భక్తి కథలు

హరివంశం 218

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఏ ఉపద్రవమూ కలగదు. ఏ భయమూ కలగదు. కృష్ణుడికీ విషయం తెలుసు. ఆయనకు ఇటువంటి అనర్ఘమణి ఉగ్రసేన మహారాజు దగ్గర ఉంటే రాజ్యానికంతా మేలు కలుగుతుంది. ధన ధాన్య సంపదలతో తరగని ఐశ్వర్యంతో ప్రజలు సుఖపడతారు అనే అభిలాష జనించి వారి దగ్గర వీరి దగ్గర ఈ ప్రస్తావన తెస్తూ వచ్చాడు.
సూటిగా సత్రాజిత్తునే అడగటానికి దేవదేవుడికి అభిమానమనిపించింది. తనను అత్యాశపరుడు అనుకోవచ్చు సత్రాజితే కాక ద్వారకావాసులు కూడాను అని ఆయనకు బిడియం కలిగింది. ఒకవేళ కృష్ణుడే దీనిని తనకివ్వవలసిందని అడిగితే తన గతి ఏమిటి? అని ఆందోళన చెందుతూ వచ్చాడు సత్రాజిత్తు. ఇవ్వను అని చెప్పలేని స్థితీ, ఇవ్వక తప్పనిసరి స్థితి కూడా ఎట్లా పరిష్కరించాలి అని? విచారగ్రస్త మానసుడవుతూ వచ్చాడు. భయపడుతూ ఉండేవాడు. కృష్ణుడు కూడా బలాత్కరంగా దానిని తాను వశం చేసకుంటే కుటుంబ కలహం సంభవిస్తుంది, లేనిపోనిది కావాలని తెచ్చిపెట్టుకోవడం ఎందుకని? శంకిస్తూ వచ్చాడు. అందరూ తనను తప్పు పడతారేమేమోనని జంకుతూనూ ఉండేవాడు. కాని బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర ఈ ప్రసక్తి వచ్చినపుడల్లా ఎవరైనా ఈ ప్రస్తావన సత్రాజిత్తుకు చేరవేయకుండా వుంటారా అని సంకేతంగా వెల్లడిస్తూ ఉండేవాడు. ఈ విషయం ద్వారకలో బంధుగణానికంతా తేటతెల్లంగా తెలిసిపోయింది. కాబట్టి సత్రాజిత్తు భయపడిపోయి ఆ మణిని తన సోదరుడు ప్రసేనుడికిచ్చి భద్రంగా ఉంచవలసిందని చెప్పాడు. కాని ఆ అన్నదమ్ములకిద్దరికీ ఒక విషయం తెలియదు.
అదేమంటే, ఈ మణిని అశుచి అయినవాడు, దురాచారుడైనవాడు ధరిస్తే అది అతడికి ఆపద తెచ్చిపెడుతుందని పాపం వారెరుగరు. అది చివరకు ప్రాణాపాయంగా కూడా పరిణమించవచ్చు అనుకోలేదు వారు. ఇక ప్రసేనుడు చాలా డాబుగా ఆ మణిని ధరించి మంచి గుర్రానెక్కి అడవిలో వేటాడానికి వెళ్ళాడు. ఈ మణిని చూసి అది ఒక మాంస ఖండమని భావించి ఒక సింహం గుర్రాన్నీ అతణ్ణీ కూడా చంపి ఆ రత్నాన్ని నోట కరచుకోబోతున్నంతలో జాంబవంతుడెక్కడనుంచో వచ్చి ఆ సింహాన్ని ఒక్క గుద్దుతో చంపివేసి పరిహాసిత వదనంతో సంబరంగా తన గుహలో ప్రవేశించి తన పసిబాలుడైన సుకుమారుడికి ఆడుకోవడానికి ఈ మణినిచ్చాడు. ఈ విధంగా మణి జాంబవంతుడి పరమైంది. ప్రసేనుడేమో ఇంటికి రాలేదు.
సత్రాజిత్తు కుటుంబంలో పెద్ద గగ్గోలు బయలుదేరింది. దగ్గర బంధువులందరికీ ఈ విషయం తెలిసిపోయింది. వేటకై పోయిన ప్రసేనుడు ఏమైపోయినాడు! ఆ మణి కోసం ఏ పాపాత్ములో అతణ్ణి హత్య చేసి ఆ మణిని దొంగిలించి తీసుకొని పోయి ఉండవచ్చునని గుసగుసలుగానూ, ఆ తర్వాత బాహాటంగానూ ఒకరికొకరు చెప్పుకోసాగారు. ఆ తరువాత క్రమంగా ఇది కృష్ణుడు చేసిన పనే అని చెవులు కొరుక్కోవటం సాగించారు. ఈ చెవినా, ఆ చెవినా అది కృష్ణుడి దగ్గరకు వచ్చి చేరింది. అనాదినిథనుడు, లోకేశ్వరుడు అయి ఉండి కూడా ఈ అపవాదు ఏమిటబ్బా!
ఎందుకు వచ్చింది? అని గుడుసుళ్ళు పడి ఈ నింద తొలగించుకోవటానికి ఎట్లానైనా ప్రసేనుడి చావు గూర్చి నిర్థారించటానికి బంధు సమక్షం అంతా వింటూ ఉండగా ప్రకటించి కొంతమంది ఆప్తులను, ఇటువంటి విషయాలలో నిగ్గు తేల్చగల కొందరు సమర్థులైన రాజోద్యోగులను వెంట బెట్టుకొని వింధ్య పర్వతం, ఋక్షవంత పర్వతం సమీపారణ్యాలలో ప్రసేనుడి వెదకటానికాయన బయలుదేరాడు. వెతకగా వెతకగా ఆయనకు ప్రసేనుడి మృత కళేబరం కనపడింది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు