భక్తి కథలు

హరివంశం 226

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవాళ అడుగుతాడు, రేపు అడుగుతాడు నీరజాక్షుడు అని ఎదురుతెన్నులు చూస్తూనే ఉన్నాను. అడగకుండా ఇస్తే నీవు అన్యధా భావించువచ్చునని నా భయం. ఇది రహస్యంగా నా దగ్గర అట్టిపెట్టుకోవటం నాకు చాలా చాలా మనఃక్లేశం కలిగించింది. ప్రభూ! ఇప్పుడడిగావు కాబట్టి తీసుకో! ఇంకా నేను దీనిని నిభాయించనే లేను అని తన పట్టు ఉత్తరీయం ముడి విప్పి ఆ శ్యమంతకమణిని కృష్ణుడికి అందజేశాడు అక్రూరుడు. అప్పుడా సభా ప్రదేశాన్నంతా ధగ ధగ వెలిగించింది ఆ అనర్ఘ రత్నం. అది చూసిన వాళ్ళందరికీ దానిమీద పేరాస కలిగింది. బలదేవుడు ఈ దివ్య రత్నం నాకూ పద్మనాభుడికీ ఉమ్మడి సొమ్ము అని ఆశపడ్డాడు. సత్యభమ ఇది నా తండ్రి సొత్తు కదా! నాకివ్వకపోతాడా కృష్ణుడు సాలోచనగా తహతహ చెందింది. అయితే వాళ్ళిద్దరివైపూ చూడనూ కూడా చూడలేదు యదువంశస్వామి. ఎవరికిస్తాడో ప్రభువు అని యదు ప్రముఖులు గుటకలు మింగుతూ కళ్ళు పెద్దవి చేసి ఆ దివ్య రత్నంపైన దృష్టులు నిలిపారు. వాళ్ళ వదనాల నిండా చిరునవ్వలు ఆశ చూపులు సందడించాయి. వాళ్ళలో ఒక అస్తిమితత జనించింది. అపుడు గోపికా వల్లభుడిట్లా అన్నాడు. ‘ఈ బలరాముడి అనుమానం తీరటానికి ఇంత కథ నడపవలసి వచ్చింది. అంతేకాక చుట్టాలందరికీ నా ఆత్మశుద్ధి చూపాలనుకున్నాను. నాకు కావలసింది ఇంతవరకే! నాయనా అక్రూరుడా! దీనికి నేను గాని, బలదేవుడు కాని, సత్యభామ కాని పొందటానికి అర్హులమే అయినా, ఇక ఎవరూ దీనిని ఆశించటానికి అర్హులు కారు. అన్ని కాలాలలో, అన్ని సమయాలలో పరిశుద్ధత, శుచి పాటించే వాళ్ళకు, ఇంద్రియ నిగ్రహపరులకు, వ్రతాచార పరాయణులకు మాత్రమే ఇది నిజ ప్రభావం చూపుతుంది. మేమెవ్వరమూ నీ అంత ఆచార పరులం కాము, శుద్ధ సత్వులం కాము. నీ దగ్గర ఉండటానికే ఇది యోగ్యమైనది. సర్వ గుణ సంశుద్ధ స్వభావుడివి నీవు. అన్ని విధాల ఇది నీ దగ్గర ఉండటమే మంచిది. దీనిని ఉంచుకోవటానికి మరెవరూ అర్హులు కారు. కాబట్టి దీనిని నీవే తీసుకో! అని దేవదేవుడా మణిని అక్రూరుడికే తిరిగి ఇచ్చివేశాడు. ఇక నిర్భయంగా నిస్సందేహంగా ఆ రత్నాన్ని అందరూ చూసేట్లు ధరించి అక్రూరుడు నేలకు దిగిన సూర్యుడులాగా ప్రవర్తించసాగాడు. జలజనాభుడికి నింద తొలగిపోయిన ఈ కథ చదివినవాళ్ళకు సర్వశుభాలూ చేకూరుతాయి మహారాజా! అని జనమేజయుడికి సారవత్తరంగా ఈ కథ వినిపించాడు వైశంపాయన మహర్షి.

అయిపోయిది