నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరణి కులేశ నా నుడుల తప్పులు కల్గిన నీదు నామ స
ద్విర చితమైన కావ్యము పవిత్రము గాదె? వియన్నదీ జలం
బరగుచు వంకయైన మలినాకృతి బారిన తన్మహత్త్వముం
దరమె గణింపనెవ్వరికి? దాశరధీ! కరుణాపయోనిధీ!

భావము:సూర్యవంశంలో జన్మించిన శ్రేష్ఠుడవైన శ్రీరామా! నేను వ్రాసిన పద్యాల్లోని శబ్దాల్లో, మాటల్లో దోషాలున్నప్పటికీ ఆ పద్యాలు నీ నామముతోడ రచించబడినవి కాబట్టి ఈ కావ్యము పవిత్రమైనదే కదా! అట్లే అగునని భావం. మూడు లోకాల్లో ప్రవహించే గంగానది నీరు తన ప్రవాహంలో ఒక చోట వంకరగా వున్నప్పటికీ బురద మొదలైన మాలిన్యంతో ప్రవహించినప్పటికీ దాని గొప్పదనము ఎన్నుట సాధ్యమా! దాని మహత్త్వానికి భంగం కలుగదు అని భావం.

దాశరథీ శతకములోని పద్యము