మంచి మాట

తప్పు - శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం శే్వతకి అనే రాజర్షి ఉండేవాడు. ఆయన జనకుడిలాగా రాజ్యపాలన చేస్తూనే ఋషి ధర్మాలను అనుసరించేవాడు. ఆయన ఒకసారి వేల సంఖ్యలో యజ్ఞయాగాదులు చేశాడు. ఆ యాగాలలో సమర్పింపబడిన నెయ్యిని స్వీకరించిన అగ్నిదేవుడికి అజీర్తి వ్యాధి పట్టుకున్నది. ఎవరిని అడిగినా ఖాండవ వనంలో ఔషధ మూలికలను సేవిస్తేనే ఇది నయమవుతుందని చెప్పారు. సేవించడం అంటే భస్మం చెయ్యడమే. తన యజమాని ఇంద్రునిది ఆ ఖాండవం. ఎలా అని దిక్కుతోచని సమయంలో అటువేపుగా వస్తున్న నారదుణ్ణి చూచి తన బాధ ఏకరువు పెట్టి ఉన్న విషయం చెప్పి తరుణోపాయం సూచించమని కోరాడు. అందుకు నారదుడు ‘నీవు మనిషి రూపంలో పాండవ మధ్యముడైన అర్జురుని వద్దకు వెళ్లి విషయం చెప్పకుండా శరణు కోరుకో. సరే అన్న తర్వాత ఆయన ఆరు నూరైనా నీ ఇబ్బంది తీర్చగలడు’ అని చిన్న చిట్కా కూడా చెప్పి పంపాడు. అర్జునుడు వ్యాహాళికి వెళ్లి ఒక చోట విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో అగ్ని బ్రాహ్మణ రూపంలో వచ్చి శరణుకోరాడు. సరేనన్నాక అగ్ని తన నిజ గాధని వివరించి కావలసిన సాయం అర్థించాడు. అక్కడే వున్న కృష్ణుడు ‘ఇంద్రునితో వైరమేమో’ అని సందేహించాడు. కాని ఈపాటికే శరణు ఇవ్వడం అయిపోయింది కనుక ఏమీ వెనక్క తగ్గడం కుదరదు. అగ్నిదేవుడు తన పనికి ఉక్రమించాడు. ఖాండవ వన దహనం ఆరంభమైంది. కుపితుడైన దేవేంద్రుడు తన అధీనంలోని పుష్కలావర్తకాది మేఘాలను ఆజ్ఞాపించగానే కుంభవృష్టి ప్రారంభమయింది. మంటలు చప్పున చల్లారాయి. అప్పుడు అర్జునుడు గాలి చొరలేని విధంగా బాణాలతో పైకప్పు నిర్మించాడు. ఖాండవం దగ్ధం కావడంతో అగ్నిరోగం మాయమైంది.
కాని ఈ సందర్భంగా అడవిలోని జింకలు మొదలైన జంతువులు, పాములు మొదలైన సరీసృపాలు మంటల్లో ప్రాణాలు కోల్పోయాయి. ఒక పాము మాత్రం తప్పించుకొని ఆకాశ మార్గం గుండా వెళ్లిపోయింది. పాము తండ్రితో ‘‘నాన్నా! నేను ఒక బాణం రూపంలో ఉంటాను’’ నీవు బ్రాహ్మణుడుగా కర్ణుని వద్దకు వెళ్లి ఈ అస్త్రాన్ని ఇచ్చి ప్రాణాపాయ సమయంలో ఒక్కసారిమాత్రం ఉపయోగించు. శత్రువును నిర్జిస్తుంది అని చెప్పమన్నాడు. సరేనన్నాడు. ఆ బాణ రూపం ధరించిన సర్పమే అశ్వసేనుడు. కర్ణుడు దానిని భద్రపరచుకొన్నాడు. ముందు ముందు యుద్దం వచ్చినపుడు అవసరమైతే అర్జునుని మీద ప్రయోగించాలని కర్ణుని సంకల్పం.
కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం అయింది. భీష్ముని పతనం జరగడంతో, తన ప్రతిజ్ఞ నెరవేరిందని కర్ణుడు తిరిగి రణరంగంలో ప్రవేశించాడు. కర్ణార్జునుల మధ్య యుద్ధం అతి భీకరంగా సాగుతున్నది. కర్ణునికి ఈ అస్త్రం విషయం గుర్తుకొచ్చింది. సరే, ఆ బాణాన్ని అర్జునునిపై ప్రయోగించాడు. దిక్కులు పిక్కటిల్లే కాంతులతో ఆ అస్త్రం దూసుకొని వస్తున్నది. ఇక్కడ శల్యుడు, అక్కడ కృష్ణుడు గమనించారు. ఇది ప్రమాదకరమైనదని తెలిసి శల్యుడు కర్ణుడితో గురి కొంచెం పైకి వెళ్లాలి అన్నాడు. సారధి మాటలకు కర్ణుడు కొంచెం గురిపైకి పెట్టాడు. శ్రీకృష్ణుడు అదే సందర్భంలో తన రథాన్ని కొంచెం క్రిందికి అణగద్రొక్కాడు. వేగంగా వస్తున్న ఆ సర్పముఖాస్త్రం గురి అర్జునుని కంఠానికి బదులు కొంచెం పైకి వెళ్లడంతో ఆయన కిరీటం క్రిందపడిపోయింది. ప్రాణాపాయం తప్పింది. ఈసారి ప్రయోగిస్తే తప్పక చంపుతానని మానవ భాషలో చెప్పగానే ‘నేను ఒక బాణాన్ని రెండోసారి ప్రయోగించను’ అని కరాఖండీగా కర్ణుడు చెప్పేశాడు. ఈ సంఘటన తర్వాత అర్జునుడు కృష్ణునితో ‘‘ఈ నా కిరీటం ఇంద్రదత్తమైనది. దివ్య ప్రభావం కలది. ఎప్పుడూ జరగని విధంగా ఈ మకుట పతనం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. అందుకు కృష్ణుడు ‘‘అర్జునా! నీవు ఖాండవ దహనం చేసినపుడు ఏ పాపమెరుగని అల్పప్రాణులు ఎన్నో చనిపోయాయి. అవి నీకు ఏ కీడు చెయ్యలేదు వాటిని నిష్కారణంగా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సంహరించావు కదా! ఆ పాప ఫలితమే ఈనాటి ఈ పరాభవ సంఘటన’’ అన్నచో అర్జునుడు ఏమీ మాటలాడలేకపోయాడు.

- కాకుటూరి సుబ్రహ్మణ్యం