డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాన్ని మనం సృష్టించాలి కాని జీవితం చేతిలో తోలుబొమ్మలుగా మాత్రమే మిగిలిపోతాం.’’
‘‘మేం ఆర్మీవాళ్ళం.. రాజకీయ నాయకుల చేతులలో కీలుబొమ్మలం. అయితే మీరు పెద్ద పెద్ద కంపెనీల చేతులలో అవుతారు. పెద్ద తేడా ఏమీ లేదు’’.
‘‘ఏమిటి?’’’ ఒక్కసారి కరెంటు తగిలినట్లుగా అనిపించింది. తను ఏ ఉద్యోగం దొరకగానే ఆకాశం అంత ఎదిగాడో ఆ ఉద్యోగం గురించిన కఠోర సత్యం. ఎంతమందిని ఓడించి తను ఐఐఎమ్, కలకత్తాలో ఉద్యోగం సంపాదించాడు. అసలు ఈ దృష్టితో తనెప్పుడు చూడలేదు. తన గురించి మరొకసారి ఆలోచించాలి?’’
కాని తను ఇంత తొందరగా అపజయాన్ని స్వీకరించడు. కొంత అతడిని సమాధానపరచడానికి ప్రయత్నించాడు- ‘‘నీ ఉద్దేశ్యంలో బహు రాష్ట్రీయ కంపెనీలు కేవలం తమ స్వలాభాలే చూసుకుంటాయి. కాని ప్రాఫిట్ అన్నింటికన్నా బలమైన ఫోర్స్. ఇది కూడా నిజమే. ఒకవేళ ప్రాఫిట్ మోటివ్ కాకపోతే ఇన్ని పరుగులు - ఉరుకులు ఎందుకు? గ్లోబల్ ఎకానమీ వలన ఇండియా ఎంతో ఉన్నత స్థితిలోకి వచ్చింది’’.
‘‘‘ఇవాళ 223 కోట్ల ప్రజలు తిండిలేక అలమటిస్తున్నారు. బాలశ్రామికుల సంఖ్య పెరుగుతోంది. ఊళ్ళు ఊడ్చుకుపోతున్నాయి. ఆదివాసీలు తమ అడవులను కోల్పోతున్నారు. ఇళ్ళు వాకిళ్ళను వదిలి ప్రవాస పక్షులుగా మారిపోతున్నారు.
హత్యల గురించి ఇక చెప్పనే చెప్పవద్దు. కోట్లమంది ప్రజల వ్యక్తిగత ఆదాయం రోజుకి 20 రూ మాత్రమే. నిజానికి స్థితిగతులు అన్నీ బాగుంటే మావోవాదుల సంఖ్య పెరగదు. వ్యక్తి ఆకలి మంటలకి తాళలేక గన్‌పట్టుకుంటాడు’’.
సిద్ధార్థ ఇక ఏమీ చెప్పలేక తుర్ఫుకార్డు విసిరాడు.
‘‘కాని నేను నీలాగా భారత్ సర్కార్ అగ్రిమెంటుకి బానిసగా బతకడంలేదు. నాకు ఇష్టం వచ్చినపుడు రెజిగ్నేషన్ ఇవ్వవచ్చు’’.
‘‘మరి నీవు నీలో వున్న ప్రతిభను ఈ ఆడవాళ్ళకి అందాన్ని ఇవ్వడానికి ఎందుకు ఉపయోగిస్తున్నావు? నీవు ఓ భ్రమకి లోనవుతున్నావు. సందీప్ దృష్టి సిద్ధార్థ చేతిలో ఉన్న బ్లాక్ బెర్రీ మొబైల్ మీద పడ్డది. ‘దీని ఖరీదు చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు శ్రీనగర్‌లో ఎక్కడా కనిపించదు’.
అన్నయ్య ఎందుకు ఇంత కఠోరంగా మాట్లాడుతున్నాడో అతడికి అర్థం కాలేదు. మల్టీనేషనల్ కంపెనీలంటే అతడికి ఎందుకంత కోపం? లేకపోతే మానసిక వ్యాధి ఏమైనా వచ్చిందా? ఉహూ.. తన అన్నయ్యకి మానసిక వ్యాధి చస్తే రాదు. తనకా నమ్మకం ఉంది. మరి అయితే మిలటరీ వాళ్ళ కఠోరమైన జీవితం వలన అతడు ఇంత కఠోరంగా తయారయ్యాడా? తనపైన కొరడా దెబ్బలు కొడుతున్నాడు. అతడు పూర్తిగా మిలటరీవాడుగా కూడా కాలేకపోయాడు. అన్నయ్యగా కూడా కాలేకపోయాడు. అసలు ఎందుకింత కఠోరంగా తయారయ్యాడు.
నిశ్శబ్దం.. ఇద్దరు అన్నదమ్ములు రక్తమాంసాలు ఉన్న వ్యక్తులుగా కాకుండా రెండు చల్లటి మంచుముక్కల్లా పడి ఉన్నారా?
తను అనవసరంగా తమ్ముడి మనస్సు బాధపెట్టాడా! ఇష్టం వచ్చినట్లు అంత చేదుగా మాట్లాడాడా? అని అనిపించిందని సందీప్‌కి. భారతదేశంలో ఎంతో ప్రతిష్ఠ కలిగిన సంస్థ ఎమ్.బి.ఏ. ఎంత హైపాక్‌డ్. దేశానికి కిమీలేయర్. తను ఎంతగా తీసిపడేసాడు. వాడు మనీమైండ్ కాకపోతే మరేవౌతాడు? ప్రతీ దాన్ని డబ్బుతో ముడిపెట్టే మనస్తత్వం అందరిదీ అయిపోతుంది. నిజానికి ఇందులో ఎవరి తప్పులేదు. డబ్బుతోనే వికాసం సంభవౌతుంది అన్న ఆలోచన వ్యక్తిలోని కరుణ, సంవేదన, మానవత్వం, కోమల భావాలు అన్నీ మంటకలిసిపోతున్నాయి. సంపాదన పెరిగే గ్రాఫ్ తప్ప ఇక ఇప్పుడు మానవతా విలువలకు చోటులేదు. ఇదే సత్యం. నిజానికి వాడు మాత్రం ఏం చేస్తాడు?
అసలు ఈ మల్టీ నేషనల్ కంపెనీల డిజైన్ దేశానికి కావాల్సిన రీతిలో చేస్తున్నారా? కాదు- అసలు ఏ ప్రొఫెషన్‌లోను నైతికత అనేది లేకుండా పోయింది. కిందటి బహుశ నలభై, ఏభై సంవత్సరాలలో దేశంలో నైతికతను వెలివేశారు. ఇప్పుడు ఎక్కడ ఉంది నైతికత. చచ్చిన ఎలుకలను అమ్మే కౌశల్యాన్ని చూపడంలో వీళ్ళ తెలివితేటలు, ప్రతిభ అన్నీ ఖర్చవుతున్నాయి. కాశ్మీరంలోని యువతరం శక్తి అంతా పిస్తోళ్ళను కాల్చడంలో ఖర్చయిపోతోంది.
కాని భారతదేశం అంటే కేవలం కాశ్మీరమేనా? కాదు. కాని మరెందుకు అతని మనస్సులో ఇంత చేదు, ఇంత కాఠిన్యం చోటుచేసుకుంటున్నాయి? కాశ్మీర్‌లో పోస్టింగ్ వలన ఈ రకంగా తను తయారయ్యాడా? కాని తాను దారితప్పకుండా దారి వెతుక్కుంటాడు.
అతడికి నిద్ర వస్తోంది. కాని నిద్రను పారదోలుతూ తమ్ముడి గాయాలకు మందు పూసే ప్రయత్నం చేయసాగాడు. అతడితో మృదువుగా తీయ తీయగా మాట్లాడసాగాడు. కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు.
చూస్తూ చూస్తూ ఉండగానే ఇద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్థలు బలహీనమైన అలలాగా విలీనం అయిపోయాయి. చల్లటిగాలి వీచసాగింది. పూలు వికసించసాగాయి. మళ్లీ ఇద్దరు మొదటిలా అన్నదమ్ములైపోయారు. మరునాటి వరకు ఇద్దరు కలిసే నిద్రలో కలలు కనసాగారు.
ఉదయం కమాండింగ్ ఆఫీసరు కల్నల్ ఆప్టే సందీప్‌ని వెంటనే పిలిచాడు. బేస్ కాంప్ భూషణ్‌కి సిద్ధార్థని తీసుకుని సందీప్ వెళ్ళాడు. సిద్ధార్థకి తన కాటేజ్ చూపించాడు. మొదటి చూపులో భూషణ్ కాంప్ సిద్ధార్థకి ఎంతో నచ్చింది.

- ఇంకాఉంది