు పంపిన చారులందరూ వచ్చి బిక్కమొగాలు వేసుకుని ఆయన ముందు నిలుచుని చేతులు పిసుక్కుంటూ దేవా! ఎక్కడా అనిరుద్ధుణ్ణి కానలేకపోయినాము’ అని చెప్పారు. కన్నీరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇట్లా ఆ పగలూ, రాత్రి గడిచాయి.
ఉదయం కాగానే యాదవులంతా సభ చేశారు. ఏం చెయ్యాలి? అని చర్చించుకుంటూ ఉండగా ఇంతలో నారదుడు అక్కడకు రానే వచ్చాడు. ఆయన్ను చూసేసరికి వాళ్ళకు చాలా ఉత్సాహం కలిగింది. సూర్యుడూ, చంద్రుడూ ఏకకాలంలోనే తమ విచార కారణం కనుక్కోవటానికి వచ్చిన అనుభూతి కలిగింది. త్రిలోక సంచారి నారదుడికి ఈ విషయం తెలియకపోదు. ఇతడేదో చల్లటి వార్త చెప్పటానికే వచ్చాడనుకున్నారు. ఇక ఎవరితో పోరాలో, అక్కడకు ఎట్లా చేరాలో కూడా నారద మహర్షి తప్పక చెపుతాడనేవాళ్ళు స్వస్థచిత్తులైనారు.
శ్రీకృష్ణుడు నారద మహర్షికి అర్ఘ్యపాద్యాది సత్కారాలు చేశాడు.
‘ఎందుకు మీరంతా విచార వదనాలతో ఉన్నారని?’ నారద మహర్షి వాళ్ళను ప్రశ్నించాడు. అప్పుడు మా అనిరుద్ధుడు కనపడటం లేదు. మా వాణ్ణి మా కన్నుగప్పి ఎవరో అపహరించుకొనిపోయినారు. ఇదీ మా చింతకూ, వంతకూ కారణం! అని వాళ్ళు నారద మహర్షికి తెలియజేశారు. ‘మా అదృష్టంవల్ల నీవు ఇక్కడకు వచ్చావు మహానుభావా! ఈ లోకంలో నీకు తెలియరాని విషయం అంటూ ఉండదు. మా అనిరుద్ధుడి జాడ చెప్పగలవని మా ఆశ. ఇక మావాడు మాకు దక్కినట్లేనని మాకు ఊరట కలుగుతున్నది’ అన్నారు యాదవులు.
నారదుడు పకపక నవ్వాడు.
‘ఆహా! ఏమి యుద్ధం. ఏమి పరాక్రమం. ఏమి శౌర్యం, ఏమి తెగువ! ఏమి సాహసం. మీ అనిరుద్ధుడు, సహహ్ర బాహువులు నాకున్నాయని చెప్పుకొంటున్న బాణాసురుణ్ణి భయగ్రస్తుణ్ణి చేశాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు