మంచి మాట

ప్రగతి సోపానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయం కలిగితే పొంగిపోవడం, అపజయం కలిగితే బాధతో కుంగిపోవడం సాధారణ మానవులకు సహజం. కొందరు ‘నా జాతకం బాగా లేదు. ఏది చేసినా కలసిరావడం లేదు’ అంటూ కనిపించని విధిమీద తోసేసి వాపోతుంటారు.
అనాయాసంగా డబ్బు గడించాలనుకొనేవారికి విధి పైన వాపోయే ఇలాంటివారివల్లనే లాభం. అభిమానంతో కాకుండా, వారిలో భయాన్ని, తప్పుచేశామనే భావనను సృష్టించి, మీ గెలుపు ఓటములను నిర్ణయించేది మీ తలరాత అని వారికి నమ్మబలుకుతుంటారు.
గెలుపు ఓటములు జాతకాలను అనుసరించి ఉంటాయని గుడ్డిగా నమ్మడం మూర్ఖత్వం. అసలు ఓటమి ముఖ్యకారణం మీరు సరియైన ప్రయత్నం చేయకపోవడమేనని పెద్దల జీవిత చరిత్రలు చదివితే మనకు స్పష్టవౌతుంది.
మనం సరైన పనులు చేసినా, మనకు చెందవలసినవి చెందకుండా ఉంటే అవి మనకు దక్కకపోయనావాటివలన ఇతరులకు మేలు జరిగితే మనం సంతోషించే నేర్పును అలవర్చుకుంటే అపుడు కలిగే ఆనందానికి లెక్కకట్టలేము. ఎన్నివేలు లక్షల ఇచ్చినా కొనుక్కోలేని ఆనందము అనుభవించామన్న తృప్తి కలుగుతుంది మనకు.
కోరుకున్నది దొరకలేదంటే అందుకు పూర్తిగా మనమే బాధ్యులమని తెలుసుకుంటే మరలా అటువంటి తప్పు జరగకుండా ఉంటాం. దానివల్ల మనకు రాబోయే రోజుల్లో విజయం తప్పక లభిస్తుంది. ఈసారి జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాల వలన కోరినవాటికి తగినట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం మొదలై కావల్సిన ఫలితాన్ని మనం పొందుతాం.
మన జీవితం యొక్క ప్రతి నిముషాన్నీ, ఆఖరికి మరణ సమయాన్ని కూడా నూరుశాతం నిర్ణయించేది మనమే. మనకు జరిగే ప్రతిదీ మనం చేసుకున్నదే. సమస్య ఏమిటంటే మనమే వాటికి కారణం అవుతున్నామని గ్రహించలేకపోతున్నాము. అజాగ్రత్తగా మనం వేసిన విత్తనాలే విషపు మొక్కల్లా మన చుట్టూ వ్యాపిస్తున్నాయి. వాటిని దేవుడు తీసుకువచ్చి మన తోటలో నాటినట్లు భావిస్తూ బాధపడటంలో అర్థం లేదు.
కొండలమీద కురిసే వర్షం మొదట జలపాతమై, తర్వాత చిన్న చిన్న నదులుగా మారి, పల్లాన్ని వెతుక్కుంటూ వెళ్లి, చివరకు సముద్రంలో కలిసిపోతుంది. పుట్టిన నిమిషం నుంచే నది సముద్రాన్ని చేరడానికి తహతహలాడుతూ ప్రయాణం చేస్తుందని అనుకుంటామా? దారిలో ఆనకట్ట కట్టి నిరోధిస్తే సముద్రంలో చేరలేకపోయానే అని బాధపడుతుందా? అంతా వాస్తవ పరిస్థితులను బట్టే జరుగుతుందని గ్రహించాలి. దేనినైనా నిర్వహించగల సామర్థ్యం సాధిస్తే,ఫలితాలు మనకు అనుకూలంగా మారవచ్చు. జాతకాన్ని గురించిన అపోహలను వదిలించుకుని, మన సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగటమే గెలుపుకు రహదారి అవుతుంది.
ఎవరికైనా పరిస్థితులు అన్ని సమయాలలో కోరుకున్న విధంగా ఉండవు. మార్చడానికి వీలులేని పరిస్థితిని ఎదిరిస్తే శాంతి లేకుండా పోతుంది. దాని బదులు ఉన్నదున్నట్లు అంగీకరిస్తే, విజ్ఞతతో తర్వాత ఏమి చేయాలన్న విషయాన్ని ఆలోచించడానికి వీలవుతుంది. ఆత్మ శక్తికి తోడు కావలసింది కచ్చితంగా దైవశక్తి. ఊరికే రమ్మంటే రాదు. అది మనలోనే ఉండి నడిపిస్తున్నదన్న నమ్మకమే జయ సంకేతం. నమ్మకం మరియు మన శక్తి రెండు శక్తులతో పనిచేస్తే విజయం లభించి తీరాల్సిందే.
అందుకే నీటిలోనే ఉన్న దైవశక్తిని ధ్యానించి, నీ స్వశక్తితో తగిన కృషి చేస్తే తప్పక గెలుపు తీరాలను తాకవచ్చు. జయాపజయాలు మనలోనే ఉన్నాయన్న నిజాన్ని తెలుసుకుని ప్రయత్నించడమే ప్రగతికి సోపానం.
...................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-పి.వి.రమణరావు