భక్తి కథలు

కాశీఖండం 110

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు బ్రహ్మదేవుడు ‘ఆ విధంగానే జరుగుతుంది’ అని పలికి కాశీనగరానికి ఏగాడు. కాశీ విశ్వనాథుడికి జరిగిన విషయం అంతా తెలియజెప్పి, ఆ విశే్వశ్వరుడి అనుజ్ఞ పడసి, ఆ దివోదాసుకి పట్ట్భాషేకం కావించి సత్యలోకానికి వెడలిపోయాడు.
మనువంశాభరణుడైన దివోదాస భూపాలుడు ఘంటాటంకార ధ్వని, దుందుభిఘోషతో బెరసి- కలిసిపోయే రీతిని సకల ధరణీతలంలోను ‘‘దేవతలు భూమి మీద వుంటే అపరాథం అవుతుంది. క్రోధం, పాపకారణం. ఆటోపంతో కుటుంబ సమేతంగా శీఘ్రంగా స్వర్గలోకం చేరుకోండి’’ అని చాటింపు వేయించాడు.
హతాశునులైన సర్పములారా! పాతాళలోకానికి ఏగండి- భూతములారా! ఎక్కడికైనా మీ ఇచ్చవచ్చిన యెడకు చనండి’’ అని ఈ విధంగా రాజదూతలు ధరణిలో విస్తారంగా చాటింపు వేసి రాజ్ఞాని తెలియచెప్పారు.
ఈశ్వరుడు దేవతలతో మందరాద్రి కేగుట
ఈ విధంగా దివోదాసుడి భటులు కాశీనగరం, శ్రీశైలం, కుంభకోణం, కోణార్క, చిదంబరం, పాండురంగం, ఉజ్జయిని, కాళహస్తి, కాంచి, వెంకటాద్రి, శ్రీరంగం, తిరువాలూరు, రామేశ్వరం- ఆదిగాగల పుణ్యస్థలాల్లోని రాచబాటల్లో ఘంటా డిండి మధ్వానాలతో చాటించగా బ్రహ్మదత్త వరమహిమవల్ల కుటుంబ సమేతంగా, త్య్రంబకులు (శివులు) పీతాంబర (విష్ణువులు), విఘ్నేశ్వరులు, భైరవులు, దుర్గలు, వీరభద్రులు మెదలుగాకల అమరులు తమ తమ శంఖాలతో దుందుభులు, వేణువులు, వీణలు, మృదంగాలు, తాళాలు, ఢక్కలు, హుడుక్కలు, బాకాలు తప్పెటలు, ఆనకాలు మున్నగు వాద్య ధ్వనుల మ్రోత దిగంతాల వరకు మారుమ్రోగ, కిరీటాగ్రస్థగిత మణుమయూర పుంజం అకాల సంధ్యాకాలాన్ని ఉదయింపజేయగా, శే్వతచ్ఛత్రాలతో, జెండాలతో, వింజామరలతో, వీవనలతో, దోసపండు ఆకారపు పాత్రలు, తమ్మపడిగలు, తలగడలు, మణులు కూర్చిన అద్దాలు, సెజ్జలు, గంగాళాలు- వీటి సమృద్ధి మహైశ్వర్యాన్ని వెల్లడి చేయగా, ఆకాశవీధిని వాహన సహితులు, సాయుధులు, పరివార సమేతులు, శక్తి సహితులు, అలంకార సహితులై కాశీపురానికి ఏతెంచి, విశే్వశ్వరదేవుడి ఆదేశం చేత ఏ యెడకయినా పోవువారై గంగా తీరంలో విడిశారు. కాశీవిశే్వశ్వరుడు ఒక్క పని రెండు ఫలాల్ని ఈయగలిగే ప్రకారాన్ని వితర్కించి అంతకుపూర్వం చిరకాలం నుంచి అవిముక్త క్షేత్రంలో వలెనే తన శిఖరం మీద తను నివసించడం ఫలంగా కోరి ఘోర తపం ఆచరించిన మందరగిరి ధన్యం అయే రీతిని తానా మందర పర్వతంమీద వసించి దివోదాసుప్రతిజ్ఞని నెరవేర్చేవాడయి, ఆ తరిని అక్కడికిచేరి వున్న దేవతాతతిని కాంచి యిట్లు పలికాడు.
‘‘ఓ దేవతా ప్రముఖులారా! పద్మ సంభవుడు ఆదరంతో దివోదాసుకి వసుధా స్థలం అంతా జగద్ధితం కోసం ఒసగాడు. ఆ దివోదాసు ఈ ధరణీ రాజ్యభారం వహించే సమయంలో దేవతలు, అసురలు, సిద్ధలు, సాధ్యులు, గరుడులు ఆదిగా గల దేవతల్ని, ఉరగాధిపుల్ని అదుపులో నువ్వు వుంచితే కాని నేను రాజ్యం చెయ్యను. బహు నాయకం అయిన రాజ్యం భద్రంగా వుండదు. సర్పరాజులు పాతాళలోకంలోనే చరించాలి. దేవతలు స్వర్గంలోనే సంచరించాలి’’ అని వరం ప్రసారించి, నా అనుమతితో అతడు కోరినవరాన్ని ఇచ్చాడని సెలవిచ్చాడు.
మహామహిములై రుద్రాక్షమాలలనే ఆభరణాలుగా తాల్చినవారున్ను, విభూతి రేఖలతో దేదీప్యమానులున్ను, ఎర్రని జటాజూటాలు కలవారున్ను పులి చర్మాంబరధారులున్ను, దంత నిర్మితయోగ దండభూషితులున్ను, సర్ప యజ్ఞోపవీతధారులున్ను ఇంకా....

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి