మంచి మాట

త్రిజటా స్వప్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామునికి దూరమైన సీతాదేవి దుఃఖితురాలై అసువులు వీడుటకు నిర్ణయించుకొంటుంది. ఆ నిర్ణయం విని అశోకవనమున ఆమెకు కావలివున్న రాక్షస స్ర్తిలు ఆ విషయం రావణునికి నివేదించి తదనంతరమున సీతనుద్దేశించి ‘‘ఓ సీతా, నీ నిర్ణయం అనుచితమైనది. మేమందరం కలసి నేడే ఇపుడో నిన్ను చంపి నీ మాంసము భుజించగలము’’ అని నుడివారు. అపుడక్కడ వారితో సీతాదేవికి కావలియన్న జ్ఞానవంతురాలైన త్రిజట ఇట్లనెను. ‘‘ఓ దుష్ట స్ర్తిలారా! ఈమె జనకుని గారాలబిడ్డ. దశరథుని కోడలు, శ్రీరాముని ధర్మపత్నియైన ఈమెను మీరు భక్షింపజాలరు. ఈ వేకువన నాకొక కల వచ్చినది. ఆ కలలో రాక్షసుల వినాశనమును, సీతాపతి యైన రాముని విజయమును సూచించునది.
అప్పుడా రాక్షస కాంతలు భయపడి ఆమెతో ఇట్లనిరి- ‘‘ఓ త్రిజటా నీకు వచ్చిన కలను మాకు వివరింపుము’’ అనిన అంతట త్రిజట ‘‘ఏనుగు దంతములతో కూడి వేయి హంసలతో పూన్చిన ఒక దివ్యమైన పల్లకి యందు శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ఆకాశమున ఇటు వచ్చుచుండెను. సీతామాతయును సముద్ర మధ్యమున తెల్లని పర్వతమున ఆసీనురాలై యుండెను. వారు మువ్వురును శే్వతమాల్యాంబరధారులై ఉన్నవారు. తదుపరి నాలుగు దంతములు కలిగిన ఒక మహా గజముపై రామలక్ష్మణులేతెంచి సీతను సమీపించిరి. పిమ్మట పర్వతాగ్రమున నున్న సీత ఆ ఏనుగు మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోనికి చేరెను. తదుపరి వారి వాహనమై ఆ గజము లంకమీదుగా ప్రయాణించి ఉత్తర దిశగా సాగినది. తదుపరి మన మహారాజు రావణుడు నూనె పూయబడిన దేహముతో నేలబడియుండెను. అతడు ఎర్రని వస్తమ్రులును, గనే్నరు దండలను ధరించి త్రాగి పుష్పక విమానము మీద నుండి పడిపోయెను. తదుపరి అతడు శిరోముండనము గావించుకొని నల్లని వస్తమ్రులను ధరించి ఒక స్ర్తిచే లాగబడుచుండెను. అతడు చిత్త చాంచల్యము కలిగి కలత చెందిన మనసుతో గాడిదల రథముతో దక్షిణ దిక్కుకు వేవేగ సాగిపోయెను. ఒక నల్లని వస్తమ్రు ధరించిన ఆ స్ర్తి రావణుని మెడకు త్రాడు గట్టి దక్షిణ దిశగా సాగెను. రావణుని సుతులందరును నూనెలో మునిగిన దేహములతో కనపడిరి.
తదుపరి వరాహముపై రావణుడు, మొసలిపై ఇంద్రజిత్తు, ఒంటెపై కుంభకర్ణుడు దక్షిణ దిక్కుగా సాగిపోయిరి. కానీ ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో కనపడెను. అతడు తెల్లని మాలలను, వస్తమ్రులను ధరించి స్వచ్ఛమైన గంధముతో, నృత్య గీతములతో ఆనందించుచుండ నాల్గు దంతములు కలిగిన ఏనుగు నధిరోహించి యుండెను. నలుగురు మంత్రులాతనిని అనుసరించి యుండిరి. రమ్యమైన ఈ లంకాపురి గోపురములు, తోరణములు చిన్నాభిన్నములై హయ, రథ, గజ బలములతో సాగరమున పడిపోయినవి. రావణునితో రక్షింపబడిన ఈ లంక రాముని దూతయైన మహాబలశాలియైన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోవుచున్నట్లు స్వప్నమున గాంచితిని. కుంభకర్ణాది రాక్షసులందరును మాసిన వస్తమ్రులు ధరించి ఆవుపేడ మడుగునందు ప్రవేశించిరి. ఇచ్చటినుండి దూరముగా తొలగుడు. శ్రీరాముడు సీతను పొందితీరును. అతడు మహాసాధ్వియైన ఆమెను తిట్టినను, భయపెట్టినను సహించడు. ఈమె తన భర్తయైన రామునితో కూడి విమానమధిష్టించినట్లు కలగంటిని. పద్మపత్రమువలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుట ఈమెకు శుభసూచకము. ఈమె ఎడమ భుజము, తొడ కంపించుచున్నవి. ఆమెకీ, శుభ సూచకములతో బాటు ఒక పక్షి చెట్టుకొమ్మలోని గూటిలోనికి ప్రవేశించి మాటిమాటికి మధురముగా కూయుచున్నది. ఆ కూజితము సీతా నీవు భయపడకము. శ్రీరాముడు త్వరలో అరుదెంచుచున్నాడు అని అర్థము. మీ క్రూర వచనములు కట్టిపెట్టి ఆమెతో మృదువుగా మాట్లాడుడు. ఆమెను శరణువేడుడు. ఇదియే యుక్తము అని నుడివినది. అంతట ఆ రాక్షస స్ర్తిలు ఆమె యెడల ప్రసన్నులైరి. అంతట సీతాదేవి ‘‘తన భర్తకు విజయము సిద్ధించునని ఎరిగి త్రిజట చెప్పిన స్వప్న విశేషములు నిజమైన యెడల మీకు శరణుమొసగుదునని’’ రాక్షస స్ర్తిలనుద్దేశించి పలికినది.

- పట్టిసపు శేషగిరిరావు