మంచి మాట

సరైన నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని మానసిక వికాసంతో మంచి ప్రవర్తనతో ముందుకు సాగితే అడ్డంకులు వాతటంటవే తొలగిపోతాయి. మంచి చెడులను గుర్తించి సుఖ దుఃఖాలను సమానంగా చూసే వాడికి జ్ఞానబోధ అవసరం రాదు. ఆలోచించి పనిచేసేవారు గొప్పవారిగా అందరి ప్రశంసలు పొందుతారు. సహనం కోల్పోయిన మనిషి ప్రవర్తన నిరాశ నిస్పృహలతో విచిత్రంగా ఉంటుంది. తనకు వచ్చిన అభద్రతాభావంతో ఆందోళనకు గురై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తికమకపడతాడు.
ఒక ఊరిలో ఒక రైతు దగ్గర గొప్ప బలమైన ఎద్దు వుండేది. అతను ఏ పని చెప్పినా శాంతంగా చెప్పిన పని చక్కగా చేసేది. అతను కూడా దాన్ని ప్రేమతో కొట్టకుండా జాగ్రత్తగా చూసుకొనేవాడు. ఆ ఎద్దు గురించి చుట్టుప్రక్కల గ్రామాల్లో గొప్పగా చెప్పకునేవారు. రైతు కూడా అందరితో తన ఎద్దు గురించి గొప్పగా చెప్పేవాడు. ఒక రోజు రైతు రచ్చబండ దగ్గర పెద్దమనుషులతో మాట్లాడుతూ ‘నా ఎద్దు ఒకేసారి వంద బస్తాల బరువు లాగేస్తుంది. కావాలంటే వెయ్యి వరహాలు పందెం’ అన్నాడు. ఆ మాట కొందరు వినీ విననట్టు వూరుకున్నా అతనంటే గిట్టనివాళ్లు కొంతమంది కలిసి పందేనికి సరే అన్నారు. పందెం రోజున ఊళ్ళో వాళ్ళు వంద బస్తాల బరువు ఎక్కించిన బండ్లు వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి సిద్ధంగా ఉంచారు. రైతు ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు మాత్రం ఇదంతా కొత్తగావుంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు కనుక అలా వూరికే నిలబడింది. అందరూ లాగు లాగు అంటున్నారు కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. యజమాని ఏం చెబుతాడోనని ఎదురుచూస్తూ అది అలాగే నిలబడి వుంది. రైతుకు అవమానంగా తల తీసేసినట్లనిపించింది. ఎద్దు ఎందుకు బళ్ళనులాగటం లేదని ఆందోళన మొదలైంది.
ఆ ఆందోళనలో తను దానికి లాగమని చెప్పనే లేదని అతనికి గుర్తుకు రాలేదు. పైగా అది తన పరువు తీస్తోందని ఒక్కసారిగా కోపం వచ్చి అంత తిండి తింటున్నా ఈ మాత్రం లాగలేవా, వెయ్యి వరహాలు పోతున్నాయని తిడుతూ అందరిలాగే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఎప్పుడు ఒక్క దెబ్బ కూడా వెయ్యని అతను అంత కోపంగా అరవటం, పైగా చర్నాకోలతో ఇష్టం వచ్చినట్లు కొట్టడం ఎందుకు ఏ మాత్రం నచ్చలేదు.
దాంతో అది పూర్తిగా మొండికేసింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టి కొట్టి అలసిపోయిన రైతు అందరి ముందు ఓటమిని అంగీకరించి పరువు పోగొట్టుకొని వెయ్యి వరహాలిచ్చి తలదించుకొని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అసలుసంగతిని గ్రహించి, మాట నెగ్గాలన్న తొందరలో దాన్ని అనవసరంగా క్రూరంగా హింసించానని, సున్నితంగా వున్న దాని మనసుని గాయపరిచానని గ్రహించి క్షమించ మని అడిగాడు. ఎద్దుకు తగిలిన దెబ్బలన్నింటికీ మందు రాసి నయం అయ్యేట్టు చేశాడు. మళ్లీ ఎద్దు మీద పందెం కాచి గెలిచాడు కాని ఈసారి ఎద్దును ఏమాత్రం బాధపెట్టలేదు. అపుడుఅతను ఒక విషయం తెలుసు కొన్నాడు. క్షణికమైన ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు. విచక్షణతో, ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే సాధించలేనిది ఏమీ లేదని తెలుసుకోవాలి. అందుకే ఏ పని చేసినా అందులో సహనం ఉండాలి. ఎదుటివారి మనసును గెలిచే ప్రయత్నం చేయాలి. అదీ ప్రేమతో అపుడే అనుకొన్న పనులు సులువుగా సాగుతాయ.

-కాకరపర్తి సుబ్రహ్మణ్యం