భక్తి కథలు

కాశీఖండం 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదేవా! శివశర్మా! స్వర్గ్ధాపతి అయిన దేవేంద్రుడి సభ ‘సుధర్మ’ని వీక్షించు. ధవళ వర్ణుడయిన ఆదిశేషువుని తాల్చిన, సదాశివుడి అట్టహాసం మాదిరి సమున్నత శిఖరాగ్రాలతో- ఆ శిఖరాగ్ర భాగాల ఊగులాడు జండా గుడ్డలతో, బ్రస్మాండ కర్పరాన్ని ఒరసికొంటూ అపర కైలాస గిరి కరణి అలరారే ఆ సుధర్మ సభని తలయెత్తి పరికించు.
రాత్రుల్లో వెనె్నలకి కరిగిపోయే చంద్రకాంతమణి శిలలు ఇక్కడ వున్నాయి. ఇంక వేరే చెరువులు ఎందుకు? కల్పవృక్షాలు అసంఖ్యాకంగా వున్నాయి. కనుక సాలెవాళ్లతో ఏమి పని? కోరుకొన్న కోరికలు నెరవేర్చ చింతామణులు మణిశ్రేణి వుంది. గుణకుల వున్న ఏమి ఫలం?
ఈ పురంలో అమృతరసాన్నాలు కామధేనువులే సమకూరుస్తున్నాయి. వంటవాళ్లతో పనిలేదు. ఈ వడుపున సమస్త పదార్థాలకి జన్మస్థలం అయి, సకల కళ్యాణ వైభవాలకీ కాణాచి అయి సకల భువనాల్లోనూ అద్వితీయం అని వనె్నకెక్కిన ఈ పురి ఇంద్రలోక రాజధాని అయిన అమరావతి.
పాలకడలి నుంచి ఉద్భవిల్లిన ఘృతాచి, మేనక, మంజుఘోష, రంభ, హరిణి, తిలోత్తమ, విశ్వాసి, చకోరాక్షి అనే నామధేయలై- నానాభూషణాలంకృతలు అయిన ఈ తరుణులు ఇంద్రుడి ప్రియవారకాంతలు. మనలను గారాముగా వీక్షిస్తున్నారు. ఈ పద్మముఖుల్ని చూశావా?
ఈ నాకలోకంలో పారిజాతం వృక్షరాజం. ఊర్వసి కాంతారత్నం. నందన వనం ఉద్యాన వనరత్నం. ఉచ్చైశ్శ్రవం హయరత్నం. ఐరావతం గజరత్నం.
చింతామణి రత్న రత్నం. అగ్ని ఆదిగాల లోకపాలురు, నారదాది మునీశ్వరులు, దనుజులు, మనుజులు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు- సగరుడు, నల చక్రవర్తి, నహుషుడు, మాంధాత, దుందుమారుడు మున్నుగాకల రాజులు, జ్యోతిష్టోమాది యాగకర్తలైన సోమయాజులు, తులాపూరుషాది మహాదానాలు ఒనర్చిన దాతలు, ఘోర సంగ్రామాల్లో వెన్నుచూపనివారై, అక్లీబాదులు అయి తృణప్రాయంగా ప్రాణాలు త్యజించి వీరులు నివసిస్తారు’’ అని చెప్పారు.
పిమ్మట అగ్నిలోకంలోని అర్చిష్మతీపుర సమీపానికి కొంపోయి, ఆ శివశర్మతో విష్ణ్భుటులు మరలా ఈ విధంగా వాకొన్నాడు.
అమరావతీ నగరాన్ని ఇంద్రుడు పరిపాలిస్తాడు. అర్చిష్మతీపురాన్ని అగ్నిదేవుడు పాలిస్తాడు. యమధర్మరాజు సంయమనీపురాన్ని ఏలుతాడు. నిర్‌రుతి పుణ్యవతీ నగరాన్ని పాలిస్తాడు. వరుణదేవుడు అమరావతీ పురాన్ని పరిపాలిస్తాడు.
వాయుదేవుడు గంధవతీ పట్టణాన్ని ఏలుతాడు. యక్షరాజు కుబేరుడు అలకాపురాన్ని పాలిస్తాడు.
ఈశానుడు శానీనగరం ఏలుతాడు? శివశర్మ దిక్పాలకుల నగరాల్లో రెండవ నగరం అయిన అర్చిష్మతిని వీక్షించి ప్రీతి చెందాడు.
అంత ఆ అగ్నిలోక మాహాత్మ్యాన్ని హరికి ఆప్తులయిన కింకరులు వర్ణించడం మొదలుపెట్టారు.
అగ్నిలోకము
కర్మశూరులైన కర్మఠులకి అగ్నిహోత్రుడు మోక్షశ్రీ ప్రదాత. విప్రులకి తీర్థం. ఆ అగ్నియే గురుడు. అగ్రవర్ణాలవారికి అగ్నియే ఆశ్రయ స్థానం. మహీసురులకి అగ్నియే ఏడు విధాలయిన రక్షకుడు (తల్లి, తండ్రి, గురువు, పురుషుడు, విద్య, దైవం, దాత).
పావకుడే ప్రభువు. విప్రులకి తనూనపాత్తు (తనువుని రాలనీయనివాడు). విశ్వసనీయస్థానం. పారిజాత తరువు. ఆశ్రయభక్షకుడు. అంతరాత్మ.
ఉషర్బుధుడు (ప్రాతఃకాలంలో మేలుకొల్పేవాడు). అష్టమూర్తులలో ఒకడు. సకల భువన ఉత్పత్తి స్థితిలయకారుడు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి