నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రీరఘురామ చారుతులసీ దళదామ శమక్షమాదిశృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార క బంధ రాక్షస విరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావం : సంపద్ప్రదమయిన రఘుమహారాజు జన్మించిన ఇక్ష్వాకువంశంలో జన్మించి భద్రాచల క్షేత్రంలో నివసించి ఉన్న దయాసముద్రుడవగు ఓ దశరథరామా! నీవు సుందరమైన తులసీ దళమాలను ధరించినవాడవు,. శాంతము, ఓర్పు , అనే మనోహర గుణములు గలవాడవు. స్వర్గమర్త్యపాతాళలోకములలో పొగడబడిన పరాక్రమ లక్ష్మికి అలంకారమైన వాడవు. ఎదిరించడానికి సాధ్యంకాని కబంధుడనే దుష్టరాక్షసుని సంహరించినవాడవు. సముద్రం వంటి అపారమైన జనుల పాపాలను దాటింప జేసే సామర్థ్యం కలవాడవు.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము