భక్తి కథలు

కాశీఖండం 116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్ని ప్రకారాలుగా కాశీలో సంచరించి సూర్యుడు దివోదాస ప్రభువులో ఒక్క దోషమైనా కనుక్కొనలేకపోయాడు. ఒక్క రాజుతోనే అని ఏమిటి? ఒక సామాన్య నరుడిలో కూడా అవకరాన్ని కనుగొనలేకపోయాడు. ఈ రీతిగా తన ప్రయత్నాలు అన్నీ నిరర్థకాలు, నిష్ఫలాలు అయి తన అంతరాత్మలో ఈ పగిది తలపోసాడు.
శివదేవుడు ఆదేశించిన కార్యం ఫలోన్ముఖం కాకుండా- మందర పర్వతానికి ఏ కరణి అనుగుతాను? అదుగో వచ్చాడు- ఇదుగో వచ్చాడు అని నాకోసం ఎదురుతెన్నులు చూసే ఈశ్వరుణ్ణి ఏ ముఖంతో కనుగొంటాను? సర్వాధిపతి ఆన నిర్వహించకుండా దేవతల్లోను, ప్రమథుల్లోను నేను ఈ రీతిని ప్రభుత్వాన్ని- అధికారాన్ని పొందగల్గుతాను? న్యూనతతో ఒదిగి ఒదిగి వుండకుండా ఏ భంగి ఫాలక్షుడి ముందు నిలువగల్గుతాను? నేడు రేపు కాశీ వియోగ దుస్సహ భరంచేత వేగి వేగి బాధపడి క్రోధంతో ఎర్రజిగి తన్నిన కన్నులు కలిగి వున్నాడు. భవుడు కినుకపూన భరియించ శక్యమా? కనుక ఈ కాశీలోనే కాలం వెళ్లబుచ్చుతూ వుంటాను.
హరిశ్చంద్ర చక్రవర్తి, శిబి చక్రవర్తి, ధధీచి ప్రముఖులైన పూజ్యులు పెద్దలు కాశీ సంసేవనం వల్ల సంసార దుఃఖాలు త్యజించారని అంటారు. కాశీ ప్రభావం ఎరిగిన భాస్కరుడు- లోలార్కుడు, ఉత్తరార్కుడు, సాంబాదిత్యుడు, గరుడాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఖలోల్కాదిత్యుడు, వరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు- అన్న పేర్లతో పనె్నండు మూర్తులు- రూపాలు ధరించి, కాశీనగరంలో నివసించాడు. కాశీ నివాసం నిమిత్తంగా- కారణంగా మనస్సు లోలం- చంచలం- కావడం చేత లోలార్కుడు అయాడు. ఈ ద్వాదశాదిత్యుల ప్రభావాన్ని క్రమంలో వర్ణిస్తాను. ఆకర్ణించు.
కాశీపురానికి ఉత్తర దిశను నివసించడం వల్ల ఉత్తరార్కుడు అనే నామం కలిగింది. ఆ ఉత్తరార్కుడి మహిమని- ప్రభావాన్ని వెల్లడి చేసే ఇతిహాసం ఒకటి వినిపిస్తాను. విను. కాశీలో ప్రియవ్రతుడు అనే విప్రవతంసుడు పూర్వం వసించేవాడు. ఆ ప్రియవ్రతుడు సదాచార సంపన్నుడు. పరమ శాంతుడు. అతిథిప్రియుడు. అతడి ధర్మపత్ని పేరు శుభవ్రత. ఆ దంపతులకి మూలానక్షత్రం ప్రథమ చరణంలో గురుడు కేంద్రంలో వుండగా ఒక పుత్రిక జన్మించింది. ఆమె చంద్రవదన. రూపసంపదతోపాటు తాను కూడా వృద్ధి పొందింది.
వౌనివర్యా! ఆ కుమార్తె పేరు సులక్షణ. ఆమె సకల శుభలక్షణాలకి, సౌభాగ్యానికి పుట్టిల్లు. ఆ సులక్షణ దినదినం పెరిగి పెద్దది అవసాగింది. ఆమె పెద్దది కావడంతో పాటు తండ్రికి మనోవ్యధ అధికం అయింది.
‘‘ఈ కిసలయాంగికి యోగ్యుడైన వరుడు ఎవ్వడో కదా! విశుద్ధమైన వంశంలో పుట్టినది, గొప్ప సౌభాగ్యవతి, భాగ్యవతికి అనురూప గుణగణ సంపన్నుడు ఎవడో కదా!’’ అని ఆమె తండ్రి ప్రియవ్రతుడు ఆత్మలో చింతిస్తూ వుంటాడు.
ఆ సులక్షణ మూలా నక్షత్ర ప్రథమ చరణంలో తండ్రి గండాన జన్మించిన నిమిత్తంగా చింతాజ్వరానికి తోడు జ్వరం కూడా సోకి ఆనంద కాననంలో ఆ విప్రుడు ప్రాణాలు కోల్పోయాడు. భార్య శుభవ్రతకూడ భర్తతో సహగమనం కావించింది. సులక్షణ దుఃఖావేశం కలది అయినా ధీరోదాత్త కనుక తత్పరభావంతో తల్లిదండ్రులకి ఊర్థ్వలోకానికి వెళ్ళే విధులు నిర్వర్తించి, తన అంతరంగంలో ఈ విధంగా చింతించింది.
‘‘నా ప్రాణాలకి ప్రాణాలైన తల్లిదండ్రుల్ని హృదయంలో నేనే రీతిని మరచిపోగలను? తల్లిని, తండ్రిని కోల్పోయినదాననై అతి శోచనీయమైన వర్తనంతో ఈ సంసార సాగరాన్ని ఏ విధంగా ఈదగలను?

-ఇంకాఉంది