డైలీ సీరియల్

ఒయాసిస్ 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ ఒక్కరివల్లా అవుతుందా? మీకు అసిస్ట్ చేయటానికి ఇద్దరు ముగ్గురు డాక్టర్లని తీసుకోవాల్సి వుంటుందేమో..’’’ అన్నాడు రణధీర్.
‘‘కనీసం ఇంకో ఇద్దరు డాక్టర్లు ఉండాలి..’’ అన్నది మమత.
‘‘అసలు ఇన్‌పేషెంట్స్ ఎంతమంది ఉంటారు? అవుట్ పేషెంట్స్ ఎంతమంది ఉంటారు? నర్సింగ్ హోం కెపాసిటీ ఎంతుంటుంది?’’
‘‘ప్రస్తుతానికి ఈ ఫ్లోర్‌లో మాత్రమే ఎనిమిది రూమ్స్ ఉన్నాయి. పైన ఇంకో ఫ్లోర్ వెయ్యాలన్న ప్లాన్ ఉంది. శే్వతగారు ఉంటే ఇంకో ఫ్లోర్ వెయ్యటం సమస్య కాదు.. ఇప్పుడు అహోబలరావుగారు ఏమంటారో మరి..’’
‘‘హత్య జరిగిన రోజు ఎంతమంది ఇన్‌పేషెంట్స్ ఉన్నారు. ఎంతమంది అవుట్ పేషెంట్స్ ఉన్నారు?.. ఆ రిజిస్టర్స్ చూడొచ్చా?..’’ అని అడిగాడు రణధీర్.
మమత నర్సు చేత ఆ రిజిస్టర్స్ తెప్పించింది. రణధీర్ పేజీలు తిరగేశాడు. మమత లేచి బయటికు వెళ్లింది, నర్స్ రాగానే.
అవుట్ పేషంట్స్ రిజిస్టర్‌లో మొదటి పేరు గీత అని ఉంది. పక్కనే ఆమె సెల్ నెంబరు రాసి ఉంది. మిగతా వాళ్లవి పేర్లు మాత్రమే రాసి ఉన్నాయి.
‘‘ఎందుకిలా, ఆమె ఒక్కదాని ఫోన్ నెంబరే ఉంది..’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఆమె చాలా ఎర్లీగా ఫోన్ చేసింది.. పేరు నెంబరూ చెప్పింది. అవి రాసుకున్నాం. కానీ ఆమె రావటం మాత్రం లేటుగా వచ్చింది. ఒకవేళ తక్కువమంది ఉండి, డాక్టర్ తొందరగా వెళ్తే ఫోన్ చెయ్యమంది. కానీ తనే ఎమిదిన్నరకు వచ్చింది. శే్వతగారిని చూసిన లాస్ట్ పేషెంట్ గీతే..’’ అని చెప్పింది.
ముందు పేజీలో కూడా గీత పేరు మొదటిది.. అక్కడా ఫోన్ నెంబరూ రాసి ఉంది.. అంటే కిందటి రోజూ గీత డాక్టర్ని కలిసిందన్నమాట.
‘‘కొంచెం మంచినీళ్ళు ఇస్తారా?’’ అని అడిగాడు రణధీర్.
నర్స్ మంచినీళ్ళు తెచ్చేలోపల తన సెల్ ఫోన్‌లోకి గీత ఫోన్ నెంబర్ ఎక్కించాడు.
‘‘ముందు రోజు కూడా గీత వచ్చిందా?’’
‘‘అవునండి.. ఆ రోజు కూడా ముందుగా ఫోన్ చేసి పేరు రాసుకోమంది. రావటం మాత్రం ఎనిమిదింటికి వచ్చింది..’’
‘‘ఆమె ప్రాబ్లెం ఏమిటి?’’
‘‘అవన్నీమాకు ఎలా తెలుస్తాయి? పేర్లు రాసుకున్న సీరియల్ నెంబర్ల ప్రకారం లోపలికి పంపిస్తాం.. వాళ్ల ప్రాబ్లం ఏమిటో డాక్టర్‌తో చెబుతారు..’’ అన్నది నర్స్ నిర్మల.
‘‘ఎంత వయసుంటుంది గీత గారికి?’’
‘‘ట్వంటీఫైవ్.. అని చెప్పింది..’’
‘‘ఇంతకుముందు కూడా వచ్చేదా?’’
‘‘ఏమో గుర్తులేదు.. ఎంతోమంది వస్తుంటారు. వెళ్తుంటారు.. అందరూ ఎక్కడ గుర్తుంటారు?..’’ అన్నది నిర్మల.
‘‘్థంక్యూ..’’ అని చెప్పి రణధీర్ రూంలో నుంచి బయటకు వచ్చాడు.
కిందకు దిగుతుంటే మెట్లమీద మమత ఎదురుపడి నవ్వింది.
‘‘అవసరమైతే మళ్లీ కలుస్తాను..’ అన్నాడు రణధీర్ కూడా నవ్వుతూ.
‘‘అలాగే...’’ అని పైకి వెళ్లింది మమత.
మళ్లా ఆమెతోపాటే పైకి వెళ్లాడు ఒక నిముషం ఆగి. నర్స్‌కీ, ఆమెకీ సంభాషణ మొదలైతే వినాలనుకున్నాడు. కానీ అతను మెట్లమీద నిలబడి ఉండటం నర్స్ చూసింది. అంచేత రూం దాకా వచ్చి మమతను అడిగాడు.
‘‘అహోబలరావుగారి ఫోన్ నెంబర్ చెప్పగలరా?’’ అని అడిగాడు.
ఆయన ఇంటి లాండ్ నెంబరూ, ఆయన సెల్ నెంబరూ తీసుకున్నాడు.
బయటికొచ్చి కార్లో కూర్చున్నాక ఆయన ఇంటి నెంబర్‌కి ఫోన్ చేశాడు. ఎవరో స్ర్తి రిసీవ్ చేసుకుంది.
‘‘అహోబలరావుగారున్నారాండీ...’’
‘‘లేరు.. క్లబ్ నుంచి ఇంకా రాలేదు..’’ అన్నదామె.
‘‘ఎన్నింటికొస్తారు?’’
‘‘తెలియదు.. ఆయనిష్టం..’’’
‘‘మీరు..?’’
‘‘‘బంధువులం..’’
‘‘్థంక్స్..’’ అని ఫోన్ డిస్‌కనెక్ట్ చేశాడు.

4
రణధీర్ దగ్గర నాలుగు సెల్‌ఫోన్‌లున్నాయి. పై ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు ఒక ఫోన్, భార్యతోను, బంధువులతోను, ఫ్రెండ్స్‌తోను మాట్లాడేటప్పుడు ఒక ఫోన్, వృత్తి రీత్యా అవసరమైనప్పుడు బయటివాళ్ళతో మాట్లాడేటప్పుడు మరొకటి.. అవసరాన్ని బట్టి, వాడిన ఫోన్ వాడకుండా వాడుతుంటాడు.
నాలుగో ఫోన్‌తో గీత నెంబర్‌కి కాల్ చేశాడు. అవతలి నుంచి ‘హలో’ అని వినపడింది.
ముందు తన పేరుగానీ, ఆమె పేరుగానీ చెప్పలేదు.
‘‘కంగ్రాచ్యులేషన్.. మేము నిన్న తీసిన డ్రాలో మీకు ఐదు లక్షలు బహుమతి వచ్చింది. మీరు సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్‌లో ఏ దేశానికైనా ప్లెజర్ ట్రిప్ వెళ్లొచ్చు. లేదంటే అయిదు లక్షల రూపాయలు నగదు కానీ తీసుకోచ్చా.. ప్లెజర్ ట్రిప్‌వల్ల మీకు అనేక లాభాలున్నాయి..’’
‘‘మీరెవరు మాట్లాడుతున్నారు?’’’
‘‘మేము గ్లోబల్ లింక్ ఎయిర్‌వేస్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాం. టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా ఇద్దరు జంటల్ని లాటరీ ద్వారా ఎంపిక చేసి విదేశాలకు పంపిస్తాం. మీ నెంబర్ డ్రాలో వచ్చింది.. మీ పేరేమిటో చెప్పండి.. నేను క్రాస్ చెక్ చేస్తున్నాను. మా దగ్గర డిటైల్స్‌తో, మీరు చెప్పే విషయాలు సరిపోతే, మీరు సరియైన విజేత అయినట్లు, మీ పేరు?’’
‘‘దీప్తి..’’

- ఇంకాఉంది

శ్రీధర