భక్తి కథలు

కాశీఖండం 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరిని మాధవకింకరులు శివశర్మతో ఈ వడువన శుక్రలోక వర్ణనమును చెప్పసాగారు.
ఇంద్రుడి నిశిత ప్రయోగాలకు ప్రతి విధాన క్రమంలో సమర్థుడైన రాక్షస గురువైన శుక్రాచార్యుడి లోకం ఇది. ఈ లోకంలో దనుజ గురువైన శుక్రుడు నివశిస్తాడు. ఆ శుక్రుడు శివుడు వల్ల వెయ్యేండ్లు నూక పొగ ఆహారంగా దుస్సహం అయిన తపం ఆచరించి మృత సంజీవినీ విద్యారహస్యాన్ని సకీలకంగా తెలిసికొన్నాడు.
ఓ విప్రవతంసా! శివశర్మా! ఈ మృత సంజీవినీ విద్యని బ్రహ్మ మొదలుకొని ఎవ్వరున్ను ఈ లోకములో ఎరుగరు. కుమారస్వామి, గజముఖుడు, గిరిజ, శివుడు తప్ప మరెవ్వరూ ఎరుగరు.
వెనుక పరమ శివుడితో వైరం వహించి అంధకాసురుడు సంగ్రామం ఒనరిస్తూ, పినాకం నుంచి ప్రయుక్తమైన నిశాతమైన అర్ధచంద్రబాణంవల్ల గాయం అయిన వక్షం కలవాడై వెనుకాడాడు. పరమేశ్వరుడికీ అంధకాసురుడికీ జరిగిన ఆ ఘోర కయ్యంలో మరణించిన రక్కసుల్ని మృత సంజీవినీ విద్యా మహిమచే శుక్రుడు బ్రతికించడం కనుకొని నందీశ్వర, నికుంభ, కుంభోదరాదులైన ప్రమథులు పరమ శివుడికి ఈ కరణి విన్నవించారు.
‘‘దేవా! మహాదేవా! త్రిపురాసురుల్ని గెల్చిన జోదా! అభవా! మా చేయు విన్నపం అవధరించు. మీ అనుగ్రహంతో పడసిన మృత సంజీవని విద్యా మహిమవల్ల శుక్రాచార్యుడు దానవుల్ని వెంట వెంటనే పునరుజ్జీవితుల్ని చేస్తున్నాడు.
మరి మాకు విజయం ఏ విధం లభిస్తుంది? అని విన్నపం ఓనర్చారు తత్‌క్షణం పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆదేశించి బందీ నిగ్రహించి పట్టిన లీలగా శుక్రుణ్ణి తెప్పించి, మిక్కిలి ధవళవర్ణం కల ఆ శుక్రాచార్యుణ్ణి పెరుగుతో కలిన చలిది ముద్ద మాదిరి అరచేత తాల్చి కాలకూట విషాన్ని మ్రింగిన బాగున గుటుక్కున మ్రింగి గర్రన త్రేన్చాడు. అంధకాసురుడు శుక్రుడు లేని కారణంవల్ల చేసేది లేక కొంతకాలం పోరి భర్గుడిచే హతుడు అయాడు. ఈ గతి నీలకంఠుడి జఠరగోళంలో చిక్కుపడి వుండి శుక్రుడు భవుడి జననేంద్రియ ద్వారం నుంచి శుక్లధాతు రూపాన స్రవించాడు. మరుక్షణమే నిజ రూపాన్ని ధరించాడు. అంత ఆ శుక్రాచార్యుణ్ణి సదాశివుడు తన తనయుడుగా భావించి వీడ్కొలిపాడు. శుక్రుడున్ను కాశీ నగరానికి తపస్సు చేయడానికి అరిగాడు.
అక్కడ శుక్రుడు ఉమ్మెత్తలు, గనే్నరులు, తామరలు, మాలతులు, కొండగోగులు, కడిమి పువ్వులు, పొగడలు, నల్ల కలువలు, మల్లెలు, వావిలి పువ్వులు, మోదుగలు, అశోకాలు, సురపొన్నలు, నాగకేసరాలు, అడవి మొల్లలు, కలిగొట్టు పువ్వులు, బిల్వదళాలు, పారిజాతాలు తుమ్మి పువ్వులు, మాచిపత్రిక, దవనం, మామిడి చివుళ్లు, దర్భలు, తులసీదళాలు, సంపెంగలు, నందివర్థనాలు- ఆదిగా గల పువ్వులతోను, ఆకు, అలములతోను శివుణ్ణి ఆరాధించి, శుక్రుడీ లోకానికి అధీశ్వరుడు అయాడు.
వారణాశిలో శుక్రేశ్వర లింగాన్ని అర్చించిన మనుజుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుర్దాయం, పుత్రులు, భాగ్యం, రాజ్యం, ఐశ్వర్యం, శౌర్యం, శాశ్వత సౌఖ్యాలు పొందుతాడు.
అంగారక లోక వృత్తాంతము
అదుగో అల్లదె అంగారక లోకం. శుక్రలోకం పైన వుంది.
పూర్వం సతీదేవితో ఎడబాటు కలిగి వియోగ సంతాపాగ్నితో వేగుతూ వున్నాడు. ఆ సమయంలో ఒకనాడు శివుడు నొసట ఒక చెమట బిందువు ఉదయించింది. అరముగ్గిన గుమ్మడి పండంత పెరిగి ఆ స్వేద బిందువు భూమిమీద రాలింది.

-ఇంకాఉంది