మంచి మాట

నీతిన్యాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ సమయంలో భూలోకంలో మంచి గుణాలున్న వారెవరు? పరాక్రమం దండిగా ఉన్నవారెవరు? ధర్మం తెలిసిన వారెవరు? కృతజ్ఞతా భావంతో వ్యవహరించువారెవరు? సత్యమే పలికేవారెవరు? దృఢ సంకల్పం ఉన్నవారెవరు? అంటూ 32 శుభలక్షణ సమన్వితుడు ఎక్కడైనా ఉన్నాడా ’’ అని వాల్మీకి నారదుణ్ణి అడిగి మరీ శ్రీరాముని చరిత్రను రచించాడు. ఇన్ని మంచిలక్షణాలు ఉంటేనే మానవత్వం పరిమళిస్తుందని అంటారు. మానవత్వం లేకపోతే మనిషిగా లెక్కింపబడడు కదా.
అయతే ఇన్ని మంచి లక్షణాలున్నా ఎన్నో కష్టనష్టాలకు గురైనవాడు శ్రీరాముడు. రాజాంతపురంలో లేక లేక పుట్టిన బిడ్డడిగా అల్లారుముద్దుగా ముగ్గురమ్మల ముద్దుల తనయుడుగా దశరథుని గారాల బిడ్డగా ఎదిగినవాడు అడవుల్లో తిరిగాడు. కందమూలాలు తిన్నాడు. పడరాని నిందలు పడ్డాడు. గుహల్లో కటిక రాతిపైన నిద్రిం చాడు. కాని త్రేతాయుగపు రాముణ్ణి నేటి కలియుగంలోను ప్రతి నిత్యం తలుచుకునే వారు ఉన్నారు. రామభక్తులు కోకొల్లలుగా ఉన్నారు. ఓరామ నీ నామమెంత రుచిరా ... అంటూ రామనామస్మరణాంబుధిలో మునిగేవారు ఎందరో ఉన్నారు. నిత్యం రామాయణ పఠన కావించేవారు ఉన్నారు.
సీతమ్మతల్లి కూడా జనకుని ప్రియమైన తనయగా పెరిగింది. ఎన్నో శాస్త్రాలు నేర్చుకుంది. అతిసుకుమారవతి, సౌందర్యవతిగా దశరథుని కోడలుగా మెట్టినింటికి వచ్చింది. అగ్నిలాంటి దేవతల చేత మెప్పు పొందింది. కాని పరద్రవ్యాశపరుడైన రావణుని చేత ఎన్నో బాధలు పడింది. ఎన్నో మాటలు పడింది. చివరకు ఈ శరీరముంటేనే కదా ఇన్ని బాధలు పడాల్సింది అనుకొన్న శరీర త్యాగానికి కూడా ఒడిగట్టబోయంది. అంతటి మహాపురుషులకే కష్టాలు వస్తే ఇక ఈలోకంలో నోరు తెరిస్తే ఎదో ఒక అబద్ధం ఆడకుండా దినం గడవని సామాన్యులు ఇంక ఎన్ని కష్టాలు పడాలి. ఎవరైనా పెళ్లి చేసుకొంటే సీతారాముళ్లల్లాగా చిరకాలం వర్ధిల్లండి అని దీవించేవారు ఉన్నారు. సీతమ్మ మాయమ్మ ఆతల్లి మా తల్లి అనేవారు కలియుగంలో అడుగడునా కనిపిస్తారు.
ఇదంతా కూడా వారు చేసుకొన్న పుణ్యఫలం కాదు వారు ఆచరించిన పుణ్యపు పనుల విలువనే. వారిలో నిక్షిప్తమై ఉన్న మంచిలక్షణసముదాయం వల్లనే. కనుకనే మనిషి అన్నవాడు నిజాయతీగా, నిర్మలంగా ఉండాలి. అందరి యెడల సమబుద్ధిని గలగిఉండాలి. అన్యాయాన్ని ఎదరించే గుండెధైర్యం కలవారుగా ఉండాలి.
ఈసురోమని మనుషులుంటే దేశమేగతిన బాగుపడునోయ్ అన్న వాదానికి బలం ఇచ్చేవారిగా కాక దేశమంటే మనుషులోయ్ అన్నట్లు మానవత్వంతో సంచరించే జనాభాగా మారాలి. తనలాభం మాత్రమే చూసుకొంటే వారు స్వార్థపరులుగానే గుర్తించబడుతారు. వారి లాభమే కాదు తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద ను సంపాదించాలన్న యావతో నేటికాలంలో మనుషుల్లో ఉండకూడని దుర్గణాలు ప్రోగుపడుతున్నాయ. ఆ లక్షణాల వల్ల జంతువుల కన్నా హీనంగా మనిషి ప్రవర్తన ఉంటోంది. ఎక్కడ చూచినా అమానుషాలు, బలహీనులను బలంవంతులు హింసించడం అన్ని రంగాల్లోను అన్ని వర్గాల్లోను ప్రబలమవుతున్నాయ. ఇందులో చదువుకున్నవారు కూడా వుండడం శోచనీయం. మంచిమార్గాన్ని చూపే మార్గంలోను ఇలాంటి వారుండడం వల్ల మంచితనం పై నమ్మకం సడలుతోంది.
ఇట్లాంటి కలిప్రభావం ఎక్కువగా ఉన్నఈ సమయంలో భాగవత ప్రబోధం వ్యాప్తిచెందాలి. శ్రీకృష్ణుడు చెప్పిన తత్వాన్ని గురించి జనుల్లో అవగాహన పెంచేమార్గం చూడాలి. ప్రవచనాలు వింటున్నంత సేపు నీతిగురించి ఆలోచించిన మనుజుడు ఆ ప్రవచనం అయ తనదారిన వెళ్లేటపుడే అపమార్గాన్ని తొక్కుతున్నాడు. ఇట్లాకాక మనుజుల్లో దైవభక్తి సాటిప్రాణుల పట్ల దయ అనే గుణాలు పాదుకొనేట్టుగా ప్రయత్నం చేయాలి. దీనికి మహానుభావుల జీవిత చరిత్రలను వారికి వినిపింప చేయాలి.

- రాంప్రసాద్