భక్తి కథలు

కాశీఖండం 119

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణ్యసాధ్వి అయిన వినత వెండి కొండ శిలల వంటి మూడు గ్రుడ్డులను ప్రసవించింది.
వినత ప్రసవించిన మొదటి అండంనుంచి సూర్యోదయ కాలంలో ముజ్జగాలు నిశే్చష్టమై నిలవగా గుడ్లగూబ పక్షి పుట్టింది. ఆ ఉలూక పక్షి పద్దెనిమిది ద్వీపాలకు, అఖిల పక్షి జాతికిన్ని రాజపట్టాన్ని నొసట ఆహ్లాదంతో వహించింది.
పక్షిజాతులన్నింటికి తొలుత పుట్టిన కారణంగా పక్షులు సమస్తమూ మొదట రాజుగా సమ్మతించాయి. కాని క్రమక్రమంగా ఆ గూబ పిట్ట దుర్లక్షణాలు చూసి రాచరికం చెయ్యడానికి అర్హమైనది కాదని పరిహసించాయి.
సారె సారెకి చెక్కిళ్ల పైభాగాన్ని పైకి కదలించడంవల్ల అవమానిస్తూ వున్నట్లు వుంటుంది. శ్రవణాలకి కఠోరంగా ఘూత్కారం చేస్తే ఎదుటి వ్యక్తుల్ని జంకిస్తున్నట్లు వుంటుంది. పెద్దవి, గుండ్రనివి అయిన నేత్రగోళాలు తిరుగబడితే బెదరిస్తున్నట్లు వుంటుంది. పగలు నాల్గు జాములున్ను ఎదుటివాళ్లని, తన్ను పరీక్షించి చూసే జ్ఞానం లేకుండడంవల్ల గర్విస్తున్నట్లు వుంటుంది.
మంచి జన్మ ఎత్తుటకు కావలసిన పుణ్యం లోపించిన చెడు పక్షి గూబ ఎక్కడ? కలహంసలు, చక్రవాకాలు, చిలుకలు, నెమళ్లు మొదలైన బహువిధాలైన పక్షి సమూహానికి అర్హమైన రాజ్యభారం ఎక్కడ? ఇది అసంబద్ధం’’ అంటూ కులం పెద్దలు పరాభవించాయి.
గద్దెదిగి కూర్మి బిడ్డ కొండలు పట్టగా అమాయకురాలైన దక్షుడి కూతురు వినత మూర్ఖతతో రెండవ కొడుకునయినా చూద్దాము అనే కుతూహలంతో తాల్మి కోల్పోయి గోటి కొనతో రెండవ గ్రుడ్డుని- (శరీరంలో సగం భాగం నిండని లోపలి భాగం కల గుడ్డుని) బ్రద్దలు చేసింది. ఆ గ్రుడ్డు సంచి అపర శరీరార్థ్భాగ రహితుడున్ను పూర్వ శరీరార్థ సహితుడున్ను అయిన కుమారుడు ‘అనూరుడు’ ఉద్భవించాడు. తనకావిధంగా అపకారం కావించిన తల్లిని కోపపడి నీ సవతికి దాసివి కావలసింది అని శపించాడు.
ఏలరా! నా తండ్రీ! తెలియక చేసిన ఈ ఒక్క అపరాధాన్ని క్షమింపలేకపోయావు? ఈ శాపానికి ఎన్నాళ్లకి మోక్షం కల్గుతుంది? నా ఆత్మ కలతపడుతోంది- చెప్పరా నా తండ్రీ!’’ అని తల్లి వినత ఆక్రోశించింది. అపుడు ఆ పిచ్చుకుంటు (అంగవిలుడైనవాడు) తల్లితో ఈ సరణి పలికాడు. అయిదు వందల సంవత్సరాలు గడిచిపోయాక మూడవది అయిన ఈ గ్రుడ్డునించి ఉదయించిన నందనుడునీ వరవుడం (దాసీతనాన్ని) మాన్పుతాడు- ఏమరుపాటు చెందకుండా ఈ గ్రుడ్డుని కాపాడుకో- నువ్వు నియతి, నీతి తప్పకు’’ అని బుద్ధి చెప్పి ఆ అరుణుడు తన తల్లి అనుమతిగైకొని తారక బ్రహ్మ విద్యా నిదానం అయిన కాశీ క్షేత్రానికి అరిగాడు.
ఆ అనూరుడి శాపం కారణంగా- ఒకనాడు కద్రూ వినతలు సముద్ర తీరాన వినోదార్థం విహరించసాగారు. ఆ సముద్ర తీర సమీపంలో ఇంద్రుడి అశ్వం ఉచ్చైశ్శ్రవం మేత మేస్తోంది. ఆ అశ్వాన్ని కనుకొని వినత ‘‘ఓహో ఈ అశ్వోత్తమం ఇంత సుందరమైనదా? మహాపురుషుడి కీర్తి ప్రవాహం వడువున కార్తీక చంద్ర చంద్రికా (శరత్కాల చంద్రిక) ధవళమై వుంది’’ అని పలికింది.
వినత వాక్కులు ఆలించి కద్రువ ‘‘ఏ కన్నులతో చూశావు? ఈ తురంగం వాలంలో చంద్రబింబంలోని కందు (మచ్చ) లాగు కొన్ని వెండ్రుకలు నల్లనివై వున్నాయి’’ అని బదులు పలికింది. ఔననీ, కాదనీ కొంత తడవు ఇరువురూ వాద వివాదాలు చేసి దాస్యం పందెంగా పందెం వేశారు. ఆ రోజుకి ప్రొద్దు చాలక తమ తమ నెలవులకి వెడలిపోయారు. మరునాడు కద్రువ ప్రాతఃకాలంలో కొడుకుల్ని ఆజ్ఞాపించింది.

- ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి