భక్తి కథలు

కాశీఖండం 134

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లా హరిశ్చంద్రేశ్వరుడు అనే గణనాథుడిని పూజించినవారికి మణికర్ణిక కామధేనువై అభిమతాలు నెరవేరుస్తుంది.
మణికర్ణికా తీర్థాంతరంలో గాయత్రీ మంత్రాన్ని ఒక మాటు ఉచ్చరిస్తే లెక్కకి పదివేల మారులుగా గాయత్రిని జపించిన ఫలం లభిస్తుంది. ఒకవైపు గంగా కేశవుల్ని మరొక వంక హరిశ్చంద్ర మంటపాన్ని మణికర్ణికా తీర్థానికి సరిహద్దులుగా తెలుసుకో. మణికర్ణికలో యోగ్యమైన ఒక్క ఆహుతిచేసినంత మాత్రం చేత - అంటే హోమం చేసినంత మాత్రం చేత- యావజ్జీవం అగ్నిహోత్ర విధి ఆచరించిన ఫలం కలుగుతుంది. మణికర్ణిక సమీపంలో నేయి నువ్వుల హోమవిధివల్ల మానవుడికి అపరిమితమైన అక్షయమై ఫలం ఘటిల్లుతుంది. మణికర్ణిక చక్రపుష్కరిణి అనే నామంతో ప్రశస్తి వహించింది. చక్రం చట్రం తిరిగి సంసారానికి మణికర్ణిక విడుమర. కాశీపతి అయిన పరమశివుణ్ణి సేవించాలనే తలపు ఉదయించినప్పుడు ద్రవరూపాన్ని పరిత్యజించి, వనితా రూపాన్ని తాలుస్తుంది మణికర్ణిక. ఆ సమయంలో ఆమె రూపం నయనానందకరమై, హావ భావాభిరామమై వుంటుంది. నాలుగు భుజాలు, వెడద కన్నులు, కన్నుగలఫాలం, బాలచంద్ర కళామధ్యంలో తెల్లని విభూతి ధరిస్తుంది మణికర్ణిక.
చరణ కటకాలు, కంఠహారాలు, కరకంకణాలు, కేయూరాలు, మేఖల (మొలనూలు) ఆదిగాగల ఆభరణాల చేత అలంకృత అయి, వక్ర కుంతలాల పయిన చిన్ని పువ్వు అనే నగ తాల్చుతుంది మణికర్ణిక. పెక్కు కల్పాంతాలు గడచిపోయినా పనె్నండేళ్ళ చిన్నప్రాయంతో వీడియు వీడని సిగ్గుల భరణి అయిన మనస్సంపుటాన్ని వహిస్తుంది. ఒక చేత నల్ల కలువల మాల, ఇంకొక చేత మాదీఫలాన్ని ధరిస్తుంది. తక్కిన రెండు చేతులతో అంజలి బంధం పట్టుతుంది. పద్మంలో వలె అభిరామానన బింబంలో అలరారుతుంది. పద్మరాగ మణులని పరిహసించే పలువరుసలు కలది. ఆమె పశ్చిమ ముఖమయి భ్రూమధ్యభాగంలో నిశ్చల దృష్టి నిలువ, చంద్రకళాధరుని హృదయంలో వీక్షిస్తుంది. కనె్నగేదెగి రేకు కబరీభరంలో చెరివికొని వుంటుంది. మొలక చనుదోయిపైన సన్నని రైక తొడిగికొని వుంటుంది. మణికర్ణిక చింతామణి. మణికర్ణిక కామధేనువు. మణికర్ణిక కల్పతరువాటిక. మణికర్ణిక అమృతరసస్యందం. భక్తికోటికి మణికర్ణిక అణిమాది అష్టమహాసిద్ధికారణం. అగ్నిబిందువౌనీ! మణికర్ణికని సేవించు. పుణ్యాత్ముడివి అవుతావు.
మణికర్ణికా తీర్థానికి దక్షిణ దిక్కున పాశుపాత తీర్థం వుంది. ఆ తీర్థంలో పశుపతీశ్వరుడు లింగరూపధారియై సంసార బంధం నుంచి మోక్షం కలిగిస్తాడు. పాశుపత తీర్థానికి ముందు భాగంలో - తూర్పు వైపు- రుద్రావాస తీర్థం. ఆ తీర్థానికి రుద్రేశ్వరుడు అధిదేవత. రుద్రావాసతీర్థానికి దక్షిణ దిక్కున విశ్వతీర్థం. అందు తారకేశ్వరుడు ‘విశ్వ’ అనే గౌరీదేవితో కూడి లోక పూజనీయుడై వుంటాడు.
విశ్వతీర్థానికి మోక్షతీర్థం చేరి వుంది. మోక్షేశ్వరుడికి సమీపంలో అవిముక్తేశ్వరం. దానికి చేరువను తారక తీర్థంవుంది. అక్కడ సంసార తారకుడైన తారకేశ్వరుడు కలడు. తారక తీర్థానికి సమీపంలో స్కంద తీర్థంబు. స్కందతీర్థానికి అవ్వల డుంఠి తీర్థం. డుంఠి తీర్థానికి చెంత భవానీ శంకర తీర్థం వుంది.
మణికర్ణికా తీర్థ మధ్య వీధినుంచి సాగిపోయి, శ్రీపాశుపత తీర్థ సరిహద్దు గడిచి, శ్రీరుద్ర తీర్థ పశ్చిమ భాగం నుంచి ఏగి, విశ్వతీర్థం వెంట కదలి, మోక్షేశ్వరస్థానం అగ్రభాగం త్రోవను దాటి తారకబ్రహ్మతీర్థం వెడలి, కుమారస్వామి క్షేత్రాన్ని అతిక్రమించి, డుంఠివిఘ్నేశ్వరుడి తీర్థునికట ప్రాంతం ఒరసికొని ‘్భవతి! భిక్షాందేహి?’ అనే మాటని ఉచ్చరించి బ్రహ్మచారి భిక్షపాత్ర చాచితే చాలు ఆ కాశీపురంలో ఆకొన్న వారికి గౌరి అమృతాన్నభిక్షను కరకంణాలు గల్లుగల్లురనగా ఇడుతుంది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి