భక్తి కథలు

కాశీఖండం 85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వమేథ రాజసూయాధ్వరాలు చేసి సముపార్జించిన పుణ్యఫలాలు కాశీపురిలో మూడు రాత్రులు శయనించినంత మాత్రాన సమకూరుతాయి. తులా పురుషదానం (మానవుడు త్రాసులో తూగి ఆ ఎత్తు ధనం దానమివ్వడం) చేసిన ఫలం కాశీ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేతనే సిద్ధిస్తుంది.
కాశీ ప్రదేశంలో నా ఆజ్ఞ తప్ప వేరెవ్వరి ఆజ్ఞ చెల్లదు. నూరు యోజనాల దవ్వు కల నరుడు కూడ కాశీని స్మరించినంతనే దోషాలు తొలగిపోతాయి. కాశీక్షేత్రం లోపల ప్రవేశించే తరిలో మానవుడి పాప సమూహాలు ఆ పురి తల పొలం (పొలిమేర) లోనే నిలిచిపోతాయి. కాశీ పుణ్య క్షేత్రంలో చిరకాలం పెక్కు సంవత్సరాలు నివాసం వుండి దైవవశంవల్ల అన్యస్థలానికి అరిగి, మరణించిన జనుడికి కాశీ మరణంవల్ల లభించే ఫలం చేకూరుతుంది. ఈ అవిముక్తక్షేత్రంలో నివసించడం సంచిత, ఆగామి, ప్రారబ్ధాలు అనే మువ్విధాలైన కర్మలని నిర్మూలించే సామర్థ్యం కలది అవుతుంది.
మణికర్ణికా తీర్థంలో స్నానమాడి పితృ పితామహ ప్రపితామహదులకి తిలలతో, వడ్లతో, యవలతో తర్పణాలు విడిచిన నరుడు సర్వయజ్ఞ ఫలాన్ని పొందుతాడు. మణికర్ణికా తీర్థంలో స్నానం కావించిన అనంతరం మానవ్రతుడై, ఇంద్రియాలని జయించి, విశే్వశ్వర శ్రీమన్మహాదేవుడిని ఏ జనుడు సందర్శిస్తాడో ఆ జనుడు సమస్త వ్రతాలు ఆచరించిన ఫలాలను చేకొంటాడు. స్నానమాడు సమయాల్లో, దేవతార్చనాకాలంలో, జపం ఒనర్చే వేళల్లో, మల మూత్ర విసర్జన సమయాల్లో, దంతధావన వేళల్లో, హోమకాలాల్లో వాక్కుని నియమించుకొని (వౌనియై విశే్వశ్వరుణ్ణి సంతోషపెట్టడం కోసరం కాశీ క్షేత్రంలో మృతి చెందే మానవుడు ముక్తి ధనాల లాభం పొందుతాడు. ఆటంకాలు లేని, విఘ్నాలు లేని యజ్ఞం చెయ్యడంవల్ల యోగసాధన కావించడంవల్ల బహుజన్మ సంచిత పుణ్యఫలం కాశిలో శరీరం త్యజించిన జనుడికి సిద్ధిస్తుంది. శరీరం క్షణ భంగరం అనీ, జనన మరణాల సమయాలలో క్లేశాలు దుస్సహాలు, దుర్భరాలు అనీ పర్యాలోచన చేసి నరుడు ఆయువు తీరే అంతకాలమూ కాశీలోనే వసించాలి.
చతుస్సముద్ర పరివేష్టితం అయిన భూమి అనే భువన మధ్యంలో వున్న స్వర్ణఖండం ఈ కాశీక్షేత్రం. సంపూర్ణైశ్వర్య సమృద్ధులు కలది. ఎన్ని పాపకర్మలు ఒనర్చిన మానవుడైనా ఆ కాశీ క్షేత్ర సమీప భూముల్లో అయిదు క్రోసుల మేర వరకు యమ మహిష కంఠ ఘంటికాధ్వనులు ఆకర్ణించడు అని ఈ చందంగా విశదం కావించి నీలలోహితుడు విష్ణువుని కనుగొని మరొక విశేషాన్ని ఆలకించు.
భగీరథుడు అనే రాజర్షి- కపిల మహర్షి కోపాగ్ని జ్వాలలచే మండి మాడి బూడిద కుప్పలై పడిన సగర చక్రవర్తి కుమారుల్ని నరకలోకంనుంచి వుద్ధరించుటకై తపో మహిమ చేత మందాకినీ నదిని తీసికొని రాగా ఆ మహా పుణ్య తరంగిణి ఈ మణికర్ణికపైన ప్రవహించింది. ఆనాడు మొదలు ఆ మణికర్ణికా తీర్థం దేవ దానవులకైనా వర్ణింప అలవికానిది అయి విలసిల్లుతోంది.
అని కపర్ది విశ్వంభరుడు అయిన విష్ణుమూర్తికి ఈ విషయాలు వెల్లడించాడు. భాగీరథీ స్నాన పరత్వం కంటే మిన్న అయిన వేద శాస్త్ధ్య్రాయనం లేదు. గంగానదిని భక్తిశ్రద్ధలతో వీక్షిస్తే మనసా వాచా కర్మణా (త్రికరణాలచేత) చేసిన దురిత సంతతిని విదళిస్తుంది, శ్రీకంఠుడి అపార కృపలేక గంగా తీర వాసం సిద్ధించదు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి