భక్తి కథలు

కాశీఖండం 143

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు అత్యధిక భక్తితో సిద్ధలక్ష్మియైన అమరేశ్వరీదేవిని అర్చిస్తే సుదీర్ఘాయువునీ దానం ఒసగడానికీ, తాను అనుభవించడానికీ అనంత సంపదలతో అభివృద్ధి పొందుతాడు.
త్రిలోక సుందరి అనే శివుడి శక్తి అవిముక్త కానన క్షేత్రానికి కస్తూరికా తమాలపత్రం అనే అలంకారం. శ్రీకంఠుడి నికటాన వున్న మహాలక్ష్మి తన్ను కొలిచేవారికి భోగ మోక్షలక్ష్ములని ఒసగే కొంగు బంగారం. ‘లక్ష్మీపీఠం’ అనే మహాస్థలం సాధకులకి అభీష్ఠప్రదం. కమల పీఠానికి ఉత్తర దిశని హయకంఠి అనే దేవి మిక్కిలి కఠినం అయిన కుర్రార ధార చేత విఘ్నాలు అనే తరు సమూహాన్ని తెగనరుకుతుంది. ఇక పాశపాణికి దక్షిణ దిక్కున వున్న కౌర్మి అనే శక్తి దేవత త్రివిధ కర్మలని ఖండిస్తుంది. వాయవ్య భాగంలో ‘శిఖిచండి’ అనే శక్తి ఆడు నెమలి రూపాన్ని తాల్చి జాము జాముకి కేకారావాలు ఒనరిస్తుంది. మరి భీమచండి అనే మరొక శక్తి ఉత్తర ద్వారాన్ని కాపాడుతూ వుంటుంది.
కాశీ పట్టణంలో భీమేశ్వర దేవర కట్టెదురుగా పాశాన్ని, పద్మాని హస్తాల ధరించి భద్రకాళి నెలకొని వుంది. భీమకుండ తీర్థానికి పార్శ్వభూభాగంలో భీమ చండీ మహాదేవి ఎల్లవేళల పాయక నివసిస్తుంది.
చివురాకుల్ని సుకరంగా మేసే మేకలాగు భాగ వక్త్రేశ్వరి అనే శివశక్తి వృషభ వాహనుడైన శంభుడి దక్షిణ దిక్కున వుండి, తన్ను భజించు భక్తుల విఘ్నాలను సమూలంగా నాశనం చేస్తుంది. అవిముక్త స్థానం అయిన కాశి పొలిమేరలో తాడి చెట్టంత ఎత్తు వున్న తాళ జంఘేశ్వరీదేవి అనే శక్తి దేవత వామహస్తంలో తాటిచెట్టు కండాన్ని ధరించి వెదకి వెదకి విఘ్నాలని పేరు పేరున పిలిచి కొట్టి చంపివేస్తుంది. ‘వికటానన’ అనే శక్తి దేవత కిరీటం, కేయూరాలు, కనక హారాలు నగలుగా కల్గి కళంకరహితం అయిన ఇందుకళాఖండం ఔదల వెలుగులు వెదజల్లుతూ వుండగా విడువక కాశిలో వాసం వుంటుంది. ఉద్దండమైన దండాన్ని ఎత్తిన యముడి మదాన్ని అణివేసే తన బాహుదండంలోని ఖట్వాంగ్వాయుధం చేత దాల్చిన ఉద్దాలకుడు అనే ఆహ్వయం కల చంద్రకళా కిరీటుడు ఉద్దాలక తీర్థంలో సముల్లాసంతో వసిస్తూ వుంటాడు. ఆ ఉద్దాలక తీర్థానికి తూర్పు దిశకి ఆభరణంగా విలసిల్లుతూ యమదంష్ట్ర నామకదేవి నివసిస్తూ ఉంటుంది. ఆ మహాశక్తి సుందర దరస్మితం తోడి మెల్లని చూపుతో మృడుని మరులుగొల్పుతుంది. దారుకేశ్వర తీర్థంలో నిర్మల తేజస్వి అయిన దారుకేశ్వర దేవుణ్ణి చంద్రకళావంతసుణ్ణి- తారక బ్రహ్మ విద్యానిధిని, పరమ శివుణ్ణి అర్చించు నరుడు ధన్యులలో ధన్యుడు. వింధ్య పర్వత గర్వం అణచిన అగస్త్య మునీంద్రా ఆ దారుకేశ్వర తీర్థాన్ని పాలించే దారుకేశ్వరుడి పాద భూమిని సప్త పాతాళ లోకాలకి గడమ్రాకుల్ని పోలిన రెండు తాలువుల చేత భీతిగొల్పేదిన్ని, సర్పరాజు నాలుకను పోలి కదలాడు నాలుక కలదియున్ను నింగి వంటి పైపెదవీ, నేల వంటి క్రింది పెదవీ, నక్షత్ర గణాల వంటి పలు వరుసయున్ను, మెరపు కోలల వంటి నాలుగు దంష్టల్రుగలదిన్ని అయిన నోరు తెరిచి, బ్రహ్మాండగోళాన్ని ముద్దగా చేసి, కబళించుకోవడం కోసరం చెయ్యి చాచి కాళరాత్రి నామకశుష్కోదరీ దేవి కాశీనగరాన్ని విడనాడక వుంటుంది. ఆ శుష్కోదర దేవి చర్మముండాదేవికి చెలిమికత్తె! పిక్కలదాకా పులితోలు హొంబట్టు పుట్టం కట్టి వల చేత త్రిశూలాన్ని కీలుకొల్పి, ఫాల ఫల కాన విభూతి పుండ్రం తీర్చి, స్నిగ్థమైన నాగయజ్ఞోపవీతాన్ని తాల్చి వక్షస్థలాన ఎమ్ముల పేరు ధరించి, శరీర వల్లికి రక్తచందనం పూసుకొని, సుందరమూ సువిశాలాలు అయిన కన్నుల కరిగండ స్థలాన పేరిన మదజల ధారతో కాటుక తీర్చుకొని మద్యపానమత్త అయి- ప్రఖ్యాతి గాంచింది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి