భక్తి కథలు

కాశీఖండం 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్రువవు అయి వుంటావు. ఇహజన్మల్లోను, జన్మాంతరాల్లోను విహితాలైన వ్రతదానాదులచేత సంచితాలైన పాపాలు తొలగింపబడటంవల్ల అస్తమించిన రజస్తమో గుణ శరీరులైన వారు ఉత్తములు. నిర్మల సత్వ గుణులయిన నీ తత్త్వాన్ని చింతిస్తారు. భోగ, మోక్ష స్వరూప కర్మఫలాన్ని పరమేశ్వరుడు ప్రాణులకే ఒసగేవేళ నన్ను ముందుపెట్టుకొని కాని ఇవ్వలేడు. సర్వవ్యాపకమైన శబ్ద బ్రహ్మతత్త్వం కారణరూపం అయిన బిందు స్వరూపం కలది అయి స్పందనం లేనిదవడంవల్ల పురుషుడి సంకల్పరూప ప్రయత్నం చేత మూలాధార చక్రంలోని వాయువు సంధుక్షణంవల్ల అభివ్యక్తమై పరావాక్కు అనబడుతుంది. ఆ శబ్ద బ్రహ్మం- ఆ వాయువు చేతనే నాభి దాకా అభివ్యక్తి పొందింపబడి విమర్శ రూపమనస్సుతో కూడి సామాన్య స్పందం అనే ప్రకాశం స్వరూపంగా కలదిగా అయి కార్యబిందు తత్త్వాత్మికయున్ను, ఈశ్వరుడూ అధిదేవతగా కలదయి పశ్యంతీ వాక్కని వ్యవహృతం అవుతుంది.
ఆ శబ్ద బ్రహ్మమే- ఆ వాయువు చేతనే హృదయం వరకు అభివ్యక్తి పొందింపబడుతున్నది అయి నిశ్చయాత్మిక అయిన బుద్ధితో కలసి విశేష స్పందరూపమున్ను, నాదబిందుమయియున్ను- హిరణ్యగర్భుడు అధిదేవతగా కలది అయి ‘మధ్యమ’ వాక్కని పిలువబడుతున్నది. ఆ శబ్ద బ్రహ్మమే- ఆ వాయువు చేతనే ముఖం దాక కంఠాది స్థానాల్లో అభివ్యక్తమై అకారాదిక్షకారాంత వర్ణమాలారూపం అయి నిశ్చయాత్మ అయి, శ్రవణేంద్రియ గ్రహణయోగ్యమై వైఖరీ వాక్కని వ్యవహరింపబడుతున్నది. ఈ చతుర్విధాలైన సూక్ష్మస్థూల మాతృకలే నిజ రూపంగా గలదానవు నువ్వ. ఇటువంటి దేవీ! నీకు నా నమస్కారం’’ అని ప్రస్తుతించగా సంతసించి మహాలక్ష్మి అగస్త్యుడిని కాంచి గౌరవంతో ఈ రీతిగా పలికింది. ‘‘అనఘాత్మా! నీ స్తోత్రానికి నా ఆత్మ ఆనందించింది. నువ్వు కోరిన వరం ఒసగుతాను. ప్రీతితో స్వీకరించవలసింది’’.
ఇకమీద రాబోవు ఇరవై తొమ్మిదవ ద్వాపర యుగంలో నువ్వు వ్యాస మహర్షివయి అవతరించి కాశీ పుణ్యక్షేత్రంలో వేద సంహితలు, పురాణ సంహితలు, ధర్మశాస్త్రాలు వ్యాఖ్యానించగలవు.
ఇప్పుడొక హితము పల్కుతాను. తుంగభద్రానదీ తీరంలో కిష్కింధ పర్వతం చేరువను కల అడవిలో కుమారస్వామి అధివసించి వున్నాడు. నువ్వు ఆ యెడకు అరిగి ఆ కుమారస్వామి ముఖతః కాశీ క్షేత్ర స్థల మహాత్మ్యాన్ని వినవలసింది అని వాక్రుచ్చి లోపాముద్రను కనగొని ఆ సాధ్వికి అంగుళీయకాలు, గాజులు, కేయూరాలు మొదలైన దివ్యాభరణాలు ప్రసాదించింది.
ఈ గతి కొల్లాపురంలో విజయం చేసి వున్న మహాలక్ష్మీ ప్రసాదం పడసి ఆ పుణ్య దంపతులు చరితార్థులయి సముచిత రీతిని ఆ మహాలక్ష్మిని వీడ్కొని స్వామి మలకి ఏగువారయి కతిపయ ప్రయాణాలు ఒనర్చి, తమ ముందర శ్రీశైల మహాక్షేత్రాన్ని కాంచారు.
ఆ శ్రీశైలం సాక్షి విఘ్నేశ్వరుడి వజ్రాయుధాన్ని పోలిన దంతాగ్రభాగంలో ఆ శైల సానువుని బ్రద్దలు కొట్టడంవల్ల పుట్టిన ఠంకారద్వానాలతో ఆకాశం ప్రతిధ్వనులీనుతోంది. ఆ శైలానికి- తూర్పు ద్వారంగా త్రిపురాంతకం, దక్షిణ ద్వారంగా సిద్ధమవటం, పడమటి వాకిలిగా ఆలంపురం, ఉత్తరపు వాకిలిగా మాహేశ్వరం అనే పేరులుకల నాలుగు ద్వారాలున్నాయి. గవాక్షాలు పదహారు, మకర తోరణాలు ముప్ఫయి రెండు, నాట్య కూటాల అరవై నాలుగు, ఒక వేయి యేభయి శీర్షికలు, నూరువేల కోట్లు లింగాలు, పదివేల కోట్లు శక్తులు, ఒక కోటి తీర్థాలు, వరాహ, మల్లికా క్షీరకుండాదులు అసంఖ్యాకాలు, కదళీ, బదరీ, గౌరీ, బిల్వాది ప్రధాన వనాలు, హాటకేశ్వర, గుప్తమాహేశ్వర, నందిమండలా లున్నాయ.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి