నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ కరుణన్ చేకొని రేని రౌరవ పదగ్రస్తాత్ము దేవేంద్రుగా
బరగం జేయుదుఃరాత్మలో నలిగిరే బర్జన్యునా రౌర లో
త్కర పంక ప్రవిలీన కీటకముగా గల్పింతు రన్నట్టిచో
హర నీ భక్తుల శక్తి యెట్లు గుఱిసేయన్వచ్చు? సర్వేశ్వరా!

భావము:సర్వేశ్వరా! నీ భక్తులు దయతో స్వీకరిస్తే రౌరవంలో మునిగివున్నవాణ్ణి కూడా దేవేంద్రునిగా చేస్తారు. ఒకవేళ మనస్సులో కోపిస్తే దేవేంద్రుణ్ణి యినా ఆ రౌరవంలోని బురదలోని పురుగుగా చేస్తారు. అందువల్ల నీ భక్తుల శక్తికి మితి ఇది అని ఎట్లా చెబుతాము? అంబరీషుడు మహాభక్తుడు. ఏకాదశీవ్రతశీలుడు. అతివినయశీలి. అటువంటివానిని దుర్వాసుడు పరీక్షించుదామనుకొన్నాడు. కృత్యను అంబరీషునిపై ప్రయోగించాడు. కాని భక్తుని అవస్థలు భగవంతుడు చూస్తూ వూరుకుంటాడా? భగవంతునికి భక్తునికి భేదం ఉంటుందా భక్తుని బెదిరిస్తే భగవంతుడిని బెదిరించినట్లే కదా. అందుకే భక్తులు కోపిస్తే భగవంతుడు కోపించినట్లే, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తే అది భగవంతునికి పరమానందం అవుతుంది.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ