భక్తి కథలు

కాశీఖండం.. 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి గంధపు పూతచే తెలుపెక్కిన స్తన మండలాలు కలవి అయిన దిశావధువులందు రుచితో- కాంతితో - ఇనుడు (సూర్యుడు, భర్త) ప్రకాశించాడు.
విష్ణుమూర్తి కన్నులు విప్పి కనుగొన్నాడు. అతడి వక్షస్స్థలంలోని కౌస్త్భుమణి కాంతులకి ఆ చూపు నలగిపోసాగింది. ఆ దేవదేవుడు ఒడలు విరుచికొని లేచి ఆవులించాడు. దేవతలు చిటికెలు వేయసాగారు. సంవర్తుడు, భృగుడు ఆదిగాగల మహర్షులు సౌఖశాయనికులై (సుఖంగా నిద్రపట్టిందా అని ప్రశ్నించినవారయి) అంజలులు పట్టారు. సచేతనాలై పంచాయుధాలు జయజయధ్వనులతో స్తుతిస్తున్నాయి. ఆ విష్ణుదేవుడి వినీల తనువున తెల్లని ఆదిశేషువు యొక్క అరటి పొరలను పోలిన కుబుసపు పొరలు అంటుకొని వున్నాయి. విష్ణుమూర్తి పాలకడలిలో ఆదిశేషువు తల్పంమీద శరద్వేళ లేచి కూర్చుని వున్నాడు.
ఇంకా పరిపక్వములై పగిలిన బూరుగు దూది పింజల వలె సమములైనవిన్నీ, నింగి అనే పాము విడిచిన కుబుసపు శకలాల మాదిరి విలాసాలు కలవిన్నీ, ఇంద్రుడి వాహనం అయిన ఐరావతగజం శరీరం లాగు స్వచ్ఛములున్ను - తెల్లనివిన్నీ అయిన వెల్ల మబ్బులు అభ్రవీధిని అంతటా సంచరించి, తునుకలు తునుకలైన ఇంద్ర ధనుస్సులతో గగన మండలాన్ని అలంకరించాయి. తరుణ మేఘాలు ప్రభువులుగాను, తడబడే పెనువడగళ్లు పుష్పాంజలులుగాను, ఉరుముల ధ్వనులు మద్దెల ధ్వనులుగాను అయాయి. గగనం అనే రంస్థలంలో క్రొత్త మెరుపుతీగ అనే నట్టువ కత్తె గొండ్లి ఆడింది. మత్త వన మయూరం అనే నర్తకి అవ్యక్త మధుర కంఠధ్వనితో కూడిన క్రేకారావమే అనే గీతి కాంతమందు కళాసించింది (నృత్యాన్ని ఆపివేసింది). మేఘాలు కడవలతో, గోనెలతో ద్రిమ్మరించిన విధంగా వర్షించి వెలిసిన అనంతరం- అంతంతంగా ఆగి ఆగి ఉట్టిపడే జల బిందువులు వలె రాత్రి అనే శుక్తిలోని ముత్యములైన తారకలు ఆకాశవీధిని మిణుకు మిణుకుమంటూ కనవచ్చాయి. దక్షారామనగరంలోని అప్సరః స్ర్తిల యొక్క వదనారవింద లావణ్య బిందు సమూహం అయిన నిండు చందురుడు మన్మథ దిగ్విజయంవల్ల కలిగిన కీర్తి వంటి అచ్చమైన వెనె్నల విచ్చలవిడిగా కాయదొడగింది. కలువలు వికసించాయి. నీటి పిప్పలి పువ్వులు (లాంగలీకుసుమం) మెండుగా పూసాయి. రెల్లు పువ్వులు వుల్లసిల్లాయి. కాసర చెట్టు కాయలు కాచింది. దోసకాయలు ఎర్రవనె్న తాల్చాయి. దక్షిణపుగాలి వీవసాగింది. బురద నీరు తేటపడింది. ఏనుగులు మదజలాలు కురియసాగాయి. ఆబోతు పోతరించి ఖణిల్లని రంకె వేసింది. బురద అడుగంటింది. ఇసుక తినె్నలు బయలుపడ్డాయి. నిద్రపట్ల ప్రీతి హెచ్చింది. సప్తపర్ణి (క్రొత్త పువ్వు వేసి పెరిగింది. వరి విరగపండింది. పరిగ పెరిగింది. గసగసాలు పంటకు వచ్చాయి. పెసరు పైరు ఉసురు పోసుకుంది. దవనం పొదలింది. రక్కె ప్రాసంగు వరి పంట - దొండ ముక్కు పడింది- లేక మువ్వనె్నలు కలదయి పండింది. మదం చేత అవ్యక్త మధురం అయిన కలహంస, సారసముల మధురాలాపాల చేత అంతట వ్యాపించిన దిగంతాలు కలది అయి విహారం కోసం నిర్మించిన అల్ప సరస్సులు కాంతాజన వక్షోదఘ్నమైన జల సమృద్ధి కలవి అయాయి. ఆ సమయంలో కార్తిక మాసంలో భీమేశ్వర స్వామి ఆలయంలో వింధ్య గర్వాపహారి అయిన అగస్త్య ముని- లోపాముద్ర తాను నిర్మలాతఃకరణంతో పాప సమూహ సంహారకారణం అయిన జ్వాలాతోరణం దూరాడు.
అగస్త్య మహర్షికి దక్షిణకాశి అయిన దక్షారామం చొచ్చి బాలచంద్రధరుడైన భీమేశ్వరస్వామిని సందర్శించినది మొదలుకొని కాశీక్షేత్ర సందర్శన సుఖమే చేకూరింది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి