భక్తి కథలు

కాశీఖండం ..37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధ్వీ! శ్రీశైలమందలి శిఖరేశ్వర శిఖరాన్ని దర్శిస్తే మోక్షం చేరువ అవుతుంది. శ్రీశైలం కన్నా కేదారక్షేత్రం శీఘ్రంగా కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రయాగక్షేత్రం- త్రివేణీ సంగమస్థలి- ఆ కేదారంకన్నా అతి శీఘ్రంగా ముక్తిని ఒసగుతుంది. ఆ ప్రయాగ క్షేత్రం కంటే అతివేగంగా కాశీక్షేత్రం అపవర్గాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అఖిల తీర్థ సేవనమూ కాశీక్షేత్ర ప్రాప్తికరాలే! ఈ విషయంలో ఇసుమంతయినా సందేహానికి తావులేదు. లక్షణ తీర్థాలలో స్నానామడినా- కాశీ తీర్థరాజాన్ని సేవించకుంటే కైవల్య లక్ష్మి చేరువకి రాదు.
శివశర్మోపాఖ్యానము
ఈ విషయం తేటతెల్లం కావడానికి ఒక యితిహాసం చెబుతాను. ఆలించు. మధురా పట్టణంలో శివశర్మ అనే పేరు కల భూసురోత్తముడు ఉన్నాడు. ఆ శివశర్మ చుతుర్వేదాలూ, వాటి అర్థాలు చదివాడు. ధర్మశాస్త్రాలు పుక్కిటపట్టాడు. పురాణాలు అవలోడించాడు. శిక్ష, వ్యాకరణాది షడంగాలు అభ్యసించాడు. షట్తర్కాలు ఆమూలాగ్రంగా ఆలోచించాడు. పూర్వోత్తర మీమాంసలు అధిగమించాడు. ధనుర్వేదం పఠించాడు. ఆయుర్వేదం విచారించాడు. నాట్యవేదం కడమట్టా పరిశ్రమించాడు. అర్థశాస్త్రాలు గాలించాడు. మంత్రశాస్త్రాలు మథించాడు. పలు భాషలు నేర్చాడు. విపులకరచాడు. సంపదలు సముపార్జించాడు. ధర్మకార్యాలు నెరవేర్చాడు. భాగ్యాలు అనుభవించాడు. పుత్రుల్ని కలిగించాడు. ఆ పుత్రులకి అర్థాలు విభజించి ఇచ్చాడు. వనం గడచిపోరునందుకు చింతించాడు. ముదిమి సంప్రాప్తించినందుకు దుఃఖించాడు. వ్యాకులత చెంది తన ఆత్మలో ఈ విధంగా ఆలోకించాడు.
‘‘నా జీవితం అంతా నానా శాస్త్రాలు అభ్యసించడానికీ, అపార సంపదలు సముపార్జిడం కోసమూ, సంతానాగ్ని పడయడం కోసరమూ, ఆ సంతనానికి సంపదలు విభజించి ఇయ్యడానికీ, మాటిమాటికీ సుఖాలు అనుభవించడం కోసమూ వృధా అయిపోయింది. శ్రీకాశీవల్లభుడిని పార్వతీ పతిని సేవింపనే లేకపోయాను.
కటకటా! ఒకనాడైనా గోపాలకృష్ణుడిని కొలువలేకపోయాను. ఒక రోజు అయినా విఘ్నేశ్వరుణ్ణి పూజింపలేకపోయాను. మునీశ్వర ప్రవరులకి మ్రొక్కలేకపోయాను. చిత్రభానుడు లేక సూర్యుడిని అర్చింపజాలనయాను. అమర సంఘాన్ని యజింపలేకపోయాను. మహిసురుల్ని భజింపలేకపోయాను. తామర కొలనుల్ని త్రవ్వించలేకపోయాను. తులసీవనాలు పెంచలేకపోయాను. నల్లిండ్లు నెలకొల్పలేకపోయాను. చలివేంద్రముల్ని నడపలేకపోయాను. మంత్రపూర్వకంగా ఆజ్య, తిల హోమ విధులు అగ్నిహోత్రుడిలో నిర్వర్తింపజాలకపోయాను. శ్రద్ధపూని పురుష సూక్త, శ్రీసూక్తాలను జపించలేకపోయాను. దినదినం శతరుద్రీయం, శివపంచాక్షరి మంత్రాన్ని ప్రణవ మంత్రరాజాన్ని జపించనే లేకపోయాను.
అరసి చూడగా ఒనర్చిన పుణ్యకార్యం ఒక్కటి తప్ప ఈ మేడలు, ఈ హయాలు, ఈ వెండి బంగారాలు, ఈ దాసదాసీజనం, ఈ ధాన్యాలు, ఈ ధనం పరలోకానికి ఏగేవేళ నాతో వస్తాయా? అయ్యో!
పొడి దగ్గు కంఠాన్ని పాడుచెయ్యకముందే శిరస్సు వణికిపోవకముందే కన్నుబొమ్మలు కన్నుల్ని పొదువుకొని వ్రాలిపోవకపూర్వమే, నేత్రాలలో పొర ఏర్పడి చూపు మందగించకముందే, శ్రవణపుటాల శక్తి సడలిపోక పూర్వమే ముఖం ముడతలు పడకముందే హృదయంలో చేవ తగ్గిపోకపూర్వమే, శరీరం శిథిలం అయిపోకముందరే, పలువరుస చివుళ్ల కుదురులు సడలి కదలడం మొదలుపెట్టక మునుపే, కాకి వలె కడగంటి చూపు ఏర్పడకముందే కాలు చేతులూ కదలాడుతున్నప్పుడే శరీరం అస్థిరం కనుక- తీర్థయాత్రలు సేవించాలి’’ అనుకొన్నాడు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి