డైలీ సీరియల్

ఒయాసిస్ 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అబ్బో.. కవిత్వం వరదలై పారుతోందే.. మీ కోసం ఎదురుచూస్తూ ఉండనా మరి..’’’ అన్నది ఫోన్ డిస్కనెక్ట్ చేస్తూ..
ఛాయ నెంబర్ నోట్ చేసుకున్నాడు. రాత్రి ఎనిమిదింటికి ఆమె ఇంటి ముందు కారు దిగాడు.
నవ్వుతూ ఎదురొచ్చింది. తెల్లని పాల నురుగులాంటి చీరలో నిన్నటికన్నా అందంగా కన్పిస్తోంది. నిన్నటికన్నా కొంచెం తెల్లగా కూడా వుంది..
హాల్లోకి వెళ్లాక ‘‘కింద కూర్చుంటారా?’’ పైన కూర్చుంటారా?’’ అని అడిగింది.
‘‘మీ ఇష్టం..’’
‘‘ఏదన్నా సేవించాలనుకుంటే పైకి వెళ్దాం. పైన పెంట్ హౌస్ చిన్న బార్ ఉంది’’ అన్నది ఛాయ అతన్ని ఆనుకుని నిలబడుతూ.
‘‘మిమ్మల్ని సేవించాలని వచ్చాను. ఎక్కడ ఎలా సేవించమంటే అక్కడ అలా..’’ అన్నాడు రణధీర్.
‘‘ఓయబ్బో.. నన్ను సేవించాలని వచ్చారా? మాటలకేం కొదువలేదు..’’ అన్నది ఛాయ బుంగమూతి పెడుతూ చిన్నపిల్లలా.
నిన్న కూర్చున్న చోటనే కూర్చున్నారు. నిన్న అహోబలరావున్నారు. ఇవాళ ఆయన లేడు. ఛాయ మరింత చొరవ చూపడానికి ఇది మంచి అవకాశం. మాటల్లోకి దింపి మంచి మూడ్‌లోకి తీసుకుపోయి మైండ్‌ని స్కాన్ చేయవచ్చని రణధీర్ ఆలోచన.
చొరవగా డ్రింక్ అందిస్తూ అన్నది ఛాయ ‘‘మేలైన ముత్యాల పేరులిస్తామన్నారు. చేతులూపుకుంటూ వచ్చారు..’’
‘‘నీ వగల ముందు ఆ నగలు ఏ పాటివని తేలేదు’’ అన్నాడు రణధీర్ ఏకవచనంలోకి దిగుతూ.
‘‘మాటలు నేర్చారు’’ అన్నది చనువుగా భుజంమీద మునివేళ్ళతో తడుతూ..
అహోబలరావు డిల్లీనుంచి ఫోన్ చేశాడు.
‘‘ఒక్కదానే్న ఉన్నాను. నౌకరు వాళ్ళ ఊరెళ్లాడు. రేపొద్దున బస్సెక్కి మధ్యాహ్నం వస్తానన్నాడు. వాడి తల్లికి జబ్బుగా ఉందిట. అయ్యగారు లేరు గదా, పోయొస్తానన్నాడు. సరే పొమ్మన్నాను.. ననె్నవరేం చేస్తారు. నాకు తోడు నా పుస్తకాలున్నాయి. చదువుతున్నాను.. ఏమక్కరలేదు.. ఉంటాను..’’ అని ఫోన్ పెట్టేసింది ఛాయ.
‘‘ఏదో చదువుతున్నానన్నావు? చేతిలో పుస్తకం లేదు..’’ అన్నాడు రణధీర్.
‘‘చేతిలో పుస్తకం అక్కర్లేదు.. మీరున్నారు గదా చాలు..’’ అన్నది ఛాయ నవ్వుతూ.
‘‘మీ ఆయన మళ్లీ ఎప్పుడొస్తాడు..’’ అని అడిగాడు రణధీర్.
‘‘మా ఆయనేమిటి? భలేవాడివే.. ఆయన్ను నేనెందుకు చేసుకుంటాను? నాకు అలాంటి కోరికలేం లేవు..’’
‘‘ఆయనకు ఉండొచ్చు కదా..’’
‘‘ఆయనకు ఎన్ని ఉంటే నాకేంటి? మా ఇద్దరి మధ్యా ఏజ్ గాప్ చాలా ఉంది.. ఈ వయసు మళ్లీ రమ్మంటే వస్తుందా? గుండెల మీద చెయ్యేసి చెప్పండి..’’ అన్నది ఛాయ.
ఆమె గుండెలమీదకు చెయ్యి చాపుతూ అన్నాడు రణధీర్ ‘‘పోయిన యవ్వనం ఎవరికీ తిరిగిరాదు..’’
‘‘మీ గుండెలమీద చెయ్యేసి చెప్పమంటే, నా గుండెలమీద చెయ్యేస్తారా? ఓహో.. చనువిస్తే చంక ఎక్కేటట్లున్నారు..’’ అన్నది ఛాయ కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ.
‘‘మరి శే్వతకీ, అహోబలరావుకీ కూడా వయసులో తేడా వుంది కదా.. ఆయన్ని చేసుకోవటానికి ఆమె ఎందుకొప్పుకుంది?’’ అని అడిగాడు రణధీర్.
‘‘నాకు తెలియదు. మీ పోలీసోళ్ళతో ఏం మాట్లాడినా తప్పే..’’
‘‘ఇప్పుడు నేను రణధీర్ కాదు.. నువ్వు ఛాయ కాదు.. కాసేపు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుందాం.. వీళ్లిద్దరూ ఎలా ఉండేవాళ్ళు?..’’ అని అడిగాడు రణధీర్.
‘‘శే్వత డబ్బు మనిషి. ఆమెతో కొంచెం క్లోజ్‌గా ఉండేవాళ్ళందరికీ ఆ సంగతి తెలుసు. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఒక ఫ్రెండ్‌తో కొంత ఎఫైర్ నడిపింది. ఇంటర్‌కాస్ట్ అయినా చేసుకోవడానికి సిద్ధపడింది. ఇంతలో ఒక ఫంక్షన్‌లో అహోబలరావుగారు ఆమెని చూశాడు. చూడటానికి అందంగా, అమాయకంగా వుంటుంది కదా. ఈయన పడిపోయాడు. ఆ ఫ్రెండ్‌కన్నా ఈయన బాగా స్థితిపరుడు కావడంతో వాడ్ని ఎడమ కాలితో తనే్నసి ఈయన్ని వరించి, మెళ్లో మాల వేసింది’’ అన్నది ఛాయ.
‘‘ఇట్స్ ఓ.కె.. తప్పేముంది? మంచి సంబంధం, మంచి సంబంధమంటూ తెగ తిరిగేది దేనికోసం.. డబ్బున్నవాడికిచ్చి చేయాలనే కదా.. ఆ అవకాశం వస్తే దాన్నందుకుంది..?’’ అన్నాడు రణధీర్.
‘‘తప్పని ఎవరన్నారు? జరిగింది చెబుతున్నాను’’ అన్నది ఛాయ.
‘‘సరే చెప్పు’’
‘‘చెప్పటానికి ఏం లేదు. అలా పెళ్లయిపోయింది.. శుభం’’ అని నవ్వింది ఛాయ.
‘‘తర్వాత వీళ్లిద్దరూ హాయిగా, అన్యోన్యంగా ఉన్నారా- అన్నది అసలు ప్రశ్న...’’
‘‘అన్యోన్యంగానే ఉన్నారని అనుకోవాలి.. విడిపోలేదు కాబట్టి...’’
‘‘అంటే.. విడిపోయేదాకా వచ్చారా? అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయా?’’
‘‘ఒక ఏడాదిదాకా ఆమె చాలా అన్యోన్యంగానే ఉంది. ఆయనమీదా, ఆస్తిపాస్తులమీదా అధికారం సంపాదించింది.. తర్వాత ఫ్రెండ్స్‌తో అమెరికా వెళ్లి వచ్చింది..’’
‘‘అందులో తప్పేముంది?’’
‘‘ఏం లేదులేండి.. ఒక చిన్న విషయం మీకు చెప్పొచ్చో.. చెప్పకూడదో మరి..’’
‘‘మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నాం. ఇది కేసుకు సంబంధం లేదు’’ అన్నాడు రణధీర్.
‘‘ఈమధ్య ఒకసారి అహోబలరావును జనరల్ చెకప్‌కి పంపించింది. ఆ డాక్టర్ ఏదో ఒక వాల్వ్ బందయిందంటూ ఈయనకి అరడజను మందులు రాసిచ్చి, రోజూ అవన్నీ మింగమన్నాడట.

- ఇంకాఉంది

శ్రీధర