భక్తి కథలు

కాశీఖండం 52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమాటఆలించి ఆ నైమిశారణ్యంలోని రుషులు తదనంతర కథ వినిపించుమని కుతూహలంతో అడిగారు.

తృతీయాశ్వాసం సమాప్తం

చతుర్థాశ్వాసం
అనంతరం సూతుడు శౌనకాది మహామునులకీ ఈ గతి నుడువ మొదలుపెట్టాడు.
తర్వాత కొంతకాలం గడచింది.
వైశ్వానర జననము
శుచిస్మితకి నెల తప్పింది. స్తనాగ్రభాగాలు నలుపెక్కాయి. చెక్కుటద్దాలు పాలిపోయాయి. ఆమె గర్భగోళంలోని నీలకంఠుడి హలాహలం కాంతి- నల్ల వనె్న నాభి రంధ్రం నుంచి బయల్వెడలి కన్పట్టిన కరణి శుచిస్మితకి నూగారు నల్లవారింది.
ప్రతిదినమూ- గర్భములో పెరుగుతూన్న పరమ శివుడి ప్రభావ గౌరవంవల్ల ఆ శుచిష్మతీ దేవికి సాయం సంధ్యా సమయంలో ఆనంద తాండవ నాట్యం ఆడ మనసుపడింది. కాశీక్షేత్రంలో ప్రాణులకు మరణ తరుణంలో ప్రణవ మంత్రం ఉపదేశింపగోరింది. పసిడి అంచులు కల ఆర్ద్రీనాగాజినం వస్త్రంగా తాల్పయత్నించింది. ఇత్తడిని పోలిన జటామకుటంపైన చంద్రకళలను తరుముకొన ఉవ్విళ్ళూరింది. ఏనుగు మోము కొడువుని ఒడిలో కూర్చుండపెట్టుకొని బుజ్జవం సల్ప కాంక్షించింది.
అంతేకాక గర్భగోళంలో అగ్నిదేవుడు తొలి చూలుగా వృద్ధి చెందుతూ వుండగా ఆ శుచిష్మతి అధ్వరాలలో ఋతిక్కులు పురోడాశంతో మంత్రపురస్సరంగా ఆజ్యాహృతులు వేల్చడగా సభాగృహంలో సమర్పించే సమయంలో తానే ఆరగించాలని తలుస్తుంది. పిమ్మట విశ్వానరుడు తన పత్ని గుర్విణి అయిన వెంటనే గృహ్య సూత్తోక్ర ప్రకారంగా పుంసవనము (పురుష సంతానం కలగాలని చేసే సంస్కారం) సీమంతం (సుఖ ప్రసవం కావాలని ఎనిమిదవ నెలలో చేసే సంస్కారం) అనే సంస్కారాలను నిర్వర్తించాడు.
తెలి తామర రేకుల్ని పోలిన నేత్రాలు కల ఆ శుచిష్మతీదేవికి నవమాసాలు నిండగానే గురుగ్రహం కేంద్ర స్థానమందుండగా ఒక శుభలగ్నంలో అగ్నిదేవుడి అంశతో తిరస్కరింపశక్యం కాని దివ్యాకార తేజస్సుతో అవిముక్త స్థానమందలి వీరేశ్వర శివావతారం అయిన నందనుడు ఉదయించాడు.
అంత వాయువులు దివ్య గంధాలతో వీచసాగాయి. వర్షామేఘాలు పూలవానలు కురిసాయి. దేవ దుందుభులు మ్రోగాయి. దిక్కులు ప్రసన్నాలు అయాయి. నదులు స్వచ్ఛజల ప్రవాహాలు అయాయి. సమస్త భూతాల మనస్సులు ప్రసన్నత వహించాయి. విద్యాధర యక్ష గంధర్వులు, వసిష్టి వాలఖిల్యాదులయిన మునీశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ కుమారుణ్ణి చూడాలనే కుతూహలం కల్గిన చిత్తులయి అపుడు ఏతెంచారు. హరిహర బ్రహ్మలు లేక త్రిమూర్తులు మువ్వురు కలసి కరుణాన్వితులై ఆ సుతుడికి ‘గృహపతి’ అని పేరుపెట్టారు. ఆ కుమారుడికి నాల్గవ మాసంలో శుచిష్మతీ విశ్వానరులు గడప దాటించారు. ఆరవ మాసంలో వాలయంగా అన్నప్రాశన చేశారు. గృహ్యసూత్రప్రోక్తం నియమానుసారంగా పుట్టువెండ్రుకలు తీయించారు. శ్రవణ నక్షత్రంలో తరితో చెవులు కుట్టించారు. బ్రహ్మవర్చ సంవృద్ధికోసరం అయిదవ ఏట ఉపనయన విధానం సల్పారు. నందనుణ్ణి ఒజ్జ సన్నిధిని షడంగములతో సహా వేదం పద, క్రమాలతో చదువపెట్టారు. అనంతరం ఒక రోజున దేవర్షి నారదుడు యధేచ్చగా చనుదెంచి అతిథి పూజలు పడసి తనకు ప్రణమిల్లిన గృహపతిని కనుగొని ఆ విప్ర దంపతులతో ఈ విధంగా వచించాడు. ‘‘ఓ విశ్పోకారీ! విశ్వానరుడా! ఓ పుణ్యసతీ! శుచిష్మతీ! ఈ కుమారుడు మీ పయిన భక్తి కలిగి వున్నాడా?

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి