డైలీ సీరియల్

ఒయాసిస్ 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరి దగ్గరా ఎంతుంటే అంతిచ్చారు. అయిదువేలు అప్పటికప్పుడు పోగయినయి. నేను ఎట్టా తీరుస్తానని గానీ, అసలు తీరుస్తానా లేదా అని కూడా సూడకుండా ఆళ్ల దగ్గరున్నది ఇచ్చారు. ఎందుకంటే, ఇరుగుపొరుగు ఒక చోట కల్సి మెల్సి ఉంటున్నాం అని సాయం చేశారు సారూ.. కానీ ఆస్పతాల్‌కి తీసుకెళ్తే పాతికవేలు కడితేగానీ చేర్చుకోమన్నారు. ఇప్పుడు అయిదువేలు కడతాం.. తెల్లారేక ఎట్టగోట్టా తెచ్చి మిగతా డబ్బు కడతామని బతిమిలాడాం. కాళ్లు పట్టుకున్నాం సారూ.. వాచ్‌మెతో గెంటించారు.. ఆ గేటు ముందే నా పెళ్లాం బాధతో గిలగిల్లాడతా, మెలికలు తిరిగిపోతా.. భరించలేక కేకలు పెడతా తన్నుకుంటా ఉంటే, మమ్మల్ని తరిమికొట్టారు సారూ.. బిడ్డ అడ్డం తిరిగిందట. యమయాతన పడింది.. గంటన్నరసేపు నరకం అనుభవించింది. డబ్బులేని మడుసులు ఈ లోకంలో బతికే ఈల్లేదా సారూ.. నా పెళ్లాన్ని ఆ ఆస్పటల్ వాళ్లు సంపేశారు సారూ.. ఉరి తీసేవాడికన్నా కొంత దయా, జాలి ఉంటాయేమోగానీ, ఈ డాక్టర్లు కసాయివాడికన్నా అధ్వాన్నం.. మడిసిని మడిసి సంపితే సిచ్చ ఏస్తారు గదా.. వాళ్లకేం సిచ్చ ఏస్తారు సార్.. మీరేసేదేంటి సార్.. దేవుడున్నారు. సూశారు గదా.. ఆ డాక్టరమ్మకేమైందో.. ఆమె సచ్చిపోతే మీరంతా నిద్దర మానేసి ఆడ కాపలా కాశారు. నా పెళ్లాన్ని ఆళ్లు సంపేస్తే.. మీకు సీమ కుట్టినట్లు ఉండదు. ఎందుకంటే మేం పేదోళ్లం.. పేదోళ్లంటే మీ దృష్టిలో బతికున్న పీనుగులు..’’ అంటూ సాంబయ్య కన్నీరు కార్చాడు.
అతనితో వచ్చిన పాతికేళ్ల కుర్రాడు చదువుకున్నవాడిలా ఉన్నాడు. ‘‘రూల్సు ప్రకారం ప్రతి ఆస్పటాల్ వాళ్లూ ఇరవై శాతంమంది పేదోళ్లకి ఫ్రీగా వైద్యం చెయ్యాలి సారూ..’’ అన్నాడు.
‘‘ఎవరు చెప్పారు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఎప్పుడో పేపర్లో చదివాను సర్.. కడుపు మండి మేం తిరగబడితే మా మీద కేసులు పెడతారు. ఇయ్యాల అహోబలరావు పెళ్లాన్ని చంపించాడు. మామీద కేసులు పెట్టినట్లు ఆయనమీద కేసు పెట్టి జైల్లో పెట్టే దమ్ముందా?’’ అన్నాడా యువకుడు ఆవేశంగా..
‘‘ఆయన చంపించాడని నీకు ఎలా తెల్సు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘్భర్యా రూపవతీ శత్రువు.. అని ఎవడో ఎప్పుడో చెప్పాడు. ఎవడి పెళ్లాం వాడికి శత్రువు. ఆయనే చంపించి ఉంటాడని మేం అందరం అనుకుంటున్నాం.. మేం మీకు రుజువులు సూపియ్యలేం.. సాక్ష్యాలు తీసుకురాలేం.. ఎవడి పెళ్లాం ఎవడితో పోతే మాకేంటి సర్.. మాకెందుకు సర్?.. కాకపోతే మా కళ్లముందు మా సాంబడి పెళ్లాం గిలగిలా కొట్టుకుని సచ్చిపోతుంటే కడుపు మండిపోయింది సర్...’’ అని ఆ కుర్రాడు పెల్లుబికిన కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
‘‘సారీ సాంబయ్యా.. మీరు చెప్పిందంతా వింటుంటే నాకూ బాధగా ఉంది.. జరిగిపోయిందానికి ఎవరేం చెయ్యలేరు.. నువ్వు చెప్పినట్లు నీ భార్య ప్రాణం ఒకటీ, డాక్టరమ్మ ప్రాణం ఒకటీ కాదు.. నీతో నేను ఏకీభవిస్తున్నాను. అసలు శిక్ష దేవుడే వేస్తాడు, ఎవరికైనా.. డబ్బు కోసం బతికినంత కాలం అడ్డమైన గడ్డి తిన్నా, చితి మంటల్లో కాలుతున్నప్పుడు నోట్ల కట్టలేవీ మన వెంట రావు..
సారీ సాంబయ్యా.. నిన్ను ఇంత దూరం పిలిపించి మళ్లీ అవన్నీ గుర్తుచేసి బాధపెట్టాను.. నీకు ఎప్పుడన్నా ఏదన్నా సాయం కావాలంటే చేస్తాను.. ఇప్పుడు చేయవల్సిందేమన్నా ఉంటే చెప్పు.. చేస్తాను.. ఎంచేతంటే.. నేనూ మనిషినే.. నీలాంటి మనిషినే.. కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నేను గొప్పవాడ్ని.. మీరు తక్కువ వాళ్ళూ అని అనుకోవటం లేదు..’’ అన్నాడు రణధీర్.
‘‘చాలు సార్.. మీరేం సాయం చెయ్యక్కర్లేదు సారూ.. నేనూ మీ లాంటి మనిషినే అన్నారు. దేవుడు కూడా రాముడు రూపంలో వచ్చినపుడు, మీలాంటి మనిషినే అని అన్నాడు. కొండలు, గుట్టలు పట్టుకుని తిరిగాడు. మీలో ఒక దేవుడ్ని, ఒక రాముడ్ని చూస్తున్నాం సార్..’’ అన్నాడా యువకుడు నమస్కారం చేస్తూ.
రణధీర్ కూడా ప్రతి నమస్కారం చేశాడు.
వాళ్ళు నలుగురూ వెళ్లిపోయారు.
మళ్లీ రూంలో ఇద్దరే మిగిలాక రాజు అన్నాడు ‘‘ఏంటి సర్.. వాళ్లు చెప్పిందంతా నమ్ముతున్నారా?’’
‘‘ఈ స్టేజ్‌లో మనం సమాచారం సేకరిస్తున్నాం.. ఎవడేది చెప్పినా, నమ్మినట్లు కనిపించాలి.. అది మొదటి సూత్రం.. ఇనె్వస్టిగేషన్‌లో ఫండమెటల్ రూల్..’’ అన్నాడు రణధీర్.
***
అశ్వినీ నర్సింగ్ హోం అండ్ ఫెర్టిలిటీ సెంటర్ అన్న బోర్డు చూస్తూ కారు కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపాడు. కారులోనే కూర్చుని కాసేపు ఆ నర్సింగ్ హోం గేటువైపే చూశాడు, రణధీర్.
పది నిముషాల తర్వాత పాతికేళ్ల అమ్మాయి బయటకొచ్చి గేటు దగ్గర నిలబడ్డది. రణధీర్ సెల్‌ఫోన్‌తో ఆ అమ్మాయి ఫొటో తీశాడు. ఖాళీగా వచ్చిన ఆటోను ఆపి, అందులో వెళ్లిపోయింది, అమ్మాయి.
మరో ఐదు నిమిషాలు ఎదురుచూసి, కారు నర్సింగ్ హోంకి కొంచెం దూరంలోనే ఉంచి, రణధీర్ నడుచుకుంటూ ఆ బిల్డింగ్‌లోకి వెళ్లాడు.
ముందువైపు రెండు కార్లు పార్క్ చేయడానికి సరిపడిన స్థలం ఉంది. అది దాటి లోపలికి అడుగుపెడితే పెద్ద హాలు. అందులో ఒకవైపున మెట్లు, దాన్ని ఆనుకుని పేషెంట్స్‌ను వీల్ ఛెయిర్‌లో పైకి తీసుకెళ్లటానికి వీలుగా రాంప్, కొంచెం ఇవతలగా లిఫ్ట్ ఉన్నాయి.
ఆ హాల్లో మిగతా సగంలో నల్లరంగులో నాలుగు వరసల్లో ఇనుప కుర్చీలు, వాటికి ఎదురుగా చిన్న బల్ల, నర్స్‌లు ఇద్దరు కూర్చునేందుకు రెండు కుర్చీలు, ఒక పొడుగాటి రిజిస్టరు, లెటర్ హెడ్ ప్యాడ్ ఉన్నాయి.

- ఇంకాఉంది

శ్రీధర