భక్తి కథలు

కాశీఖండం 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అఖిల లోకాలలో అనిదం పూర్వం అయిన ఇంతటి ప్రియవాల్లభ్యానికి జనిస్థానం అయిన చంద్రవదన ఎవ్వతియో! ఇంతటి వాల్లభ్యానికి అర్హురాలు కావడానికి ఈ జలజ దళాయతలోచన కన్న వెగ్గలం అయిన తపం ఎంత చేసుకుందో కదా! పరమ శివుడు ఎర్రదొండ పండువంటి పాటలాధరని నా కంటె మిక్కుటంగా మన్నించాడు- మేలా? చేసకొన్న పుణ్యఫలం కాక మరేమిటి? ఈ రాచిలుక పలుకు పలుకుబోడిని దయతలచాడు!’’ అని తలుస్తూ మనస్సులో కినుకయున్ను శృంగార చేష్టావిశేషం అయిన కిలికించిత (హర్షాశ్రురోషాదులు) మున్ను, కీలుకోగా సవతిని వీక్షించే ప్రౌఢనాయిక వలె ఆ మహీసురుడు మహీధర తనయని కనుగొన్నాడు. కనుగొని ‘‘కృతాంత భంజనుడు లేక కాలకాలుడు అయిన పరమేశ్వరుడు ఒక స్ర్తి ప్రాపులేకున్నా సృష్టి స్థితిలయాది పంచకృత్య పరాయణుడు కాజాలడా? మన్మధ విరోధి అయిన పరమ శివుడు పూర్ణచంద్రుణ్ణి చంద్రికా పేశలరశ్మిలాగు ఏ భామ పాయక వుంటుందో, ఏ తరుణి చంద్రకళావౌళికి ఇచ్చారూపక్రియారూప జ్ఞానరూప శక్తి అయి సకల జగత్సృష్టి కావిస్తుందో, ఏ మదగజయానధవుడి హృదయాన్ని ఉవ్విళ్లూర్చి ఆ భవుడి శరీరంలో సగపాలు కైకొన్నదో, మహితమైన హ్రీంకార మహామంత్రానికి ఏ లలిత అధిష్టాన దైవతమో ఆ పార్వతి పతి అయిన భూతపతికి తేనె తీయని మాటలతో ఈ గతి విన్నపం చేసింది.
‘‘త్య్రంబకా! వీడెక్కడి దురాత్ముడు? ఈ అవలక్షణం ఎక్కడ అలవర్చుకొన్నాడు? కనుగ్రేవలతో నన్ను మాటిమాటికి పలు రీతుల కన్గొంటూ బహువిధ వికారాలు చూపుతాడేమిటి? పచ్చి అబద్ధాలాడుతున్నాడు. రహస్యంలో ఈ దుష్టుడికింత చనుమానం అబ్బడం నీ కరుణాతిశయంవల్ల సుమా! వీడు తన మనస్సులో ఊరక నా రూపానికి అసూయ చెందుతున్నాడు. ప్రాణేశ్వరా! వీడి మనోవైఖరి వితర్కించి ఎరుగవలసి వుంది’’ అని వచించింది.
దరస్మితంవల్ల అందం చిందువందుతున్న వదనారవిందుడయి ఇందుకళాధరుడు ధరణీ ధరపుత్రితో ఈ విధంగా వాకొన్నాడు.
‘‘పర్వత రాజకుమారీ! నీ మనసులో తప్పులెన్ను తెన్ను మాను. వీడు నీ తనయుడే. నందనులు ఎన్ని అవిధేయ కృత్యాలు ఒనర్చినా, తల్లి డెందంలో కినుక వహిస్తుందా? అసలు రహస్యాన్ని పరికిస్తే దేవతల ఆలంబనంచే కల్గిన రతి భావాలు- సంచారి భావ విలాస మాత్రాలు సుమా!
అనంత గుణాలు కల పార్వతీ! ఇతను ఈ కాశీ క్షేత్రంలో పెక్కేండ్లు తపం ఆచరించాడు. నువీ పుణ్యశ్లోకుడిని దయార్ద్ర దృష్టితో చూడవలసి వుంది. ఇతనికి నేను వరం ఇస్తాను. నువ్వు కూడా వరం ఒసగు. ఎవరికైనా నాకూ నీకూ భేదభావం ఆవిష్కరింప వశమా!’’ అని పలికి ఆ పరమేశ్వరుడు ఆ యజ్ఞదత్త తనయుడికి యక్ష కిన్నర గుహ్యక లోకాధికారమూ, తన సఖ్యమూ వరాలుగా ప్రసాదించాడు. శాంకరియున్ను ‘ఓ భవ్యచరిత్రా! నీ ఎడమ కంటి గ్రుడ్డుపైకి లేచి ఉర్రూతలూగుతూ వుండుగాక! కుడి కంటిపాప ఎర్రనై రెండవ కంటితో ఒరసికొంటూ వుండుగాక! నీలగళుడు కరుణించి ఒసగిన వరాలు ఆ విధంగానే నెరవేరుగాక! నా అనన్య సౌందర్యాన్ని కాంచి అసూయపడ్డావు కనుక నీకు కుబేర నామం నిలిచివుండుగాక! ఈ ఆనంద కానన దివ్యక్షేత్రంలో నువ్వు ప్రతిష్ఠ సల్పిన శివలింగం సర్వసిద్ధిప్రదం అవుతుంది గాక! నిఖిల లోకాలలోను వర్ణనీయమూ అఖిల దురితపారమూ అయి అలరారుతుందిగాక!’’ అని శర్వాణి అతణ్ణి గౌరవించింది. ఇది యాజ్ఞదత్తి పవిత్ర చరిత్ర.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి