డైలీ సీరియల్

ఒయాసిస్ 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విషయంలో మాత్రం నాకెలాంటి సందేహం లేదు..’’ అన్నాడు దీప్తి వంక చూసి.
రణధీర్ లేచి నిలబడ్డాడు. ‘‘వస్తాను రా.. షూటింగ్‌కి ఎక్కడన్నా పర్మిషన్లు కావాలంటే నీ దగ్గరకు వస్తాను..’’
‘‘ఓ యస్.. నేనున్నాను కదా.. నన్ను వాడుకో...’’ అన్నాడు శంభుప్రసాద్ నవ్వుతూ.. రెండు చేతులూ బార్లా చాచి.
‘‘నన్నూ వాడుకోండి..’’ అన్నది దీప్తి మాట కలుపుతూ..
రణధీర్, దీప్తి ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు. రణధీర్ కారు దగ్గరకు వెడుతూ.. దీప్తితో అన్నాడు.
‘‘రండి.. మిమ్మల్ని డ్రాప్ చేస్తాను..’’
దీప్తి నవ్వింది.. ‘‘ఇప్పుడే కదా మమ్మల్నందర్నీ వాడుకోమన్నాం.. మీరేమో అప్పుడే... నన్ను డ్రాప్ చేస్తామంటున్నారు..’’ అన్నది చొరవగా.
‘‘చాలా పదాలకు రెండేసి అర్థాలు వస్తాయి.. ఏవి ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి..’’ అన్నాడు రణధీర్ స్టీరింగ్ ముందు కూర్చుంటూ..
‘‘మీరేమన్నారు?.. సరిగ్గా వినపడలేదు’’.. అన్నది దీప్తి కారులో.. ముందు సీట్లో రణధీర్ ప్రక్కన కూర్చుంటూ..
‘‘పదాలను ఎప్పుడు ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలన్నాను..’’
‘‘పెదాలను అన్నట్లు వినపడింది లెండి..’’ అన్నది దీప్తి పకపకా నవ్వుతూ.
రణధీర్ కారు నడుపుతూ అన్నాడు.. ‘‘మనలో చాలామందికి బిడియం, మహమాటం ఎక్కువ. ఎవరితోనన్నా ఏదన్నా చెప్పాలన్నా, ఏ పనన్నా చేయాలన్నా సిగ్గుపడి, మొహమాటపడి వెనక్కు తగ్గుతుంటారు.. కానీ సినిమాల్లో నటించే ఆర్టిస్టు రకరకాల వాళ్ళతో రకరకాల సీన్లు యాక్ట్ చేయాల్సి వుంటుంది. పెళ్లి సీన్ ఉందనుకోండి.. చూసేవాళ్ళకు పెళ్లికూతురిలానే కన్పించాలి.
బెడ్‌రూం సీన్ ఉందనుకోండి.. అక్కడ భార్యలాగే సహజంగా ఉన్నట్లు కన్పించాలి.. ఎందుకు చెబుతున్నానంటే.. ముందు మన మధ్య ఆ అన్యోన్యత, ఆ క్లోజ్‌నెస్ వుంటే యాక్టింగ్ చాలా తేలిక..’’
‘‘ఊ.. ఈ కోజ్‌నెస్ చాలా..’’ అన్నది దీప్తి రణధీర్ భుజంపై వాలిపోయి..
****

5
రణధీర్ అహోబలరావు ఇంటికి ఫోన్ చేశాడు. ఎవరో స్ర్తి మాట్లాడింది. తన పేరు వివరాలు చెప్పాడు.
‘‘ఒకసారి అహోబలరావుగారిని కల్సి మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పుడు వీలవుతుందో కనుక్కుందామని ఫోన్ చేశాను..’’ అన్నాడు రణధీర్.
‘‘ఒక్క నిముషం ఆగండి.. కనుక్కుని చెబుతాను’’ అన్నదామె.
రెండు నిముషాల తర్వాత ఆమె చెప్పింది.. ‘‘ఇవాళ వేరే పనులతో బిజీగా ఉంటారట.. మీకు వీలుంటే రాత్రి ఎనిమిది గంటలకు రమ్మన్నారు.. రేపు ఉదయం ఫ్లైట్‌లో ఢిల్లీ వెళతారు.. అక్కడినుంచి కాశీ వెళ్లి వస్తారు..’’
‘‘సరేనండీ.. రాత్రి ఎనిమిదింటికి వస్తాను..’’ అన్నాడు రణధీర్.
చెప్పిన టైంకి రణధీర్ అహోబలరావు ఇంటికి వెళ్ళాడు. నౌకరు ఆయన్ని హాల్లో కూర్చోమని చెప్పి పైకి వెళ్ళాడు. రణధీర్ సోఫాలో కూర్చుని హాలంతా కలయజూశాడు. ఎంతో అందంగా తీర్చిదిద్దినట్లున్న హాల్లో ఖరీదైన పాలరాతి బొమ్మలు, అక్వేరియం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఒక ప్రక్కనున్న షోకేసులో అహోబలరావు అనేకమంది ప్రముఖులతో విడివిడిగా తీయించుకున్న ఫొటోలున్నాయి. టేబుల్ మీద ల్యాప్‌టాప్, వైద్య రంగానికి సంబంధించిన మేగజైన్లు ఉన్నాయి. హాల్లోకి రాగానే ఎదురుగా కనిపించే డిజిటల్ క్లాక్ అహోబలరావు, శే్వతల నిలువెత్తు ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
సోఫాలో కూర్చున్న రణధీర్ దృష్టి పక్కనే ఉన్న టీపాయ్‌మీద పడింది. దానిమీద స్టేట్ బ్యాంకు లోగో వున్న కవర్ కనిపించింది. ఒకసారి పైకి చూసి ఇంకా ఎవరూ రావటం లేదని నిర్థారణ చేసుకుని ఆ కవర్ తీసుకుని చూశాడు.
అహోబలరావు పేరు మీద వచ్చిన లెటర్ అది. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రెండు వందల కోట్ల రూపాయల రుణం వెంటనే వడ్డీతో సహా చెల్లించమని లేని యెడల చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని రాశారు.
ఆ రోజే వచ్చిన ఉత్తరమని పోస్టల్ ముద్రను బట్టి తెలుస్తోంది.
ఆ లెటర్ మళ్లీ యథాస్థానంలో ఉంచాడు రణధీర్.
నౌకరు వచ్చి రణధీర్‌ని పైకి తీసుకెళ్లాడు. రెండో అంతస్తుపైన పెంట్ హౌస్ ఉంది. దాని ముందున్న ఖాళీ స్థలంలో షరా మామూలే అన్నట్లుగా ఆయన బాటిల్ సాక్షిగా కొలువుదీరి ఉన్నారు.
‘‘రండి..’’ అంటూ అహోబలరావు కుర్చీ చూపించాడు.
రణధీర్ ఆయనకు ఎదురుగా కూర్చుంటూ అన్నాడు.. ‘సారీ సర్. మిమ్మల్నీ సమయంలో డిస్టర్బ్ చేస్తున్నాను..’’
‘‘డిస్టర్బా.. భలేవారే.. పగలంతా ఎవరెవరో వస్తారు.. ఏవో కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరానివి ఉచిత సలహాలు ఇచ్చేసి వెళుతుంటారు. ఉచితంగా చెప్పేవి కనుక ఉచిత సలహాలన్నారు. ఇక రాత్రి అయ్యేకొద్దీ.. ఇంత ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయమేస్తోంది రణధీర్. నీకు అభ్యంతరం లేకుంటే రోజూ వచ్చి కూర్చుంటే నాకు మరీ సంతోషం..’’ అన్నాడు అహోబలరావు.

- ఇంకాఉంది

శ్రీధర