మంచి మాట

విజయానికి దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం కర్మభూమి. ఇక్కడ ఎందరో మహనీయులు అవతరించారు. మానవులుగా పుట్టిన వారందరూ వివేకవిచక్షణాలు కలవారే. సృష్టిలో ప్రాణులంతా సమానమే అయనా మానవులు బుద్ధి జ్ఞానాల రీత్యా ఇతర మృగ జాతి కన్నా మెరుగైన ప్రాణిగా చెప్పుకోవచ్చు. సృష్టికి మూలమైన శక్తి అన్ని ప్రాణుల రూపంలోను తన్ను తాను సృజియంచుకుని ధర్మాన్ని కాపాడుతూ వచ్చింది.
అట్లానే మానవులుగా కూడా శక్తి లేక చైతన్యం లే క భగవంతుడు తన్ను తాను పూర్తి మానవరూపంలోనే అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు గా సృజియంఛుకున్నాడు. శ్రీరాముడు కేవలం మానవుడినని చెప్పినా ధర్మం యొక్క విలువను ఆ ధర్మాచరణలో వచ్చే చిక్కులను విడదీసుకొంటూ అనేక కష్టాలను తొలగించుకుంటూ ధర్మాన్ని సుస్థాపితం చేశాడు. అట్లాగే కృష్ణుడు కూడా అనేక మంది అధర్మపరులను నాశనం చేసి చివరకు ధర్మానే్న స్థాపితం చేశాడు. పైగా ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ నేను వస్తాను. అధర్మాన్ని కాలరాస్తాను. ధర్మానే పునఃస్థాపిస్తాను. ధర్మపరుల యోగక్షేమాలను నేను ఎల్లవేళలా కాపాడుతాను అని చెప్పాడు.
ఇన్ని తెలిసిన మానవుడు మాత్రం స్వార్థంతో పక్కవానిని నాశనం చేసి తాను మాత్రమే బాగుండాలని ఆలోచిస్తాడు. ఈ స్వార్థంలో అన్యాయాలు, అధర్మాలు చేస్తాడు. దీనికంతా కారణం అతనిలోని కామనయే. ప్రతివారికి కోరిక ఉండడం సహజం. కాని ఆ కోరిక సమంజసమైనదా దాని వల్ల నాకు మాత్రమే లాభం ఉందా లేక ఇతరులకు నష్టాన్ని వాటిల్లచేస్తుందా అన్న విజ్ఞతతో ఆలోచిస్తే ధర్మాచరణ సులభమని పెద్దలు అంటారు. అప్పుడు కొంతవరకు తాను చేసే పనులను ధర్మబద్ధంగా చేయగల్గుతాడు.
వేదాలు మానవుని యొక్క నిత్య జీవన ధర్మాలు స్పష్టంగా చెప్పాయి. మానవుడంటే మననశీలుడు. అనగా ఆలోచించి పనులు చేసేవాడని అర్థం. కనుక కోరిక కలిగినా దాని పూర్వాపరాలు ఆలోచించాలి. దానికి మనిషికి జ్ఞానం ఉండాలి. జ్ఞానార్జనకు చదువు ముఖ్యం. చదువులేకపోతే పశువుతో సమానం అన్న సామెతలోని అంతరార్థం ఇదే.
కనుకనే ప్రతివారు చదువుకుని ఇంద్రియాలను చెడు మార్గాలవైపు పోనీయకుండా సన్మార్గంవైపు దృష్టి మరల్చుకోవాలి. మనస్సు చాలా చంచలమైనది. పెద్ద తపస్సు చేసినవారే మనస్సుకు లొంగిపోయారని పురాణాలు చెబుతాయ. కనుక ఆ మనసును అధీనంలో ఉంచుకుంటూ ఆకర్షణలకు లోనుకాకుండా విజ్ఞతను వివేకాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు తనకోసం జీవించడం ఘనత కాదు. పరుల కోసం జీవించడమనేది మెచ్చు కోదగినది. కనుక ఆలోచించి కీర్తికారకమైన పనులు చే యాలి. నలుగురూ బాగుంటే తాను బాగుండవచ్చు అన్న ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇతరులు నీకు చేసిన అన్యాయం వలననో అప్రియంవలననో అనాదరంవలననో నీకు కీడు కలిగితే ఇతరులకు అటువంటి కీడు కలిగించే పనులు చేయకూడదని అని భారతం చెబుతుంది. కనుక తానునొవ్వక, ఇతరులను నొప్పించక పనులు చేసుకొనే వాడే ఉత్తమమైన మనుజుడుగా పిలువబడుతాడు. మానవత్వంతో, ధర్మా చరణతోనే అన్నింటా విజయాన్ని సాధించవచ్చు. కనుక మానవులందరూ భగవంతునిపైన నమ్మకం కలిగి ఉండడమే కాకుండా ధర్మాచరణనే చేయాలి. అపుడే మానవజీవనానికి సార్థకత ఏర్పడుతుంది.

- ఎస్ . అఖిల్