మంచి మాట

కార్తిక ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక శుద్ధ ఏకాదశి ప్రబోధనైకాదశిగా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అసలు ఏకాదశి అంటే మనసుతోపాటుగా కర్మజ్ఞానేంద్రియాలను ఏకం చేసి భగవంతునికి అర్పించి మానవజన్మను పునీతం చేసుకోవటానికి పనికివచ్చే మహత్తర దిశామార్గం చూపే తిథిగా ఏకాదశి ప్రశస్తినొందింది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిప్రాతమైంది. ఓసారి మహాభక్తుడైన అంబరీషుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఆయనే కాక అంబరీషుని రాజ్యంలోని జనులందరూ కూడా ఏకాదశీ వ్రతనిష్ఠులుగా ఉండేవారట. ఆ భక్తుణ్ణి విష్ణుప్రియుడైన దుర్వాస మహాముని పరీక్షించుదామని వెళ్లాడట. ద్వాదశి ఘడియలు సమీపిస్తుండగా నేను సముద్రస్నానం చేసి వస్తాను. దుర్వాస మహాముని మనిద్దరం కలసి ద్వాదశిపారణ చేద్దామని అంబరీషునితోచెప్పాడు. అంబరీషుడు కూడా దానికి అంగీకరించాడు. కాని దుర్వాసుడు ద్వాదశి ఘడియలు దాటిపోబోతున్నా అయపులేకుండా ఉన్నాడు. అంబరీషునకు ఏమీ తోచక తన పురోహితులను తరుణోపాయం చెప్పమని అడిగాడట. వారు తులసితీర్థంతో పారణ చేస్తే అటు ఏకాదశి వ్రతానికి భంగం కలుగదు ఇటు దుర్వాసునితో ఉపవాసదీక్షకు ఆటంకం ఉండదన్నారు. వారి సలహాననుసరించి అంబరీషుడు పారణ పూర్తి చేశాడు. దుర్వాసుడు వచ్చి అంబరీషుడు చేసిన పనికి ఆగ్రహం తెచ్చుకున్నాడు. నీవు నీ ఏకాదశీ వ్రతమూ అంటూ తూలనాడి తన తపశ్శక్తితో కృత్య అనేమహాశక్తిని ప్రయోగించాడు. అంబరీషుడు నిర్విచారుడై మహావిష్ణువునే ప్రార్థించాడు. అంతా విష్ణుమయం అని తలచాడు. కృత్య ప్రయోగం తన భక్తుని నిశ్చలభక్తిని చూచిన మహావిష్ణువే తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని కాపాడడానికి పంపాడు. సుదర్శనం కృత్యను నాశనం చేసి దుర్వాసుని వెంట బడింది. ముల్లోకాలు తిరిగినా ఆ సుదర్శనం నుంచి రక్షించగల నాథుడు దుర్వాసునికి కనిపించలేదు.
భక్తవత్సలుడైన మహావిష్ణువు ఓ దుర్వాసా నీవు అంబరీషునే శరణు వేడు. ఇపుడు ఆ సుదర్శనం అంబరీషునిపరం అయ ఉంది అని సులభోపాయం చెప్పాడు. మహావిష్ణువు అపారదయను తెలుసుకొన్న దుర్వాసుడు భగవంతునికన్నా భక్తుడే మిన్న యని తలచాడు. వెంటనే తన తప్పును మన్నించమని అంబరీషుని శరణు వేడాడు. అంబరీషుడు సుదర్శనానికి నమోవాకాలర్పించి ఓ సుదర్శనమా నీవు ఈ దుర్వాసుని మన్నించి ఆ మహావిష్ణువు యొక్క భక్తవత్సలతను చూపుమా అని ప్రార్థించాడు. దయాళువైన మహావిష్ణువు తత్వాన్ని ఎరుక పర్చుకొనగల శక్తినివ్వుమా అని మరిమరీ కొనియాడాడు. సుదర్శనము అంబరీషునికి కైమోడ్చి విష్ణువు చెంతకేగింది. సుదర్శనానే్న నిలువరించగల శక్తినిచ్చే ఏకాదశి వ్రతం కార్తిక ఏకాదశి నాడు ఆచరిస్తే త్రిమూర్తుల దయను శివకేశవుల కృపను పొందవచ్చు.
విష్ణ్భుక్తులందరూ ఈ ఏకాదశికి ఉత్థ్థాపనైకాదశి, హరేరుత్థానైకాదశి అని పేరిడి విష్ణువుకు ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. వైష్ణావాలయాల్లో దీపాలు వెలిగించి విశేషపూజలు నిర్వహిస్తారు. ఈ కార్తిక ఏకాదశినాడు మేల్గాంచిన హరి ద్వాదశినాడు బృందావన విహారి అవుతాడు. తన కోసం ఎదురుచూచే వారిని కటాక్షిస్తాడు. అంతేకాక తనకు అత్యంత ఆప్తురాలైన తులసితో వివాహ మహోత్సవాలు జరుపుకొని తులసీనారాయణుడై ఏకాదశినాడు భక్తులకు దర్శనమిస్తాడు.. ఆషాఢమాసేకాదశితో ప్రారంభమయిన చాతుర్మాసవ్రతదీక్ష ఈ ఏకాదశితో ముగుస్తుంది. ప్రతిఏకాదశి నాడు నిర్జలోపవాసం ఉండి హరిని కీర్తించితే ఇహపరసుఖాలు లభిస్తాయని అంటారు.
ఏకాదశినాడు గోపూజ విశిష్టమైన ఫలితాలనిస్తుంది. ఈరోజు గోశాలను కడిగి ముగ్గులు వేసి గోపద్మవ్రతం ఆచరిస్తారు. కార్తిక ఏకాదశినాడు తులసికోట దగ్గర ఉసిరిక దీపాలనువెలిగించడం, ఉసిరిక పండ్లపై నేతిదీపాలను దానం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. వైష్ణవాలయాల్లో విష్ణ్భుక్తులు జాగరణ చేసి విష్ణుకథాగానాన్ని ఆలపిస్తారు. శైవాలయాల్లో మహాదేవునికి అభిషేకాలు విశేష పూజలు, దీపారాధనలు చేస్తారు. జాగరణ చేసి శివపురాణపఠనం చేస్తారు.

- నాగలక్ష్మి