నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ॥ ఇల సద్భక్తుల పాదధూళి పటలం బెవ్వండు ఫాలంబునం
జిలికెన్ వాడపవర్గ నాధుడనినన్ సిద్ధంబుగా వాని ని
ర్మల హస్తార్పిత భూతి బ్రీతి నొసవారం బూయు విశ్వాసికిన్
ఫలమూహించి విధింపనెవ్వరికి జెప్పన్ వచ్చు సర్వేశ్వరా!
భావము: సర్వేశ్వరా! సద్భక్తుల పాదధూళిని ఎవడు నొసట చల్లుకుంటాడో వాడు మోక్షప్రదాత అయిన శివుడు అవుతాడు అని అంటే సిద్ధంగా వాడి నిర్మల హస్తంలోని విభూతిని భక్తితో నొసట పూసే విశ్వాసికి దక్కే ఫలితం ఇదీ అని ఎవరూహించి చెప్పగలుగుతారు?
మ॥ సురలన్ మర్త్యసమూహిగా, మనుజులన్ శళోభిల్లు బృందార కో
త్కరముంగా, ఘనునల్పు, నల్పుని ఘనుంగా ఋణ్యపాపాళిచే
దిరుగన్ వైచుచు నీ మహామహిమ ప్రీతిం బద్మజాండంబులం
దరయన్ జీవుల నింద్రజాలములుగా నాడించు సర్వేశ్వరా!
భావము: సర్వేశ్వరా! నీ మహామహిమ దేవతల్ని మనుష్యులుగా మనుష్యుల్ని దేవతలుగా, గొప్పవాణ్ణి అల్పునిగా, అల్పుణ్ణి గొప్పవాణ్ణిగా వారి వారి పుణ్యపాపాలచేత తిరుగవేస్తూ బ్రహ్మాండాలలో జీవులనందరినీ ఇంద్రజాలంలోలాగా ఆడిస్తుంది.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ