డైలీ సీరియల్

బడబాగ్ని 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో తెలియకుండా అతని వెనకే తిరిగేవాళ్లం. హోటల్స్, సినిమాలు, అప్పుడప్పుడు మందు పార్టీలు, ఇంచుమించు మా అందరి సరదా ఖర్చులూ అతనే పెట్టేవాడు.. అందుకేనేమో.. మాకు అతనితో స్నేహం వదులుకోలేని వ్యసనం అయింది..’’ చెబుతూ చెబుతూ ఆగాడు, బహుశా ఆ రోజులు గుర్తుచేసుకునేందుకేమో అన్నట్లు.
‘‘అదేమిటి అందరం కలిసి రాత్రి మందు పార్టీ పెట్టుకుంటే నువ్వెళ్లిపోతే ఎలా? నువ్వెళ్లడానికి వీల్లేదు గాక వీల్లేదు’’ మొండిగా మళ్లీ అన్నాడు భార్గవ్.
‘‘లేదురా. నే వెళ్లాలి.. ’’ అప్పటికే లేచి తన బాగ్ తీసుకుంటూ అన్నాడు.
‘‘ఏంట్రా.. చెబుతుంటే.. పెద్ద బుద్ధిమంతుల్లా ఆ ఫోజు.. ఒరే పట్టుకోండిరా.. వీడికి కొంచెం పట్టిస్తే వాడే పడుంటాడు..’’
‘‘పోనీరా.. ఒకడు తగ్గినా మనకు మంచిదే. మన వాటాకి ఎక్కువ వస్తుంది.. వాడికి ఏమైనా పనుందేమో...’’ అన్నాను నేను, వాడు మాటిమాటికి అమ్మాయిలు వెళ్లిన వైపే చూస్తూండడం గమనించి...
‘‘అవునురా. నాకు పనుంది.. వెడతాను..’’ కదులుతున్న వాడిని పట్టుకుని విసురుగా తోసేసి బలవంతంగా నోరు తెరిచి మందు పోసేసారు భార్గవ్ సైగతో...
‘‘మల్లిక నా కోసం.. చూస్తూంటుంది..’’ నిషా తలకెక్కడంతో నోరు జారాడు రవీంద్ర..
‘‘ఓ... అందుకా పోతా.. పోతా అంటున్నావ్. ఎంత ఒక్క గంట ఉండు.. వెళ్లిపోదువ్‌గాని.. ఒరే వెళ్లి మల్లికని మనోడు రమ్మంటున్నాడని పిల్చుకరా పో’’.
కన్ను మలిపాడు భార్గవ.
అప్పటికే అందరికీ నిషా తలకెక్కింది.
‘‘వద్దురా.. మల్లిక భయపడుతుంది.. మనం తాగి చేసే గొడవకి... నన్నొదిలేయండిరా నే పోతా.. మల్లికా.. ఉండు నేనొచ్చేస్తున్నా...
లేచి దుబ్బున పడిపోయాడు..
పాపం జరిగే ఘోరం తెలియని మల్లికా అక్కడికి రావడం.. పరిస్థితి అర్థం అయి పరిగెత్తబోయి... కంగారులో పడిపోయి భార్గవ చేతికి చిక్కిపోయింది.. అంతా తాగిన మైకంలో ఉన్నాం.. ఏం జరుగుతుందో తెలియని స్థితి.. మల్లిక అరచిన అరుపులు.. ఆక్రందన, అంత మత్తులోనూ... రవీంద్ర విశ్వప్రయత్నం చేశాడు ఆమెని రక్షించాలని.. ప్చ్.. మల్లిక ఘోరకలికి బలి అయిపోయింది.
మర్నాడు ఉదయం తెలివి వచ్చి చూసేసరికి ప్రాణం లేని మల్లిక... తనమీద పడి.. గోలు గోలున ఏడ్చాడు రవీంద్ర..
మా అందరికీ ఏం చెయ్యలో అర్థం కాలేదు.. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో అలా ప్రవర్తించాం కాని భగవంతుడి సాక్షిగా అలా ప్లాన్ చేసుకు చేసిన తప్పుకాదు. ఏది ఏమైనా తప్పు తప్పే... నూరేళ్ల మల్లిక జీవితం అలా మొగ్గ దశలోనే రాలిపోయింది.. రవీంద్ర చేసిన గొడవ, అల్లరి అంతా ఇంతా కాదు.. ఆమె దుర్మరణానికి తనే కారణం అంటూ పిచ్చి వాడిలా ఏడ్చాడు.. అతనికి ఆమెమీద అంత ప్రేముందని అప్పటివరకూ మాకెవరికీ తెలియదు...
మా అందరిలో ముందుగా తేరుకున్నది భార్గవే...
‘‘జరిగిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది.. పోయిన మల్లికని ఎవరూ తిరిగి తేలేం.. యిపుడు రుూ విషయం బయటపడితే అందరి జీవితాలు నాశనం అవుతాయి... అందుకే చీకటి పడేదాకా ఇక్కడే గడిపేసి. డెడ్‌బాడి నదిలో పడేసి.. వెళ్లిపోదాం.. మళ్లీ చెబుతున్నా, ఈ విషయం బయటికి పొక్కితే అందరం జైలుపాలే.. అసలు తప్పంతా రవిగాడిది.. ఆ అమ్మాయిని ఉండమనకుండా ఉంటే బాగుండేది..’’ వాడి మాటల్లో పెద్దగా బాధ కనబడలేదు.
‘‘ఎలాగూ తను మిగతా అమ్మాయిలతో యిక్కడనుంచి వెళ్లిపోయింది కాబట్టి.. అందరూ ఒక్కమాటమీద నిలబడి తన గురించి తెలియదని చెబుదాం. ఒరే రవీ నువ్వేమైనా పిచ్చివాగుడు వాగినా.. జరిగింది ఎవరికైనా చెప్పినా.. నేరం నీమీదే బనాయిస్తాము.. నువ్వెటు కాలేజీలో తన చుట్టూ తిరుగుతూ ఉంటావ్ కాబట్టి అందరూ నమ్ముతారు.. నీ పని క్లోజ్.. పాపం రవి పిచ్చివాడిలా చూసేడు.. ఆ రాత్రి బాగా పొద్దుపోయేవరకూ అక్కడే ఉండి.. మల్లిక శవం జంబుఖానాలో చుట్టి ఈడ్చుకెళ్లి నదిలో పారేశాం.. అప్పుడు నది ఉదృతంగా ఉండటంతో శవం ఎక్కడికో కొట్టుకుపోయింది..
తరువాత మల్లిక తల్లిదండ్రులు మిగతా అమ్మాయిలని.. కాలేజ్ వాళ్ళని అడిగితే పిక్నిక్‌నించి ఆ సాయంత్రమే వచ్చేసిందని చెప్పడం.. ఆ తరువాత రవీంద్ర ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లిపోవడంతో.. సెలవల తరువాత రవీంద్ర. మల్లికా కలిసి లేచి పోయారని పుకారు పుట్టించేడు భార్గవ.. ఆ కధ అక్కడితో ముగిసిపోయిందనుకున్నాం.. కొన్నాళ్లకు అందరం ఆ సంగతే మరచిపోయాం..’’ కొద్దిగా ఆగాడు అలుపు తీర్చుకుందుకు.
‘‘రోహిత్.. ఆదిత్య ఎక్కడో హత్యగావించబడ్డారు అంటే.. ఏదో కారణం అనుకున్నా కానీ... మొత్తం నలుగురూ అంటే.. యిది బహుశా పగతో రవీంద్ర చేసిన పనేమో అనిపిస్తోంది.. ఇక నెక్స్ట్ నావంతేనేమో..’’ భయంతో వణికింది మహేష్ గొంతు.
‘‘అతని పూర్తిపేరు.. ‘రవీంద్ర’ అంతేనా...’’ కమల్ అడిగాడు...
‘‘రవీంద్ర.ఎస్..’’
‘‘రవీంద్ర.ఎస్..’’ ఈ పేరు ఎక్కడైనా విన్నానా డెహ్రాడూన్‌లో ఈమధ్య.. ఒక్కక్షణం తరువాత.. వెలిగింది కమల్ బుర్రలో.. ఎస్.. వి గాట్ యిట్. అనే్వష్ వాళ్ల ట్రైనింగ్ సెంటర్‌లో.. ఆ పేరుతో ఎవరైనా ఉన్నారేమో అనే్వష్ వాళ్లని అడిగితే తెలుస్తుంది.

-ఇంకాఉంది

బడబాగ్ని 27

- మీనాక్షి శ్రీనివాస్