మంచి మాట

నాగుల చవితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక చతుర్ది నాగుల చవితిగా ప్రసిద్ధి. కార్తిక చవితినాడు పుట్టలో పాలు పోయ టం నాగులను పూజించటం సంప్రదాయం. నాగపుట్ట చుట్టూ దారం చుట్టుతూకాని, నాగపుట్ట చుట్టూ నూకను చల్లుతూకాని ‘నాగరాజా నీవు నూక తీసుకొని మాకు మూకను ఇవ్వు’ అని ప్రార్థిస్తారు. మేము తెలియక చేసిన అపరాధాలను మన్నించమనీ ప్రార్థిస్తారు. ‘పడగ తొక్కతే పసివాడనుకో, నడుము తొక్కితే నీవాడనుకో, తోక తొక్కితే తొలిగిపో’ అని నాగులను వేడుకొంటారు. స్నానసంధ్యలు ముగించుకొని ముందు ఇంట్లో నాగపడిగకు కాని నాగ ప్రతిమకుకాని పూజ చేస్తారు. ఆ తరువాత చల్లని పానకాన్ని, వడపప్పు, చలిమిడి, పాలు, కొబ్బరికాయ లాంటి వాటిని నాగుల పుట్టదగ్గరకు తీసుకెళ్లి సమర్పిస్తారు. పుట్టలో కొంతమంది కోడిగుడ్లు కూడా వారి ఇంటి సంప్రదాయాలను బట్టి వేస్తుంటారు. ఇలా పుట్టకు కోడిగుడ్లు సమర్పిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నాగ భక్తుల నమ్మకం. నాగపూజ వలన నేత్ర, ఉదర, కర్ణ సంబంధ వ్యాధులనుకూడా దూరం అవుతాయని అంటారు.
సుబ్రహ్మణ్యుని నాగుపాము రూపంలో నాగుల చవితినాడు పూజిస్తే వంశాభివృద్ధి, సౌభాగ్యసిద్ధి , సర్వాభీష్టాలు కలుగుతాయి. శివకుమారుడు వల్ల తారకాసుర భంజనం జరుగుతుందని దేవతలు తెలుసుకొన్నారు. వారంతా శివుణ్ణి కుమారుడిని ప్రసాదించమని వేడుకున్నారు. శివుడు వారిని అనుగ్రహించారు. శివాజ్ఞఫై అగ్ని శివతేజస్సును ధరించాడు. కాని, అది అగ్ని వల్లకాక గంగకు శివరేతస్సును ఇవ్వగా గంగ కూడా భరించలేక రెల్లువనంలో శివరేతస్సును విడిచిపెట్టింది. అక్కడ శే్వతపర్వతం ఏర్పడింది. దాన్నుంచి శరవణం ప్రభవించింది. ఆ రెల్లు వనంలోని శివతేజస్సునుంచే బాలుడు ఉదయించాడు. ఆ బాలునికి కృత్తికలు పాలిచ్చారు. ఆరు ముఖాలనుంచి ఆ బాలుడు వారి దగ్గర పాలు గ్రోలాడు. దానివల్లనే శివకుమారుడు కార్తికేయనామధారుడయ్యాడు. ఇతనినే సుబ్రహ్మణ్యుడని పిలిచారు. దేవమానవులను హింసించే రాక్షసాధముడైన తారకుణ్ణి సంహరించమని దేవతలు ఆయన్ను శరణువేడారు. అపుడు శివకుమారుడు దేవసైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్లి యుద్ధం చేసి తారకాసుర సంహారం చేశాడు. దేవతలు మెచ్చి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేశారు. నాగుల చవితినాడు సుబ్రహ్మణ్యేశ్వర వివాహం కూడా చేస్తుంటారు.
నాగులు కశ్యప ప్రజాపతి కద్రువ సంతానం. వీరు ద్విజ్విహులుకావడానికి ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. కశ్యపప్రజాపతికి కద్రువ వినతలు భార్యలు. ఓసారి వీరిద్దరి తగవు ఏర్పడింది. వీరు ఒకరితో ఒకరు పందెం కాచుకున్నారు. వీరిద్దరిలో ఎవరి మాట తప్పు అయతే వారురెండవ వారికి దాసిగా ఉండాలని అనుకొన్నారు. తాను నెగ్గాలనుకొన్న కద్రువ తన సంతానాన్ని బతిమాలుకుని తన మాట నెగ్గించమని కోరింది. నాగుల్లో కొందరు తల్లి అనైతికంగా కోరికను కోరుతోంది కనుక తాము దానికి అంగీకరించమని, అన్యాయం చేయము అని చెప్పి అమ్మ ఆగ్రహానికి గురైనారు. కాని వారిలో కొద్దిమంది అమ్మ ఆగ్రహాన్ని తట్టకోలేక కద్రువ కోరికను నెరవేర్చడానికి పూనుకొన్నారు. దానివలన కశ్యప ప్రజాపతిభార్య సోదరి అయన వినత కద్రువకు దాసి అయంది. ఆ వినత కుమారుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు అమ్మ దాస్యం పోగొట్టడానికి నాగుల కోరికను నెరవేర్చాలనుకొన్నాడు. వారి కోరిక ప్రకారం అమరావతికి వెళ్లి ఇంద్రుని రక్షణలో ఉన్న అమృతభాండాన్ని తీసుకొని వచ్చి వారికి ఇచ్చాడు. కాని అమృతం మంచివారికి మాత్రమే ఇవ్వాలనుకొన్న ఇంద్రుడు ఆ అమృతభాండాన్ని నాగులకు దక్కనివ్వలేదు. దర్భలపై ఉంచిన అమృతభాండాన్ని తీసుకోవడంలో కాస్తంతఅమృతం దర్భలపై ఒలికింది. దాన్ని నాగులు నాకగా వారి జిహ్వలు దర్భల పదునుకు రెండుగా చీలాయ దానివల్లనే నాగులు ద్విజిహ్వులు అయ్యారని పురాణ కథనం. ప్రాచీన కాలం నుంచి కూడా ఈ నాగారాధన ఉన్నట్లు చారిత్రికంగా తెలుస్తోంది. బౌద్ధ, జైనులు కూడా నాగులను ఆరాధిస్తారు. ఈజిప్టు, గ్రీక్, పర్షియా లాంటి దేశాల్లో అయితే సర్పాలను సస్యదేవతగాకూడా పూజిస్తారు.

- చోడిశెట్టి శ్రీనివాస్‌రావు