భక్తి కథలు

కాశీఖండం 96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళావత్యు పాఖ్యానము
ఈశాన వాపికా సమీపంలో ఈశానుడు నివాసం ఏర్పరచుకొన్నాడు. అగస్త్య సంయమీశ్వరా! చిత్ర విచిత్రార్థాలు కల యితిహాసం- జ్ఞానవాపికా తీర్థ మహత్మ్యం ప్రకారం చెపుతాను, ఆకర్ణించు.
హరిస్వామి అనే భూసురుడొకడు కాశీనగరంలో వుంటాడు. సుశీల ఆ హరి స్వామి కుమార్తె. ఆమె రూపరేఖలచేతా విలాసం చేతా భువన త్రయంలోను ప్రశంసించదగి వుంటుంది. ఆ బాలారత్నం పల పల తెల్లవారుతూ వుండగా ఆ సుశీల జ్ఞానవాపికలో స్నానమాడి చెలికత్తెలు, తాను శేషభూషణుడైన శివుణ్ణి తరువాత పూజ చేస్తుంది. తెలికన్నులు, ఉన్నతం అవుతున్న వక్షస్థలం కనుబొమ్మల మీదికి వ్రాలిపడే చూర్ణకుంతలములు కని పురజనులు మనస్సులో ఉవ్విళ్లూరుతూ వుంటారు.
ఆ సుశీల సాక్షాత్కరించిన లక్ష్మివలె ముంజేతి కంకణాలతో కడియాలు ఒరసికొనగా విశే్వశ్వరుడి కళ్యాణవేదికలో రంగవల్లులు తీర్చునపుడు ముజ్జగాల వారు మోహిస్తారు.
అధికమైన సౌభాగ్య లక్ష్మి, పద్మముఖి అయిన ఆ సుశీలతో సాటివచ్చే తరుణులు ముల్లోకాలలో లేరంటూ బ్రహ్మదేవుడు సంకేత రేఖలు ఆమె కంఠ సీమను వ్రాశాడా అనే రీతిని సుశీల గళసీమని మూడు రేఖలు అందగిస్తున్నాయి.
సుశీల జ్ఞానవాపికా జలాలు క్రోలడంవల్ల ఆమె కడుపులో మూడు శివలింగాలు వుంటాయి. ఓ అగస్త్య మహర్షీ! కేదారతీర్థ జలాలూ, కాశీలోని శివతీర్థ జలాలు శివలింగములుగా మారుతూ వుంటాయి.
ఈ విధంగా వుండగా ఒకనాడు ఒక విద్యాధరుడు సుశీల రూప లావణ్యాల చేత మోహితుడై, పిండారపోసిన చందంగా నిండు వెనె్నలలు కాస్తూ వుండగా ఆ సుశీల ముంగిట వెనె్నల వంటి తెల్లని శయ్యపై నిద్రించి వుంది. ఆ విద్యాధరుడు ఆమెకు నిద్రాభంగం కలుగకుండా తామరరేకులకన్నా సుకుమారాలైన తన హస్త పల్లవాలతో ఎత్తుకొని ఆకాశ మార్గంలో మలయాచలానికి కొనిపోయాడు. ఆ సమయంలో విద్యన్మాలి అనే రాక్షసుడు ఆ మెరుగుబోడి అయిన సుశీలని కాంచి, మోహావేశంతో పెట్టుకోవడానికి యత్నించాడు. విద్యాధరుడు సుశీలని ఒక యెడ భద్రంగా వుంచి, అతిశయిస్తున్న భుజ పరాక్రమంతో ఆ రాక్షసుడితో తలపడ్డాడు.
ఆ ఇర్వురు కామాతురులై కన్నుగాక చలం వహించి ముష్టాముష్టి బాహాబాహి, కచాకచి- దేవతలు కొనియాడగా సమరం సలిపారు. ఆ సమయంలో అప్సరస అయిన తిలోత్తమ సుందోపసుందలు తనకై పోరాడుతూ వుండగా చూసే చందంగా- సుశీల విద్యాధర రాక్షసులు పరాక్రమంతో కయ్యం సల్పుతూ వుండగా చూడసాగింది.
విద్యాధర రాక్షసులు ఇద్దరూ ఆజి సల్పి అన్యోన్య ముష్టిప్రహారాలతో రణస్థలంలో మరణించారు.
అపుడు ప్రాణ నిర్గమన సమయంలో విద్యాధరుడు గ్రుడ్లు తిరుగబడగా ఆ సుశీల వంక చూసి, ‘‘కటకటా! నిన్ను’’ అంటూ డగ్గుత్తుకపడి మాట నాల్కమీద వుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
అంత ఆ సుశీల తన అంతరాత్మలో ఆ విద్యాధరుడిని ఆలింగనం కావించుకొంది. తన రొమ్ము ఆతని రొమ్ముతో రాసుకొంది. ముఖపద్మం తావుల్ని మూర్కొంది. భర్త అనగా ఎవడు? భార్య అనగా ఎవతె? అతడే భర్త. నేను అతడి ఆలిని?’’ అని ఆ విద్యాధరుడితో సహగమనం చేయదలచి, నిశ్చయించుకొని మెరుగుబోడి అయిన ఆ సుశీల మలయాచల ప్రాంతానికి అరిగింది.

-ఇంకాఉంది

ళ్రీపాద కృష్ణమూర్తి