మంచి మాట

మహర్నవమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శంకరి, కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి, పరాత్పరి, గౌరి అంబ.. పరమ పావని, భవాని, సదాశివ కుటుంబిని...’’ అని, శివశక్తి సామరస్యంగా, కల్యాణిరాగంలో లయ బ్రహ్మ శ్యామశాస్ర్తీ కడురమ్యంగా అమ్మను పొగడిన ఈ కీర్తన అమ్మ వైభవాన్ని చాటుతుంది. ఆ అమ్మనే పరతత్త్వం. ‘‘యస్మాద్భూతాని జాయనే్త, యేన జాతాని జీవన్తీతి’’ అన్నది శ్రుతి. ఏ బ్రహ్మ శక్తివలన సకల భూతజాలములు పుడుతున్నాయో ఆ శక్తే ఆశ్వీజమాసంలో ‘శ్రీమాత’. గా కొలుస్తాం. దుర్గమాలను దూరం చేసిందని దుర్గమ్మగాను, నవవిధబాధలనుంచి రక్షిస్తుం ది కనుక త్రిపురసుందరీగాను, లోకోత్తర మైన సౌందర్యంతో అలరారుతూ ఎల్లపుడూ చిరునవ్వును చిందిస్తూ భక్తుల మనస్సును ఆహ్లదపరుస్తుంది కనుక లలితా పరమేశ్వరీ గాను దశవిధ దురాచారాలను దుర్వ సనాలను దూరం చేసి అన్నింటా విజయాన్నిస్తుంది కనుక అపరాజితాదేవిగా పూజిస్తారు.
సూర్యుడు కన్యారాశిలోను, కొంత తులారాశిలోను సంచరించే ఈ మాసంలో కన్యారాశిలోని చంద్ర నక్షత్రం- హస్తా నక్షత్రం. కనుక, శరదృతువులో, అశ్వనీ దేవతలు అధిదేవతలైన ఆశ్వయుజ మాసంలో, శుక్ల పక్షం మొదటిదైన పాడ్యమి తిథినాడు, కన్యారాశిలో సూర్యుడు ఉండగా, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రమునందు, దేవీ నవరాత్రుత్సవములకు కలశస్థాపన చేసి తొమ్మిదిరోజులు జగన్మాతకు నవరాత్రోత్సవాన్ని జరుపుతారు. నవరాత్రి ముగింపుగా, చంద్ర నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో శమీపూజతో శివశకె్తైకర్యంగా కలశోద్వాసన చేస్తారు.
ఈ సర్వ ప్రపంచమూ శివశక్తుల స్వరూపమే. అమ్మకు,అయ్యకు భేదం లేదు. పదార్థము, శక్తి కలయక వలనే సృష్టి జరుగుతుంది కనుక శివశక్తులకు భేదం లేదు. జగన్మాతను ‘శివా’ అన్నారు. జగన్నాయకుడిని శివ అన్నారు. కనుక కార్తికంలో శివుణ్ణిని ఆశ్వీజంలో శివా ను పూజించడం ఆచారం.
రాజులు రాజ్యాలున్నకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు. అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది.పాండవులు వారి ఆయుధాలను పూజించి విజయకేతనాన్ని ఎగురవేశారు. అదే కాలక్రమంగా ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఈ రోజు వాహనాలు, వస్తూత్పతి తఛేసే యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం కాగలదు. ధర్మరాజాదులు శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాంటి అవతార పురుషులు కూడా అమ్మను పూజించినవారే.
మహర్నమినాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది. కనుక ప్రతివారు ఈ తల్లిని పూజించి ఆనందాన్ని పొందుదురుగాక!
.....................................................................................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- హనుమామయ్మ