డైలీ సీరియల్

ఒయాసిస్ 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమిటో ఎందుకో తెలియదు.. చాలా భయంగా ఉంది..’’ అన్నది దీప్తి కన్నీరు పెట్టుకుంటూ.
‘‘ఈ ప్రపంచంలో దేన్నీ లెక్కచేయనంత ధైర్యవంతురాలివని అనుకున్నాను. నువ్వూ ఏడుస్తున్నావా?’’ అన్నాడు రణధీర్.
‘‘చాలా భయంగా ఉందండీ..’’ అంటూ దీప్తి ఆయన గుండెలమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది.
‘‘ఏం జరిగింది? ఎందుకింత దుఃఖం? ఎందుకింత భయం? నాతో చెప్పు.. నిజంగా నీకు అంత పెద్ద సమస్య ఉంటే నా చేతనైన సాయం చేస్తాను..’’ అన్నాడు రణధీర్.
‘‘దిక్కులేని దాన్ని.. నాకిక దేవుడే దిక్కు..’’ అన్నది కన్నీళ్ళు తుడుచుకుంటూ.
‘‘్భగవంతుడు మనకు కష్టాలు ఎందుకు కల్పిస్తాడో తెల్సా? కనీసం అప్పుడైనా మనం ఆయన్ను తల్చుకుంటామని..’’ అన్నాడు రణధీర్.
స్నానాదులన్నీ అయ్యాక దర్శనానికి వెళ్లారు. క్యూలో జనం నెట్టేస్తున్నారన్న నెపంతో, బల్లిలా ఆయన్ని కరుచుకునే ఉంది ఆ కాసేపూ.
దర్శనం అయ్యాక ఇద్దరూ వెళ్లి ప్రసాదం తెచ్చుకున్నారు.
బయట కూర్చున్నారు.. చల్లగాలి వీస్తోంది. మనసు తేలికపడినట్లు అనిపిస్తోంది దీప్తికి.
ఆస్థాన మంటపంలో ఎవరో రుక్మిణీ కళ్యాణం హరికథ చెబుతున్నాడు.
‘ఘనుడా భూసురుడేగెనో.. నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో..’’ అని శ్రావ్యంగా పాడుతున్నాడు.
‘‘్భగవంతుడు మనిషికి సాయం చేస్తున్నట్లే కనిపిస్తూ కష్టాలు ఎందుకు కల్పిస్తాడో తెలియదు..’’ అన్నది దీప్తి మళ్లీ చెమ్మగిల్లిన కళ్లతో.
‘‘కష్టం, సుఖం మనం చూపే దృక్పథంలో ఉంటుంది దీప్తీ.. అంత అందమైన గులాబీ పువ్వు చుట్టూ ముళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు అనే అందరూ అనుకుంటారు గానీ, ముళ్ళ మధ్యలో కూడా అంత అందమైన గులాబీ సృష్టించిన దేవుడిది ఎంత గొప్ప సహృదయం అని ఎందుకు భావించరో అర్థం కాదు..’’ అన్నాడు రణధీర్.
‘‘ఈ ప్రపంచాన్ని మీరు అందరూ చూసే కోణంలో కాక భిన్నమైన కోణంలో చూస్తారు. అందరికీ సమస్యల్లా కనిపించినవి మీకు సమస్యలుగా కనిపించవు..’’ అన్నది దీప్తి.
‘‘ప్రపంచంలోని సమస్యలన్నీ మనం పరిష్కరించలేం.. అలా పరిష్కరించాలని ఎవరూ కోరటంలేదు కూడా.. కానీ మనం ప్రపంచానికి ఒక సమస్యగా పరిణమించకుండా ఉంటే చాలు..’’
‘‘చివరి మాట మళ్ళీ చెప్పండి..’’
‘‘మనం ప్రపంచానికి ఒక సమస్యగా పరిణమించకుండా ఉంటే చాలు..’’
ఒక క్షణం ఆలోచించి దీర్ఘంగా శ్వాస వదిలింది.
భోజనాలు చేసి రూంకి చేరుకున్నారు
రాత్రి పదకొండు గంటలకు చెరో బెడ్ మీద పడుకున్నారు. ఒంటి గంట సమయంలో దీప్తి రణధీర్‌ని నిద్రలేపింది.
‘‘ఏంటి?’’ అన్నాడు రణధీర్ లేచి కూర్చుంటూ.
‘‘నేను మీ దగ్గర పడుకుంటాను, నాకు భయంగా ఉంది..’’
‘‘ఎందుకు భయం? నువ్వేమన్నా చిన్నపిల్లవా? పెళ్లి అయితే ఇద్దరు పిల్లలు పుట్టేవాళ్ళు..’’ అన్నాడు రణధీర్.
‘‘ఈ ప్రపంచంలో నాకెవరున్నారు?’’ అంటూ మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది.
‘‘సరే పడుకో..’’ అన్నాడు రణధీర్.
ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని పడుకుంది, కన్నీళ్ళు తుడుచుకుని.
‘‘నేను సినిమాలో వేషం వేద్దామనుకున్నప్పుడు, నటించడానికి నీకెంత ట్రైనింగ్ ఇవ్వాలో అనుకున్నాను.. కానీ మాకే ట్రైనింగ్ ఇచ్చేంత గొప్ప నటివి.. ఏడుపు సీన్లకి గ్లిజరిన్ అక్కరలేదు..’’ అని నవ్వుకున్నాడు రణధీర్.
దీప్తి మాత్రం ఆయన్ను చిన్నపిల్లలా కావలించుకుని నిద్రపోయింది.
****

14
మర్నాడు దీప్తి, రణధీర్ హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టునుంచి టాక్సీలో వస్తున్నప్పుడు దీప్తి అన్నది-
‘‘సర్.. పుణ్యక్షేత్రం వెళ్ళొచ్చాం గనుక ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయినట్లే... ఇక మళ్లీ ఫ్రెష్‌గా అకౌంట్ ప్రారంభించవచ్చు..’’
‘‘చెడ్డ పనులు అని తెల్సినపుడు అవి చెయ్యటం ఎందుకు? తర్వాత బాధపడటం ఎందకు?’’ అన్నాడు రణధీర్.
‘‘చెడ్డ పనులకున్న ఆకర్షణ అలాంటిది.. తప్పు చేస్తున్నామని తెల్సీ, చెయ్యకుండా ఉండలేని బలహీనత మనది..’’ అన్నది దీప్తి.
‘‘కానీ జీవితం కాంప్లికేట్ కాకుండా చూసుకో..’’ అన్నాడు రణధీర్.
‘‘ఇటు మీరు, అటు రాజశేఖర్‌గారూ.. కుడి ఎడమల ఇద్దరు హెమా హేమీల్లాంటి వాళ్ళున్నారు. ఎంత కాంప్లికేట్ అయినా ఇట్టే సాల్వ్ చేయగల సమర్థులు.. ఇంక నాకెందుకు దిగులు?’’ అని నవ్వింది దీప్తి.
‘‘మేం కూడా కొంతవరకే సాయపడగలం.. మాకూ లిమిటేషన్స్ ఉంటాయి..’’ అన్నాడు రణధీర్.
‘‘సరే.. ఇంక వదిలెయ్యండి.. బాగా అలసిపోయారు. రెస్ట్ తీసుకోండి.. రాత్రికి వేరే ప్రోగాం ఉంది మనకి..’’
‘‘నన్ను ఫిక్స్ చేస్తున్నావేంటి? మీ ప్రొప్రయిటర్ కంపెనీ ఇవ్వడా..’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఆయనకు కంపెనీ ఇచ్చేవాళ్ళూ.. ఆయన కంపెనీల్లో వాళ్ళు.. నాలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు.. సాయంత్రం మనం పావనం చెయ్యబొయ్యేది కూడా ఆయనకున్న వ్యాపారాల్లో ఒకటి.. నేనూ ఈమధ్యే వెళ్లి చూడటం తటస్థించింది. ఎంజాయ్ చెయ్యవల్సిన వయసుల ఎంజాయ్ చెయ్యకపోతే, వయసు మళ్ళాక ఎంజాయ్ చెయ్యమన్నా చెయ్యలేం.. అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.

- ఇంకాఉంది