డైలీ సీరియల్

బడబాగ్ని 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది నిరూపించుకోగలరా.. హత్య జరిగిన ఆ రోజు.. ఆ రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి.. దానికి కోర్టువారు అంగీకరించే సరైన ఋజువులు కావాలి.. చెప్పండి...
‘‘హత్య జరిగిన ఆ రోజు నేను ఢిల్లీ యూనివర్సిటీలో లా కాలేజ్ వాళ్ళు నిర్వహించిన ‘‘నేరస్తుల మనస్తత్వాలు, నేర ప్రవృత్తి, నేరాలకు ప్రేరేపించే సంఘటనలూ’’ మొదలైన వాటిమీద సెమినార్ కండక్ట్ చెయ్యడానికి వెళ్ళేను.. దానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు జడ్జి దేశ్‌పాండగారు వచ్చారు. ఆ రాత్రి తొమ్మిది గంటలవరకూ సెమినార్ జరిగింది.. తరువాత విందు జరిగింది.. అది పూర్తయి నేను మర్నాడు ఉదయం ఫ్లైట్‌కి డెహ్రాడూన్ వచ్చాను.. మీరు విచారణ జరుపుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో ఆ కాలేజ్‌వారి దగ్గర ఉంటుంది.. కావాలంటే ఎంక్వయిరీ చేసుకోవచ్చు..’’ చెప్పాడు రాహుల్.
గంట వ్యవధిలో అతను చెప్పింది నిజం అని ధ్రువీకరించుకుని, కేసు తప్పుతోవ పట్టేలా ప్రవర్తించి కోర్టువారి అమూల్యమైన సమయం వృధా చేసినందుకు అతనిని మందలించి వదిలేశారు.. దానితోబాటు ఈ హత్య జరగడానికి మూలమైన కారణం.. దీనికి ముందు జరిగిన మిస్టీరియస్ హత్యలతో వున్న సంబంధం, అవి నిరూపించే సాక్ష్యాధారాలు కోర్టువారికి అందజేయవలసిందిగానూ, ఈ కేసు పరిష్కరించడంలో న్యాయస్థానానికి, పోలీస్‌వారికి తన సహకారం అందించవలసిందిగానూ అతనిని ఆదేశించారు.
అజిత్‌ని నిర్దోషిగా భావించి వదిలేశారు.
రాహుల్ కోర్టు బయటకు రాగానే అనే్వష్ అతనిని కలిసి అతనిని అనుమానించినందుకు క్షమాపణలు అడుగుతూ.. అసలు అడుగడుగునా అనుమానపడే విధంగా ఎందుకు ప్రవర్తించావు? అన్న ప్రశ్నకి సమాధానంగా.
‘‘నువ్వు నా మీద అనుమానంతో జరుపుతున్న ఇనె్వస్టిగేషన్ ఎలా ఉంటుందో చూద్దామని..’’ నవ్వుతూ అన్నాడు రాహుల్.
‘‘నిజంగా నామీద మీకు కోపం లేదా..? అనుమానంగా అన్నాడు అనే్వష్.
‘‘ఉహూ.. లేదు.. పైగా ముచ్చటగా ఉంది.. నన్ను నీ అసిస్టెంట్‌గా వేసుకోకూడదూ.. కొంచెం ఏదైనా పనికి వస్తావేమో..’’ తమాషాగా నవ్వుతూ అన్నాడు.
‘‘నేనే మీ శిష్యరికం చేస్తా కానీ మనం అర్జెంట్‌గా కొన్ని విషయాలు డిస్కస్ చెయ్యాలి మా రూంకి వస్తారా రాత్రికి..’’
‘‘మీ రూం వద్దు.. సేప్ కాదు.. ప్రస్తుతం వరకూ వాళ్ల హిట్ లిస్టులో నేను లేను.. అఫ్‌కోర్స్ ఈ వేళ నుండి ఉంటా అనుకో.. ఈ వేళ రాత్రి నా రూంకి వచ్చేయ్.. కమల్‌ని కూడా తీసుకురా.. అన్నట్లు జాగ్రత్తగా రండి.. ఎవరూ మిమ్మల్ని ఫాలో అవకుండా చూసుకోండి.. మీ మీద ఎవరూ ఎటాక్ చెయ్యకుండా చూసుకోండి.. ఓకేనా.. అదిగో అజిత్, అమ్మావాళ్లు వస్తున్నారు. ఇవేం మాట్లాడద్దు’’ హెచ్చరించగా అన్నాడు.
‘‘ఓకే’’
‘‘లేచిన వేళ ఎంత మంచిది.. ఇద్దరూ పెద్ద గండం నంచి బయటపడ్డారు. వెధవ ఉద్యోగాలు. వదిలేసి చక్కగా మనూరు వెళ్లిపోదాం.. కలో గంజో తాగి బతకచ్చు.. అయినా ఎంచక్కా కలెక్టర్ గిరీ చెయ్యరా అంటే వద్దు వద్దు అని పోలీస్ ఉద్యోగం ఎంచుకున్నావ్. ఇంకా చేరకముందే యిలా అయింది.. ఒరే పెద్దాడా.. హాయిగా ఆ లెక్చరర్ ఉద్యోగం చేసుకోక ఈ పోలీస్ పని నీకెందుకురా.. మనం...’’
‘‘అమ్మా.. ఇది కోర్ట్.. మనం ఇంటికివెళ్లి మాట్లాడుకుందాం.. థాంక్స్ రాహుల్..’’ ముక్తసరిగా అతనితో అని-
‘‘అమ్మా.. నాన్నా.. కేసు అయిపోయిందిగా మీరింక మన ఊరు వెళ్లిపోండి.. మాకేం కాదు.. అక్కర్లేని ఆలోచనలతో బుర్రలు పాడు చేసుకోకండి.. ఏదో పొరపాటు జరిగిందని బంగారం లాంటి ఉద్యోగం వదలుకుంటామా.. పదండి.. మీతోబాటు వచ్చి నేను మిమ్మల్ని రాత్రి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి వస్తాము.. అన్నట్లు భగవాన్‌గారిని ఓసారి కలిసి థాంక్స్ చెప్పి వెడదాం.. రాహుల్ నువ్వు.. వస్తావా.. అనే్వష్ నువ్వు?’’ అడిగాడు అజిత్.
‘‘మేం ఆయనను తరువాత కలుస్తామని చెప్పు.. నువ్వు వాళ్ళని జాగ్రత్తగా పంపిరా..’’
‘‘అది కాదురా..’’ ఏమో చెప్పబోయిన తల్లిని వారించి అజిత్‌తో పంపేశాడు రాహుల్.
***
ఆ రోజు రాత్రి అనే్వష్, అజిత్, కమల్ ముగ్గురూ రాహుల్ రూంకి చేరారు...
వేరు వేరుగా బయలుదేరి వేరు వేరు దారుల్లో సుమారు రాత్రి పది గంటల వేళలో రాహుల్ సూచనల ప్రకారం అక్కడికి చేరారు.
‘‘కమల్, నీ పని ఎంతవరకూ వచ్చింది? అని అడిగిన రాహుల్‌ని అజిత్, అనే్వష్ ఆశ్చర్యంగా చూశారు.
‘‘మీకు కమల్ తెలుసా?’’ అన్న అనే్వష్ ప్రశ్నకు ‘‘నీకు ప్రమాదం ఉందనీ, నిన్ను తన ఇంట్లో ఉంచితే నువ్వు సేఫ్ అని అక్కడ పెట్టి లాక్ చేస్తే నువ్వు ఎలాగో బయటపడ్డావ్, నీకు ఏ రకంగానైనా ప్రమాదం ఎదురవుతుంది కనుక నిన్ను ఫాలో అయి సేవ్ చెయ్యాలని రాహుల్ చెబితేనే నేను నీ వెంట రావడం, లారీ ప్రమాదం నుంచి తప్పించడం జరిగింది’’.
‘‘రాహుల్.. ఇలా ఇంకా షాక్ ఇవ్వకుండా అసలు విషయానికి రండి.. నాకు ఒక విషయం అర్థం అయింది.. మీరు, కమల్ కలిసి ఆల్రెడీ ఆపరేషన్ ‘పరిశోధన’ స్టార్ట్ చేశారు.. దానికి సంబంధించిన వివరాలు కాస్త మాకు కూడా చెబితే.. మన నలుగురం కలిసి దీనిని త్వరగా ఒక కొలిక్కి తెద్దాం.. ఏమంటారు?’’

-ఇంకాఉంది

-మీనాక్షి శ్రీనివాస్