భక్తి కథలు

కాశీఖండం 56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వజ్రాయుధాగ్ని జ్వాలలు చుట్టుముట్టి ధైర్యం విడనాడి ఆ వైశ్వానర బాలుడు అగాథమూ, అచంచలమూ అయిన భక్తి వైభవంతో శంభుడు, శంకరుడు, నీల లోహితుడు, ఉమానాథుడు, విరూపాక్షుడు అయిన కాశీపురాధీశ్వరుణ్ణి ధ్యానిస్తూ తీవ్ర వ్యధ చెంది మూర్ఛపోయాడు.
అతనిని విరివి అయి ఎర్రని జటాజూటాగ్రంలో తురుముకొన్న చంద్రకళతో, జగన్మోహనాకారంతో కంఠమూలమందు కాలకూట విషం అనే కళంకం వంటి కాటుక రంగుతో, చుట్టలు చుట్టుకొన్న సర్పరూపకుండలాభరణాలు అలంకరింపబడినవాడు, అడుగుదమ్ముల వ్రాలిన అమర విభుడు కలవాడు, భస్మభూషిత సకలావయవ కలితుడు, విశ్వాధికుడు, విశ్వనాధుడు కాశీపురాధిపతి విలాసంగా ప్రత్యక్షం అయి ‘వత్సా! లేవయ్యా!’ అని పలుకగా మూర్ఛ తేలి తెలివి వచ్చి దిగ్గన లేచి వైశ్వానరుడు నిలుచున్నాడు.
అంత ఈశ్వరుడు ఆ విప్రసుతుణ్ణి ఆదరించి ఈ అగ్నిలోకానికి అధిపతిని చేసి అంతర్థానం చెందాడు. ఆ గృహపతి (విశ్వానరసుతుడు) విశే్వశ్వర ప్రసాదంవల్ల దీర్ఘాయుష్మంతుడు దిక్పతి అయి ధన్యత చెందాడు. ఇది వైశ్వానర వృత్తాంతం.
నిరృతి లోక వృత్తాంతం
అని వినిపించాడు. అనంతరం ఆ శివశర్మ ప్రీతి పొంది విష్ణ్భుటులతో ‘‘నిరృతిలోకం మున్నుగా కల సకల లోకాలను నాకు క్రమంగా చూపవలసింది అని అర్థించాడు. వైశ్వానరలోకం ఇంతకు ముందే తెలుసుకొన్నాను. ఆపైన కల లోకాలను తెలుసుకొనగోరుతున్నాను. దయతలచి తెలుపలరా?’’ అని అడిగాడు.
అంత ఆ విష్ణుకింకరులు ‘‘ఓ మహానుభావా! సంయమనీపురానికి అవ్వల జాతి మాత్రం చేత రాక్షసులై విడువక వేదమార్గాన్ని అనుసరించేవారున్ను, అన్యులకెంత మాత్రం ద్రోహం సలుపనివారున్ను, పుణ్యతీర్థస్నానపరాయణులు, దేవపూజా ప్రవణులు, దానపరులున్ను, సర్వభూత సమదృష్టులున్ను, క్షమాశాలురున్ను ఇంద్రియ విజయలున్ను, త్రికరణశుద్ధులున్ను, సత్యసంధులున్ను అహింసా నిరతులున్ను, భోగపరాయణులున్ను అయిన పుణ్యజీవులకు నివాస్థలమై నిరృతిలోకం అలరారుతూ వుంటుంది.
కాలం దాపురించి పుణ్యతీర్థస్థలాలలో మృతి చెందిన పుణ్యపురుషులు ఈ నిరృతి లోక వాసులు అవుతారు. ఒక్క పవిత్ర కాశీక్షేత్రంలో తప్ప అన్యతీర్థాలలో ఆత్మహత్య కావించుకొన్న జనులు మిక్కిలి పాపులవుతారు. ఈ నిరృతి లోకానికి అధిపతి అయి దిక్పాలకుడి చరిత్ర చెపుతాము. సావధానమతివై ఆకర్ణించవలసింది.
వింధ్య పర్వత మధ్యభాగంలో నిర్వింధ్యా తీరాన ఒక అరణ్యం వుంది. ఆ కానలో ఒక బోయ పల్లె వుంది. పింగాక్షుడనే పేరుకల బోయ దొర ఆ పల్లెని ఏలుతూ వుంటాడు. ఆ బోయ దొర క్రూర కర్మలపట్ల విముఖుడు. ఆ కిరాతరాజు బెబ్బులి మొదలైన క్రూర మృగాలని తప్ప లేడి మున్నగు ఇతర జంతువుల్ని వేటాడడు. వేటాడుట అతని వృత్తి. ఆ లుబ్థక ప్రభువు కొన్ని పరిస్థితుల్లో ఎంతటి క్రూర జంతువునైనా చంపడు. తన్ను విశ్వసించిన మృగాన్ని జలం క్రోలు జీవాన్ని, నిద్రపోవు ప్రాణిని సంహరించడు. చూలు తాల్చిన జంతువుని, రతి క్రీడాసక్త మృగాన్ని వ్యాధిగ్రస్తమైన జంతువుని భీతిల్లిన జంతువుని అనుకంపతో సంహరింపడు.
ఆ శబర రాజపుంగవుడు పింగళాక్షుడు తీర్థసేవా పరాయణులకు కందమూలాలు, పండ్లు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, మజ్జిగ సమృద్ధిగా ఒసగుతాడు. చల్లని మంచినీటితో దప్పిక తీరుస్తాడు. దారి బత్తెములిస్తాడు.

-ఇంకాఉంది