భక్తి కథలు

కాశీఖండం 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రణవ పంచాక్షర బ్రహ్మ విద్యోపనిషత్తు నీ అరచేతి ఉసిరక. ఇంతటి ప్రశస్తికెక్కిన నిన్ను బ్రహ్మదేవుడి ఆన చేత వేడికొనడము కోసరం ఈ కాశికా నగరానికి ఇంత మందిమి కట్టకట్టుకొని వచ్చాము. భువన సంక్షోభకారి అయి ఒక మహోత్పాతం పుట్టుకువచ్చింది. ఆ ఉపద్రవం తొలగిపోయేటట్లు నువ్వు చేసి పెట్టాలి.
బృహస్పతి లోపాముద్రకి పతివ్రతా ధర్మాలు తెలుపుట
తల్లీ! నీకు కుశలమేనా? సాధ్వీ! నీకు ఆరోగ్యమే కదా! దేవీ! నీకు మంగళమే కదా! పూబోడీ! నీకు లెస్సలా? శ్రేష్ఠమూ, సర్వతిశాయి అయిన పతివ్రతాచార వైభవ రాజ్యం నీకు కొనసాగుతున్నది కదా!
ప్రాణనాథుడు ఆరగింపకమున్ను ఆరగింపవు. భర్త నిద్రపోవక పూర్వమే నిద్రపోవు. ప్రాణనాథుడు మేలుకొనకముందే మేల్కొంటావు. అలంకరించుకోకుండా అధిపుడిని కదియవు. పతి కుపితుడై వున్న వేళ తగ్గి శాంతంగా వుంటావు. ధవుడి మాటకి ఎప్పుడూ ఎదురాడవు. మనోనాథుడిచ్చిన దానిని అల్పమని అనక సంతసించుతావు. మగని ముందర ముఖం ఎత్తవు. చీర చెరగు మలినమైన మూడు నాళ్లు సిగ్గరివయి పతికంటి చూపుని పరిహరిస్తావు. నాలుగు నాళ్లకి సూర్యుడు ఉదయించిన తర్వాత జలకమాడి పెనిమిటిని తప్ప వేరెవ్వరిని చూడవు.
భర్త అనామయుడై పెంపొందడం కోసం పతివ్రత ఎంత మాత్రం విసిరివేసారక ఎల్లకాలం పసుపు, కుంకుమ, కాటుక, నునురైక, విదియము, పువ్వులు, కబరీభరం, చెవికమ్మలు, శుభప్రదాలైన ఆభరణాలు ధరించాలి.
పుణ్యాంగనలు ప్రాణ సంకట కాలంలో కూడ చాక దానితోను, బహిష్ఠు స్ర్తితో, సన్న్యాసినితో, పతిహీనతో, పతితో పోరాడు ఆడుదానితోను, చెడిపెతో నెయ్యం పాటించి రాకపోకలు చెయ్యకూడదు. పతి పిలిపించగా వచ్చి కార్యం ఏమని అడిగి, ఆ చెప్పిన పనిని చెయ్యాలి. పతి ఆన లేకుండా తన వంక చూట్టానికి ఏ పదార్థమైనా ఇవ్వడం కీడు. ప్రాణేశ్వరుడు వదలిన పదార్థములు ఏవగించుకోక భుజించడం ధర్మం. అనుష్ఠానానికి విఘ్నం వాటిల్లేటప్పుడు తప్ప సుఖసుప్తుడైన పతిని మేల్కొలుపడం కానికృత్యం. ఒంటరిగా ఎక్కడకైనా అరుగుట యోగ్యం కాదు. తడి చీర కట్టక- దిస్సమొలతో- స్నానం చెయ్యడం ధర్మం కాదు. గడపమీద, సనె్నకల్లుడైనా, తిరుగలిమీదా కూర్చుండడం తగవు కాదు.
గృహంలో జరిగే శుభకార్య సందర్భాలలోను రతి సమయాలందూ తప్ప మగనాలు పతి ముందర నాగరికత, మాటలలో నెరజాణతనమూ చూపకూడదు. వెలి, లోపలి ప్రవర్తనలు దేశకాలాల ఉచిత తత్వాన్ని అనుసరించి నడచుకోవాలి.
సతికి పతి చెప్పిన మాటను వ్యర్థపుచ్చకుండటం- ఉపేక్షించకుండా ప్రవర్తించటమే ధర్మం. అదే పతివ్రతాధర్మం. అదే సర్వత్రా చరణం. అదియే సద్వివేకం. అదియే సదాచారం. అదే దేవతా పూజ. తన భర్త సంతోషించినట్లయిన భార్య సంతోషించాలి. పతిదేవుడు ఆత్మలో సంతాపం పొందిన పట్టున సతి కూడా సంతాపం పొందాలి. కొందరు స్వైర విహార ధీరలు ప్రాణేశుడు దురవస్థ పొందినపుడు, జబ్బుపడినప్పుడు, శృంఖలాబద్ధుడైనప్పుడును పరిత్యజిస్తారు. దుర్మతులైన కొందరు పత్నులు దారిద్య్రంతో సంకోచించే ధవుణ్ణి మిక్కిలి దైన్యం ప్రదర్శించి నెయ్యి, ఉప్పు, నూనె, బియ్యం మొదలైన పదార్థాలకయి సిగ్గిల్లచేస్తారు. కాంక్షావతులు కొందరు ధవుడు తమకు ఏమి ఒసగినా మెచ్చుకొనక హెచ్చుకుందు మాటలతో దెప్పిపొడుస్తారు. కొందరు భాగ్యహీనలు ఒంటరులై పతిని వంచించి ఎక్కడకేని పోతారు. మరికొందరు దుశ్శీలవతులు అశ్లీలపు పలుకులు పలుకడానికి మోమోడక పతుల ముందరనే మందెమేలపు మాటలు ప్రేలుతారు.