నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ తలమీదం గుసుమ ప్రసాద మలిక స్థానంబుపై భూతియున్
గళసీమంబున దండనాసిక తుదన్ గంధప్రసారంబులో
పల నైవేద్యము జేర్చు నే మనుజుడా భక్తుండు నీకెపుడుం
జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!
భావము:శ్రీకాళహస్తీశ్వరా! ఏ మనుజుడు నీ పూజా విధిలో చేర్చబడిన పువ్వులను తలదాల్చునో, భస్మమును నుదుట నలదుకొనునో, మాలికల మెడలో వేసుకొనునో, ధూప గంధమును పీల్చునో, నైవేద్యము నారగించునో అట్టి భక్తుడు కైలాసమున నీ సహచరుడై నిరంతరము విహరించును. మానవదేహమును సువాసనిలిచ్చే పరిమళద్రవ్యములతో అలంకరించినా అవి కొద్దిసేపే ఆనందాన్ని ఇస్తాయ. అట్లాకాక భగవంతునికినివేదన చేసిన గంధాక్షతలు తలదాల్చడం, ఆయన పూసుకొన్న భస్మాన్ని మనమూ అలదుకోవడం ఆయనకు నివేదించిన పదార్థాన్ని శివ అనుగ్రహ ప్రసాదంగా భుజించడం చేస్తే అవి అన్నీ కూడా అశాశ్వతిమైన ఈ దేహానికి ఇహపరసౌఖ్యాలను ఒనగూరుస్తాయ. శివ శివా అంటూ ఏపని చేసినా అది ముక్తిప్రదమూ మోక్షదాయకమే. మానవజన్మ తరించడానికి మళ్లీ మళ్లీ పునర్జన్మ పొందకుండా ఉండటానికి ఒకటే మార్గం అదే శివనామ జపం.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ