భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! - 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు గమనించినట్లు లేదు! ఆ ప్రాంతం యక్షులది! వాళ్లే ఆ రూపాలలో అక్కడ విహరిస్తున్నారు! రంభుని మరణంతో మహిషి రూపంలోని యక్షిణి దుఃఖిస్తూ భర్తతోపాటు సహగమనానికి సిద్ధమైంది! గర్భవతియై వున్న ఆమెకు పుత్రోదయమైంది మహిషాకారంతో జన్మించిన ఆ పుత్రుడిని యక్షులు చేరదీసి మహిషాసురుడని పేరు పెట్టారు! పుడుతూనే యువకుడైన ఆ మహిషాసురుడికి మాయావిద్యలన్నీ బోధించారు యక్షులు, రాక్షస గురువు శుక్రాచార్యుడు! మహిషాసురుడు శుక్రుని వెంట పాతాళాన్ని చేరుకుని దానవరాజైనాడు’’ అని చెప్పి ఇంద్రునిలో భయాందోళనలు పెరిగేలా చేసాడు నారద మహర్షి.
***
‘‘సోదరా! మహిషాసురా! నీవు అత్యంత బలపరాక్రమవంతుడివై వచ్చి మన దానవ సామ్రాజ్య సింహాసనాన్నధిష్టించడం నాకెంతో ఆనందం కలిగిస్తున్నది! పాలనాభారాన్ని నీకు ఒప్పగించి నా బాధ్యత తీర్చుకుంటున్నాను!’’ మహిషాసురుని దావన సామ్రాజ్యానికి అధిపతిగా ప్రకటిస్తూ అన్నది మహిషి! అప్పటివరకూ ఆమే పాలన సాగిస్తూ దేవ, మర్త్యలోకాలను ఆక్రమించాలన్న ఆశతో సమయం కోసం ఎదురుచూస్తూ వున్నది. అందుకు సరైన సమయం ఆమె సోదరుడు వచ్చాకే ఆసన్నవౌతుందని శుక్రాచార్యుడు చెప్పడంతో అతనికోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది!
మహిషాసురుడు పట్ట్భాషిక్తుడైన సమయానికి శుక్రుడు వచ్చాడు అతడికి కర్తవ్యోపదేశం చేయడానికి!
‘‘గురుదేవా! సమయానికి వచ్చారు! నన్ను ఆశీర్వదించండి! ఇప్పుడే దానవ సైన్యాలతో కదలి వెళ్లి స్వర్గ మర్త్యలోకాలను ఆక్రమించుకుని వస్తాను! మా తండ్రి పొందిన వరప్రభావంవల్ల వారెవ్వరూ నన్ను జయించలేరు గదా!’’ అన్నాడు మహిషాసురుడు బలదర్పాలు వుట్టిపడుతున్న స్వరంతో ఠీవిగా చూస్తూ!
‘‘నీ ఆశయం మంచిదే కానీ వేగిరపాటు కూడదు! దేవతలు నిన్ను జయించలేకపోయినా, దేవతల పక్షపాతి మహావిష్ణువు ఏదో ఒక మాయతో నిన్ను వధించివేయగలడు. అందుకే తొందర పడవద్దని హెచ్చరిస్తున్నాను! ముందుగా నీవు బ్రహ్మను తపస్సుతో మెప్పించి త్రిమూర్తుల వల్ల మరణం లేకుండా వరం పొంది వచ్చి ఆపైన దేవతలపై యుద్ధ్భేరి మ్రోగించు, నీ ఆశయం నెరవేరుతుంది!’’ అని శుక్రుడు ఉపదేశించడంతో ఆయన చెప్పినట్లే తపస్సుకు తరలి వెళ్లాడు మహిషాసురుడు!
కఠిన తపస్సుతో బ్రహ్మను మెప్పించి స్ర్తి తప్ప త్రిమూర్తులతో సహా దేవతలు, మానవులు, ఇతరులెవరి చేతిలో మరణం లేకుండా వరం పొందాడు. స్ర్తిలు అబలలు, వారివల్ల తన వంటి బలపరాక్రమోపేతుడికి ఏ భయమూ వుండదు! అవలీలగా వారిని జయించవచ్చును! అయినా ఏ స్ర్తి తనపై దండెత్తి వచ్చే సాహసం చేయగలదు? అని తనలో తానే ఆనందపడుతూ తన రాజ్యానికి తిరిగి వచ్చాడు మహిషాసురుడు!
మహిషి ప్రేరణతో స్వర్గంపై దాడి చేసి దేవతలను ఓడించి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు! దేవతలు మహిషాసురుని ధాటికి నిలవలేక భూలోకాన్ని చేరి అరణ్యాలలో గుహలో నివశిస్తూ మంచి కాలం కోసం నిరీక్షిస్తూ గడపసాగారు! భూలోకాన్ని పాలిస్తున్న రాజులనందరినీ జయించి వారిని తన ప్రతినిధులుగా నియమించి తాను స్వర్గ్భోగాలు అనుభవిస్తూ కాలం గడపసాగాడు మహిషాసురుడు!
***
‘‘త్రిమూర్తులకు ప్రణామాలు! హే! సృష్టి, స్థితి లయకారకులారా! వరగర్వంతో మహిషాసురుడు కావిస్తున్న ఆగడాలు అంతకంతకు ఎక్కువౌతున్నాయి! తన రాక్షస పాలనతో సాధు, సజ్జనులను హింసిస్తూ, యజ్ఞ యాగాలను అడ్డుకుంటూ ఆనందిస్తున్నాడు. అతనిని అంతం చేసే ఉపాయం తెలియజేయండి స్వామీ!’’ అంటూ త్రిమూర్తులను దర్శించి వేడుకున్నారు ఇంద్రాది దేవతలు, ఋషిగణాలు!
‘‘దేవతలారా! మహిషాసురుని సంహరించగలది ఒక్క దేవీమాతయే! వరప్రభావంవలన మాలో ఎవరి చేతా మరణం లేని ఆ అసురుడిని అసాధారణ రూపంలో ఆవిర్భవించి జగన్మాత అంతంకావిస్తుంది! అందరూ కలిసి ఆ మాతను ధ్యానించండి!’’ అని బ్రహ్మ చెప్పడంతో అందరూ కన్నులరమోడ్చి భక్తిపూర్వకంగా దేవీమాతను స్తుతించసాగారు!
‘‘అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం!
శ్రీ్భవనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం!!
వీణావాణి విమల స్వరూపిణి వేదాంతరూపిణి పాలయామాం!
కౌమితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారి పాలయమాం!’’
అంటూ వాళ్లు స్తుతిస్తుండగా వాళ్లముందర దివ్యకాంతులు వెదజల్లుతూ తేజో మండల మధ్యంలో దేవీమాత సాక్షాత్కరించింది! అందరూ భక్తి ప్రపత్తులతో నమస్కరించి మహిషాసురుని వధించమని వేడుకున్నారు! దేవి వాళ్లవైపు ప్రసన్నంగా చూసింది!
‘‘దేవతలారా! మహిషాసురుడు ప్రకృతి రూపమైన స్ర్తి శక్తిని సామాన్యంగా భావించి తనను అజేయుడుగా భావించుకుంటున్నాడు! అతని గర్వాహంకారాలను అణచి అంతం కావించడానికి ఆవిర్భవించిన ఈ రూపాన్ని దర్శించండి!’’ అన్నది!
దేవతలు, త్రిమూర్తులు ఆశ్చార్యానందాలతో చూస్తుండగా వాళ్లందరి నుండి తేజాలు వెలువడి దేవీమాతలో విలీనం చెందాయి! అద్భుతంగా ప్రకాశిస్తున్న రూపంతో, వివిధాయుధాలు హస్తాలలో ధరించి సింహ వాహనంపై తరలివెళుతున్న మాతకు ప్రణామాలర్పించారు దేవతలు!
దేవీమాత మహిషుని పురబాహ్యంలో నిలిచి శంఖాన్ని పూరించింది! ఆ నాదాన్ని, ఆమె రూపాన్ని చూసి భయభ్రాంతులైన రాక్షస భటులు ఎవరో దివ్యాంగన సింహవాహనారూఢురాలై పురబాహ్యంలో నిలిచివున్నదన్న వార్తను తమ ప్రభువుకు నివేదించారు!
‘దివ్యాంగన’ అన్న వార్త మోహవిశుడిని చేసింది మహిషాసురుని!
‘‘దివ్యాంగనా? అయితే అసమాన సౌందర్యవతియై వుంటుంది! అటువంటి కాంత నా పట్టమహిషి కావాలి! వెంటనే వెళ్లి ఆమెకు నా అభీష్టం తెలిపి సగౌరవంగా సభకు తీసుసుకురండి! వెళ్లండి వెంటనే!’’ అంటూ మంత్రులను ఆదేశించాడు!
ప్రక్కనే కూర్చుని వున్న మహిషి మాత్రం గంభీరంగా ఆలోచనామగ్నురాలైంది ఆ వార్త విని!
‘‘సోదరా! తొందరపడకు! ఆమె ఎవరో, ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా వివాహ రాయబారం సాగించడం మంచిది కాదు! ముందు ఆ వివరాలు తెలుసుకోవాలి!’’ అన్నది.
‘‘ఆ వివరాలు తెలుసుకోండిగానీ ఆమెను మాత్రం త్వరగా నా సముఖానికి తీసుకుండి! అని చెప్పి పంపాడు మహిషాసురుడు!
వెళ్లినవాళ్లు కొద్దిసేపటిలో తిరిగివచ్చారు! వాళ్ల ముఖాలలో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి! వౌనంగా నిలిచారు!
‘‘ఆ దివ్యాంగన రానన్నదా? ఏం జరిగింది? చెప్పండి త్వరగా!’’ అరిచాడు మహిషుడు అసహనంగా!
‘‘ప్రభూ! అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి సింహవాహనంపై ఆసీనురాలై వచ్చిన ఆ దివ్యాంగన మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానిస్తున్నది! తనను యుద్ధంలో గెలిచితే మీ అభీష్టం నెరవేరుతుందని తెలియజేయమన్నది! మీ బల పరాక్రమాల గూర్చి ఎంతగానో చెప్పి చూశాము! కానీ ఆమె మా మాటలు లక్ష్యపెట్టలేదు!’’ అన్నారు భయం భయంగా చూస్తూ!
‘‘ఎంత సాహసం? నా మాటను మన్నించకుండా ననే్న యుద్ధానికి ఆహ్వానిస్తున్నదా! ఇప్పుడే వెళ్లి నా శక్తి సామర్థ్యాలు తెలిసేలా చేసి వస్తాను!’’ అంటూ ఆవేశంగా గదనందుకుని లేచాడు మహిషుడు!
‘‘సోదరా! ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు ఆలోచన! ఇది ఆ దేవతల పన్నాగంలా నాకు తోస్తున్నది! స్ర్తి చేతిలో మరణాన్ని నీవే కోరుకున్నావుగనక ఈ దివ్యాంగనను ముందర నిలిపి వాళ్లందరూ ప్రచ్ఛన్నంగా నిలిచి నిన్ను బందీని చేయజూస్తున్నట్లున్నారు!

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- డా. టి.కళ్యాణీ సచ్చిదానందం