నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ఆర్తిహరక్రియాభిరతుఁ డై కృతసన్నిని యై ప్రదక్షిణా
వర్త శిఖాగ్రహస్తముల వహ్ని మహాద్విజ దివ్యమంత్రని
ర్తర్తిత హవ్యముల్ గొనుచు వారి జ వైరికులేశ నీకు సం
పూర్తమనోరభంబులును బుణ్య ఫలంబులు నిచ్చుచుండెడున్
భావం:చంద్రవంశంలో పుట్టిన జనమేజయ మహారాజా! బాధను తొలిగించే కర్మల దాసకుడై సన్నిహితుడై (ప్రత్యక్షమై)అగ్ని బ్రాహ్మణోత్తముల దివ్యమంత్రాల చేత హోమం చేయబఢిన అన్నాది హవ్యాలను కుడికి తిరిగే జ్వాల అనే ముంజేతులతో గ్రహిస్తూ నిండైన కోరికలను పుణ్యాల ఫలితాలను నీకు ఇస్తూ ఉండుగాక!ఆస్తీకమహాముని సర్పయాగం నిలుపు చేయాలని వచ్చి జనమేజయ మహారాజును అతని వంశచరిత్రను, అంతకు పూర్వపు రాజులు చేసిన యజ్ఞయాగాదులను చెబుతూ చక్రవర్తిని పొగిడి చివరకు జనమేజయమహారాజుకు శుభాలు కలుగాలని ఆశిస్తూ దీవిస్తున్నారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము