భక్తి కథలు

కాశీఖండం 99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారస్వతేశ్వరుడు అనే శివలింగం ఇతడే! రత్న జ్యోతీశ్వరుడు అనే గజవిరోధి ఇతడే! అతడు శైలేశ్వరుడు అనే ఉరగాభరణుడు, సప్త జలధీశ్వర లింగం అనే శంకరుడు వాడే!
ధరణి నాయకా! సప్తకోటి మహర్ష మంత్రాలకి అధిదైవతం అయిన ఇతడు మంత్రేశ్వరుడు. ఈ వేల్పే త్రిపురేశ్వరుడు. త్రిపుర రూపదానవులకు సన్నిధిలో వుండి పూజలందుకున్న దేవుడు ఇతడే! ఈయనే వాణేశ్వరుడు. బాణాసురుడికి వేయభుజాలు ఒసగిన చంద్రశేఖరుడు. ఆయనే వైరోచనేశ్వరుడు! ప్రహ్లాదేశ్వర నారదేశ్వరులు అల్లవారే! చూడు. ఆ దిగదాధరేశ్వరుడు, భీష్మకేశ్వరుడు, భృగ్వీశ్వరుడు, గోపీముకుందేశ్వరుడు, నారసింహేశ్వరుడు, ఆత్రేయనాధేశ్వరుడు, శేషేశ్వరుడు, విఘ్నరాజేశ్వరుడు వారు వారే- దర్శించు.
పార్థివేంద్రా! బిందుమాధవస్వామి ఆనంద కాననం లేక కాశీనగరపు వీధుల్లో విహరించే కోకిలస్వామి- పంచనద తీర్థరాజం కాశీఫాలస్థలీ కస్తూరీ తిలకం.
ఈమెయే మంగళగౌరి! ఇదిగో ఈ కనవచ్చేది మార్కండేయముని ప్రతిష్ఠితం అయిన శివలింగం. రౌత పాతకేశ్వర లింగస్థానం. ఇది కిరణేశ్వర లింగానికి ఉనికిపట్టు.
వేయి మాటలు ఎందుకు? ఈ ఆనందకానన మధ్యప్రదేశంలో శశిఖండ మకుటులు, సర్పకంకణులు, నిటలలోచన శివులు- గిరిశులు, ధూర్జటులు, హరులు నారుపోసిన ఆకుముడి తీరున క్రిక్కిరిసి వుంటారు అని చెప్పి ఆ కళావతీ సాధ్వి జ్ఞానవాపికా తీర్థాన్ని చూపి- ఆమె స్తంభము, రోమాంచం, మున్నయిన సాత్త్విక భావాలు మాటిమాటికి స్పష్టములయే రీతిని మూర్ఛిల్లింది. వెంటనే భూపతి అబ్బురపడి శశిరోపచారాలు చేయసాగాడు. పురుషుడి మాదిరిగా ప్రగల్భ అయిన బుద్ధిశరీరిణి అనే ఆమె కళావతిని డాసి, మూర్చకు కారణం గ్రహించి, చిత్రపటాన్ని ఆమె శరీరానికి సోకించి ఆ కళావతి చెవిలో బిగ్గరగా జ్ఞానోదం, జ్ఞానవాపిక జ్ఞానతీర్థం అంటూ ముమ్మారులు పలికింది. ఆ శబ్దాలు విన్నంత మాత్రం చేతనే ఆ కళావతి వాడిపోతూ వున్న పైరు వాన నీటికి వలె చైతన్యం తెచ్చుకొంది.
మలయకేతువున్ను కళావతీ ప్రేరణ చేత పుత్రుడికి రాజ్యభారం సంక్రమింపజేసి వారణసీపురానికి అరిగి, జ్ఞానవాపికా తీరాన తపస్సు ఒనరించి, మోక్షపదవి పొందాడు. అగస్త్య మహర్షీ! ఇది శివతీర్థం మహత్మ్యం. ఇంకా నువ్వు ఏమి అడుగదలిస్తే అది అడుగు’’ అని వాకొన్నాడు.
అంత ఆ కలశభవుడైన అగస్త్యుడు ‘‘అనఘ కుమారస్వామీ! నాకు సత్పురుషుల ఆచారాన్ని సెలవియ్యి. విప్రుడు సదాచార పరత్వంవల్లగాని చిత్తశుద్ధి పొందలేడు. ఆత్మశుద్ధివల్ల కాని కాశీవాసం సిద్ధింపజాలదు.
సదాచార నిరూపణము
అగస్త్యుడు ఆ పగిది ప్రశ్నింప దేవసేనాపతి కుమారస్వామి ఆ మహర్షిని కనుగొని- మనువు, అత్రి, భృగుడు, భరద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు, శుక్రుడు, అంగిరసుడు, అర్యముడు, ఆపస్తంబుడు, సంవర్తుడు, కాత్యాయనుడు, బృహస్పతి, శాతాతపుడు, శంఖుడు, లిఖితుడు, పరాశరుడు మొదలైన వారి పద్ధతుల్లో సదాచారం ప్రసక్తానుప్రసక్తంగా కాక సవిస్తరంగా నీకు వివరింపబోతే అపారమై వుంటుంది. కనుక నీకు తెలుపుతాను. సావధానమతివై ఆకర్ణించవలసింది.
వింధ్య గర్వాపహారీ! నాలుగాశ్రమాల సమూహమున్ను- అనగా బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసాశ్రమాలు నాలుగున్నూ- నాలుగు స్కంధాలు కలది. మొదటి మూడు స్కంధములున్ను ధర్మాలు వహిస్తాయి. వచిస్తాయి. చివరి స్కంథం అంతయున్ను జ్ఞానసంపత్తి వైభవానికి ఆటపట్టు.
లోపాముద్రా ప్రాణేశ్వరా! విను.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి