భక్తి కథలు

కాశీఖండం 167

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నైమిశారణ్యంలో ఎనభై ఎనిమిది వేలమంది మహర్షులు పరమ శివుణ్ణి కొలుస్తూ వుండగా వేదవ్యాసుడు తాను, శిష్యులున్ను ఏతెంచి, ప్రాతఃకాలంలో రాజీవాక్షుడైన విష్ణుమూర్తిని కీర్తించాడు. లక్ష్మీశ్వరుడైన విష్ణువే దైవం. జనార్దనుడే మోక్ష ప్రదాత. విష్ణ్ధుర్మమే ధర్మం.
శేషశయనుడే దైవం అనడం సత్యం. చక్రధరుడే దైవం అనడం నిక్కం. వైకుంఠ వాసియే దైవం. సాత్వత వంశ సంభవుడే దేవుడు. కైటభ వైరియే దేవుడు. శారధరుడే దేవుడనడం సత్యం. లక్ష్మీ సహితుడే దేవుడు. నీలమేఘశ్యాముడే దేవుడు. మాధవుడే దైవం. మదన జనకుడే దైవం. తామరస దళాలవలె విశాల నేత్రాలు కల విష్ణువే తప్ప మరొక దైవం వున్నాడా? ఊరక మాటలు ఎందుకు? అని ఈ ప్రకారంగా వారణాశిలో పంచనద తీర్థంలోని పావనోదకాల్లో స్నానం ఆచరించి, ఆదికేశదేవుణ్ణి పాంచరాత్ర వైష్ణవాగమ విధిని అర్చించి విశే్వశ్వర శ్రీమన్మహాదేవర భవన ద్వారంలో నిలిచాడు. ఆ విధంగా నిలిచి కుడి చెయ్యి పైకెత్తి సమస్తమైన వేదాల, పురాణాల, ఇతిహాసాల సిద్ధాంత వాక్యాల వల్ల నిశ్చితం అయిన అర్థమే సత్యం. పునః సత్యం. వేద శాస్త్రాలకన్నా పరమమైన జ్ఞానమున్ను, విష్ణువుకన్నా పరమం అయిన దైవమున్ను లేదు’’ అని పలికాడు.
ఎలా ఎలా? ఏలాగేలాగు? ముందు వినమైతివి. ఇంకొక మారు సుస్పష్టంగా చెప్పు. భట్టారా! (పండితుడు), అని నందికేశ్వరుడు విస్పష్టంగా పలికాడు. వెనె్వంటనే వ్యాసుడికి కంఠనాళం పట్టివేసింది. ఎత్తిన చెయ్యి దించుకోవడం సాధ్యం కాలేదు. ఆ వారణాసి అంగడి వీధిలో వ్యాస శిష్యులు భయపడిపోయి ఉద్విగ్నులు అయారు.
బాహువులు, వాక్కు స్తంభించిపోవడంవల్ల భీతి పొందినవాడు అవుతూ ఆపద చేత ముట్టడింపబడి తన మనమున గజేంద్ర రక్షకుణ్ణి ధ్యానించాడు. ఆ క్షణంలోనే గరుడ ధ్వజుడు అయిన విష్ణుమూర్తి వ్యాసుడి దగ్గరికి ఏగుదెంచాడు. ఏతెంచి ‘‘వ్యాస మహర్షీ! బుద్ధిమంతుడివి. అపరాధం ఏవిధంగా చేశావు? అని కోపించాడు. పిమ్మట ‘‘నందికేశ్వరా! నాకు ప్రియం కలిగే రీతిని ఈ వ్యాసుడి అపరాధాన్ని మన్నించు. ఇతడిని క్షమించు. కరుణార్ద్ర దృష్టి ప్రసరించు’’ అని వేడుకొన్నాడు.
అప్పుడు వ్యాస మహర్షికి వాక్స్తంభనం, భుజాస్తంభనం తొలగిపోయాయి. వ్యాస మహర్షి కూడా బహు విధాల బహు ముఖాల పరమేశ్వరుణ్ణి ప్రస్తుతించాడు. తన పేర వ్యాసేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. వ్యాసేశ్వరుడు తన్ను సేవించువారికి భోగం, మోక్షం అనుగ్రహిస్తాడు’’ అని చెప్పగా అగస్త్య మహర్షి కుమారస్వామికి అభివాదం ఒనర్చి, చనువుతో ఏర్పడిన చొరవతో ఈ క్రియ పలికాడు.
శిలాది ముని తనయుడు నందికేశ్వరుడు మాటని, చేతిని స్తంభింపచెయ్యడంవల్ల అజ్ఞానం తొలగినవాడే అయితే, గంగాతట సమీప స్థలంలో శివలింగ ప్రతిష్ఠ చేసినవాడే అయితే,. పవిత్రం అయిన పంచక్రోశ తీర్థ మహిమను సమగ్రంగా ఎరింగినవాడు కావడం నిక్కం అయితే, ముక్తి మంటపంలో ఆసీనుడై శైవ పురాణాల్ని పఠించడమే నిజం అయితే, కోప తాపాల తపస్సుకి బాధకాలు అని తెలిసి కూడా సుంతయినా సహనం వహించక పుణ్యరాశి అయిన కాశీ పురాన్ని వ్యాస మహర్షి ఏకారణంవల్ల శపించాడో సెలవిప్పించవలసింది అని అర్థించాడు.
అంత కార్తికేయుడు ఊర్వశీనందనా! అగస్త్య మునిచంద్రా! అడుగవలసిన విషయానే్న అడిగావు. వ్యాసుడు వాక్కు, భుజాల స్తంభనం కలిగిన రోజు మొదలుకొని బుద్ధి కలిగియే వర్తింపసాగాడు. కాశీనగరం మీద కోపించి వ్యాస మహర్షి శపించడానికి కారణాన్ని తర్వాత వివరిస్తాను. కాశీ మహాత్మ్య వర్ణనలోని అవశేష విషయాన్ని ఆలకించు-

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి